భోలా పాశ్వాన్ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భోలా పాశ్వాన్ శాస్త్రి
రాజ్యసభ ప్రతిపక్ష పార్టీ నాయకుడు
In office
24 ఫిబ్రవరి 1978 – 23 మార్చి 1978
అంతకు ముందు వారుకమలాపతి త్రిపాఠి
తరువాత వారుకమలాపతి త్రిపాఠి
మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ
In office
31 మే 1972 – 2 ఏప్రిల్ 1982
నియోజకవర్గంబీహార్
8వ బీహార్ ముఖ్యమంత్రి
In office
2 జూన్ 1971 – 9 జనవరి 1972
అంతకు ముందు వారుకర్పూతి ఠాకూర్
In office
22 జూన్ 1969 – 4 జూలై 1969
అంతకు ముందు వారుహరిహర్ సింగ్
తరువాత వారురాష్ట్రపతి పాలన
In office
22 మార్చి 1968 – 29 జూన్ 1968
గవర్నర్నిత్యానంద్
అంతకు ముందు వారుబి.పి. మండల్
తరువాత వారురాష్ట్రపతి పాలన
వ్యక్తిగత వివరాలు
జననం(1914-09-21)1914 సెప్టెంబరు 21
పూర్ణియ జిల్లా, బ్రిటిష్ ఇండియా
మరణం1984 సెప్టెంబరు 10(1984-09-10) (వయసు 69)[1]
ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిశాంతి సోరెన్, శుశీల రిక్రూట్‌మెంట్
నివాసంపాట్నా
కళాశాలవారణాసి
నైపుణ్యంరాజకీయ నాయకుడు
సమాజ సేవకుడు
శాస్త్రి

భోలా పాశ్వాన్ శాస్త్రి (1914-1984) ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.[2]

పరిచయం[మార్చు]

పాశ్వాన్, పూర్నియా జిల్లాలోని బైర్‌గచ్చి గ్రామంలో జన్మించాడు. అతని జ్ఞాపకార్థం జిల్లాలోని అగ్రికల్చర్ కళాశాలకు అతని పేరు పెట్టారు. భోలా పాశ్వాన్ అణగారిన కులానికి చెందిన ఉన్నత విద్యావంతుడు, ఇతనికి ఉన్న విస్తృత జ్ఞానం కారణంగా అతన్ని శాస్త్రి అని పిలుస్తారు. భోలా పాశ్వాన్, షెడ్యూల్డ్ కులాల (SC) నుండి ఎన్నికైన బీహార్ రాష్ట్ర మొట్ట మొదటి ముఖ్యమంత్రి.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ముఖ్యమంత్రిగా అతని కొంత కాలమే పనిచేసినా, గ్రామం అతన్ని మూడు కాలాల ముఖ్యమంత్రిగా, నిజాయితీపరుడిగా గుర్తుంచుకుంది. అతని చివరి పదవీకాలం ముగిసిన తర్వాత చాలా కాలం వరకు కూడా గుడిసెలో తన జీవితాన్ని కొనసాగిస్తూ, నేలపైనే నిద్రించే వాడని స్థానిక గ్రామస్తులు చెబుతారు. అతని గ్రామంలో ప్రతిచోటా అతని పేరుతో ప్రదర్శించబడే బోర్డులు కనిపిస్తాయి. అతని గ్రామానికి అతని పేరుతో "భోలా పాశ్వాన్ శాస్త్రి గ్రామ్" అని పేరు పెట్టారు. శాస్త్రి పేద ఇంటిలో జన్మించాడు. అతని తండ్రి దర్భాంగ రాజ కుటుంబంలో పని చేసేవాడు. అతనికి సమాజం చదువుకోవడానికి ప్రోత్సహించనప్పటికీ, అతనికి ఉన్న ఆసక్తి వలన కాశీ విశ్వవిద్యాలయానికి వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాడు.[4]

రాజకీయ వృత్తి[మార్చు]

1968 లో అతను మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ పదవిలో ఇతను కేవలం మూడు నెలలు మాత్రమే కొనసాగాడు. బీహార్‌లో ఒక దళితుడు ముఖ్యమంత్రి కావడం ఇదే మొదటిసారి. 1969 లో 13 రోజుల పాటు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. 1971 లో 7 నెలల పాటు మూడవసారి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న భోలా పాశ్వాన్ శాస్త్రి 1984లో కన్నుమూశాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "Obituary Reference" (PDF). Lok Sabha Debates. Eighth Series. 1 (4): 3–4. 18 January 1985. Retrieved 25 July 2021.
  2. 2.0 2.1 Dipankar, Ghose (7 November 2020). "Stirrings in home of Bihar's first Dalit CM: the poor want to be counted" (in ఇంగ్లీష్). The Indian Express. Retrieved 23 February 2021.
  3. . "Chief Ministers of Bihar Since 1947". BiharJagran.com. Retrieved 2011-09-06.
  4. "Archived copy". Archived from the original on 2014-10-06. Retrieved 2021-09-22.{{cite web}}: CS1 maint: archived copy as title (link)