భారత ఎన్నికల సంఘం 1962 మే 7న భారత రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ కు 553,067 ఓట్లు వచ్చాయి. తన ప్రత్యర్థి చౌదరి హరి రామ్ కు 6,341 ఓట్లు వచ్చాయి, యమునా ప్రసాద్ త్రిసులియాకు 3,537 ఓట్లు వచ్చాయి. దీంతో అత్యధిక ఓట్లు సర్వేపల్లి రాధాకృష్ణన్ కు రావడంతో రాష్ట్రపతి ఎన్నికలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విజయం సాధించాడు.