యాదవ రాజులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని గొల్ల వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
యాదవులు
గొల్లవారు
వర్గీకరణక్షత్రియులు
కుల దైవంశ్రీ కృష్ణుడు
మతాలుహిందూమతం
భాషలుహిందీ,తెలుగు
దేశంభారతదేశం, నేపాల్
Subdivisionsకొనార్,గంప గొల్ల,గుజరాతి గొల్ల,కృష్ణ గొల్ల,పూజ గొల్ల, పాక్నాక్ గొల్ల, మంద గొల్ల, మొదటి గొల్ల

భారతదేశంలో యాదవ రాజులది చాలా పెద్ద చరిత్ర. సంస్కృతంలో వీరిని గోపాలులు అంటారు. కాలక్రమమైన వీరిని గొల్లలు అనిపిస్తున్నారు. వీరు గోవులను సంరక్షించేవారు. గోవుల కాపులుగా ఉన్నారు. కాలక్రమంన గోవులతోపాటు, పశుపోషన లోకి కూడా దిగారు. వీరు మన భారత దేశంలోనే అతి పెద్ద బలమైన సామాజిక వర్గం. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, రాజ్య పరిపాలన ,పశుపోషణ.భారతదేశంలో అధిక భూములు, అధిక భూస్వాములు వీరే. భారతదేశంలో దాదాపు 30% జనాభా యాదవులదే .ఇది అతి ప్రాచీతమైన సామాజిక వర్గం. శ్రీకృష్ణుడు యాదవుడే.యాదవులు"క్షత్రియులు". వీరు ప్రధానంగా ఉత్తర భారత దేశంలోనూ, దక్షిణ భారతదేశంలోనూ దాదాపుగా అన్ని రాష్ట్రాలలో కనిపిస్తారు. వీరు రాజ్యాలను పరిపాలిస్తూనే ఒకవైపు రాజ్యంలోని పశువులను సంరక్షించే అతి గొప్ప ఘనత గలవారు. ప్రభుత్వం వీరిని రాష్ట్రాలలో బాక్వర్డ్ అప్పర్ క్యాస్ట్ గా పరిగణించింది.OC లకు దగ్గరగా ఉన్న తక్కువ రిజర్వేషన్ కలవారు. విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు యాదవుడే.

చారిత్రక ప్రముఖులు[మార్చు]

  • యదు
  • శూరసేనుడు
  • వసుదేవుడు
  • దేవకి
  • నందుడు
  • యశోద
  • శ్రీ కృష్ణుడు
  • బలరాముడు
  • కృతవర్మ
  • సాత్యకి
  • సుభద్రా దేవి
  • కుంతీ దేవి
  • రాధా రాణి
  • కంస
  • శిశుపాలుడు
  • గోపాలురు
  • పోరస్ ( అలెగ్జాండర్ ని నిలువరించింది.)
  • జిజియా భాయి
  • కాళిదాసు
  • వీర పాండ్య కట్ట బ్రహ్మన
  • శ్రీ కృష్ణ దేవరాయలు
  • రావు తులారాం
  • ఆనంద కొనార్
  • కాటమ రాయ
  • జడేజా
  • ఆనంద వల్లి, కోటప్ప కొండ చరిత్రలో ప్రముఖురాలు.
  • సంకొలి రాయణ్ణ (కురుమగొల్ల) (కర్ణాటక)
  • కనగదాసరు కవి (కర్ణాటక)

ఇతిహాసాల్లో ప్రస్తావన[మార్చు]

యాదవులు మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో ప్రసిద్ధిపొందారని చెప్పవచ్చు. సంస్కృత మహాభారత కావ్యం ప్రకారం యాదవులు చంద్రవంశానికి చెందినటువంటి యదు అను రాజు వంశస్థులు. యాదవ వంశము అనేకశాఖలు కలిగి మిక్కిలి ప్రసిద్ధులు అగు రాజులను పలువురను కలిగి ఉండెను. అందు యదువునకు జ్యేష్ఠపుత్రుఁడు అయిన సహస్రజిత్తునుండి హేహయ వంశము ఆయెను. వారికి మాహిష్మతి ముఖ్యపట్టణము. ఆ వంశమున కార్తవీర్యార్జునుఁడు మిగుల ప్రసిద్ధికి ఎక్కిన రాజు. అతని వంశస్థులు తాళజంఘులు అను పేర వెలసిరి. యదుని రెండవ పుత్రుఁడు అగు క్రోష్టువు వంశమున ప్రసిద్ధికి ఎక్కినరాజులు శశిబిందువు, జ్యామఘుఁడు, విదర్భుఁడు. వారలలో విదర్భుఁడు విదర్భరాజ వంశస్థాపకుఁడు అయెను. అతని మూడవ కుమారుని నుండి ఛేది వంశము వచ్చెను. రెండవ కుమారుని వంశస్థుఁడు అగు సాత్వతుని నుండి భోజవంశమును, అంధకవంశమును, వృష్ణివంశమును కలిగెను. అందు భోజవంశస్థులు ధారాపురాధిపులు అయిరి. అంధక వంశమున కృష్ణుఁడు పుట్టెను. వృష్ణివంశమున సత్రాజిత్తును, సాత్యకియు పుట్టిరి.

యాదవ గోత్రాలు[మార్చు]

యాదవ రాజుల గోత్రాలు దేశవ్యాప్తంగా అనేకం ఉన్నాయి.వాటిలో కొన్ని..

నవనీల, కుంకుమాల, విప్పర్ల, ఋషుల, అరవ, బోధినీల్ల (వర్ధం), వెయ్యవులా, పిల్లన గ్రోవి, పులిజందల, కౌండిన్య ఋషి, పులిగోర్ల, తిరుమణి, ఆరుట్ల, తులసి, పాలవెల్లి, కోనాల, శ్రీపాల, చండియ, కొషలియ, తిరుశుల(త్రిశూల), కాంకస్, కస్నియ,కలలియ, కత్, కదియాన్, ఖోల్, పెడేంద్ర,(గోపిదేశి), ఖైర్, తిరుమందల, ఖతోదియ, వనమాల, ఖోద్మియ, దేవేంద్ర, ఖుదోతియ, పేరేంద్ర, ఖుదోలియ, ఖైర్వాల్, ఖేద్కియ, మల్లెల, తిరుమల, కేశివ్, ఖోసియ, చంద్రపాల, భూమేంద్ర, గరాహ్, గంవాల్, గిదాద్, రామకోవెల, పైడిపాల, ఘూంగ్లా, చోరా, సంపంగి, అక్షయనామం, చైవాదియ, చైదాలియ, కస్తూర్ల, జంజాదియ, జాదం, జద్వాల్, చదోదియ, నాగేంద్ర, నానపాల్, నల్లందుల, గోప, జద్గోలియ,ఝావత్, తెహ్రాకియ, తొండక్, తక్రాన్, అదుక్వాల్, తతన్, విరజాల, గార్గేయ మహాముని, దగర్, దాబర్, దేహ్మివాల్, దాంతర్త, దేశ్వాల్, దహియ, ఉల్లేంల, నిగనియ, నహరియ, నిర్బాన్, నికుం, నిచ్వానియ, పంహార్, పచ్పడియ, రోద్వాల్,బల్రియ, బోగోలు, యాక్ష్వ క్షేణ,కవిలికటల, నాగేంద్రుల, ఉత్తముల, పల్లకిల, కుంకుల్ల , నానాల, మద్దులూరి, కోమల్ల, పచ్చిపాల, కన్నెందల,నేతిబీరకాయ, మధుపాల, రామకుల, పాడి పంటల, ఆర్యకొప్పుల, ములగసిరి,అల్పీసి, ఆరెకొప్పుల.