యశ్

వికీపీడియా నుండి
(యష్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
యాష్
జననం
నవీన్ కుమార్ గౌడ్

కర్ణాటక భువనహల్లి
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
జీవిత భాగస్వామిరాధికా పండిట్
పిల్లలుఐరా, యథర్వ్

పూర్తి పేరు నవీన్ కుమార్ గౌడ్, రంగస్థల పై పేరు యాష్ గా పిలుస్తారు. కన్నడ సినిమా నటుడు.[1][2]

ప్రారంభ జీవితం[మార్చు]

నవీన్ కుమార్ గౌడ్ 1986 జనవరి 8న కర్ణాటకలో హసన్ లోని భువనహళ్లిలో జన్మించాడు.[3] తండ్రి అరుణ్ కుమార్ కె.ఎస్ఆర్టిసి రవాణా సేవలో,డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తల్లి పుష్ప లతా [4] యశ్ నందిని అనే చెల్లెలు ఉంది. యశ్ చిన్ననాటి రోజులు మైసూర్‌ లో ఉండేవాడు. కర్ణాటకలోని మైసూర్ లోని మహాజన హై స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించాడు.చదువు పూర్తయిన తరువాత, నాటక రచయిత బివి కరాంత్ చేత ఏర్పడిన బెనకా డ్రామా బృందంలో చేరాడు.స్టేజ్ షోలు, టీవీ సీరియల్స్ తో అరంగేట్రం చేశారు. యష్ గాయకుడిగా కూడా సినీపరిశ్రమకు సుపరిచితుడు.[5]

కెరీర్[మార్చు]

యష్ తన నటనా జీవితాన్ని 2004 లో ఉత్తరాయణ అనే టీవీ సీరియల్ ద్వారా ప్రారంభించాడు.నందా గోకుల, ప్రీతి ఇల్లాడ మేలే, శివలలో వంటి టెలిసీరియల్ నటించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

నంద గోకుల సెట్స్‌పై యాష్ రాధిక పండిట్‌ పరిచయం ఏర్పడింది. 2016 ఆగస్టులో గోవాలో నిశ్చితార్థం చేసుకున్నారు.[6]2016 డిసెంబర్ 9న పెళ్లి జరిగింది.[7]ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. 2018 డిసెంబర్ 2న జన్మించింది.[8][9]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమా
2007 జంబాడా హుడుగి
2008 మొగ్గినా మనసు
2008 రాకీ
2009 కల్లర సంతే
2009 గోకుల
2010 తమస్సు
2010 మొదలసల
2011 రాజధాని
2011 కిరాతక
2012 లక్కీ \ లక్కీ స్టార్- తెలుగు
2012 జాను
2012 డ్రామా
2013 చంద్ర
2013 గూగ్లీ
2013 రాజా హులి
2014 గజకేసరి
2014 మిస్టర్ అండ్ మిసెస్ రామచారి
2015 మాస్టర్ పీస్
2016 సంతు స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ (కన్నడ)
రారాజు (తెలుగు)
2018 కె.జి.యఫ్ చాప్టర్ 1
2020 కె.జి.యఫ్ చాప్టర్ 2

పురస్కారాలు[మార్చు]

  • 2009లో యశ్ తన మొగ్గినా మనసు చిత్రం కోసం ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ లో ఉత్తమ సహాయ నటుడు - కన్నడను గెలుచుకున్నాడు.[10]
  • డ్రామా (2013), గూగ్లీ (2014) చిత్రాలకు యష్ ఉత్తమ నటుడు - కన్నడకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ఎంపికయ్యాడు .[11]
  • 2015లో, యష్ ఉత్తమ నటుడు - కన్నడను ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, సినీ అవార్డులలో సాధించాడు.[12]

మూలాలు[మార్చు]

  1. "Who is Naveen Kumar Gowda in Sandalwood?". The Times of India. 27 January 2014.
  2. "Who is Naveen Kumar Gowda in Sandalwood?". The Times of India. 27 January 2014. Retrieved 26 January 2017.
  3. "YouTube". www.youtube.com. Retrieved 2020-03-30.
  4. "Actor Yash family, childhood photos – Rocking star | Celebrity family wiki" (in అమెరికన్ ఇంగ్లీష్). 15 September 2014. Retrieved 2020-03-30.
  5. "wikibio.in/yash/amp/".
  6. BengaluruAugust 12, Aravind Gowda; August 12, 2016UPDATED; Ist, 2016 15:36. "Actors Yash and Radhika get engaged in Goa". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-03-30. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  7. "Kannada actors Yash and Radhika Pandit tie the knot in a dream wedding, see pics". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-12-09. Retrieved 2020-03-30.
  8. "Inside Yash and Radhika Pandit's daughter Ayra's 1st grand birthday bash; Check it out". PINKVILLA (in ఇంగ్లీష్). Archived from the original on 2020-05-28. Retrieved 2020-03-30.
  9. Eenadu (2 May 2022). "సీరియల్లో కలుసుకుని.. జీవితంలో ఒక్కటయ్యారు". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  10. "56th Idea Filmfare Awards 2008 South: The winners". The Times of India. August 2009. Retrieved 5 April 2015.
  11. "60th Idea Filmfare Awards 2013 (South) Nominations". Filmfare. Archived from the original on 7 July 2013. Retrieved 5 April 2015.
  12. "Yash, Shwetha Srivatsav are Filmfare best actors". Retrieved 27 June 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=యశ్&oldid=3914944" నుండి వెలికితీశారు