గొల్ల వారు

వికీపీడియా నుండి
(యాదవులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Mergefrom.svg
గొల్ల వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
Mergefrom.svg
గొల్ల వారు(యాదవులు)(గోకులము) వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
గొల్ల
మతం Om symbol.svg హిందూ మతం
భాష
దేశం
ప్రాంతం

గొల్లవారు:- (Golla) - భారతదేశంలో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న కులము . అందులోని గొల్ల (యాదవ) అనేది ప్రాచీన కులము. వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో యాదవులు చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉంది. వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజుయొక్క సంతానమునకు యాదవులని పేరు వచ్చింది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడు అనగా మహా విష్ణువు. యాదవులు ముఖ్యంగా ఉత్తరభారతదేశంలోను, కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తారు. వీరు సంస్కృత మహాభారత కావ్యం రచించబడిన కాలంలో క్షత్రియ, వైశ్య వర్ణమునకు చెందినవారుగా చెప్పబడింది. వీరు (ఓ.బి.సి) లలో బలంగా వున్న కులాలలో ఒకటి వీరు ప్రధానంగా వ్యవసాయం, పశు పోషణ వీరి ప్రధాన వృత్తి. ప్రతి రోజు తిరుమల వెంకటేశుని తొలి దర్శన భాగ్యం వీరికే దక్కుతుంది.

శ్రీ కృష్ణుడు
 • కురుమగోల్ల లేదా కురుబగోల్ల అంటే ఆర్య పేరు
 • కురుమగోల్ల లేదా కురుబగోల్ల అంటే అర్థం

నల్లని గోర్రే (తులు భాష, కన్నడ, సంస్కృతం)

 • కురుమగోల్ల లేదా కురుబగోల్ల బిసి-బి జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బిసి-డి జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని

 • ఇతర గొల్లాస్ (పూజ, ఎర్రా, కర్ణ, పకనాటి గొల్లా, భాగవతం గొల్ల,మొదలైనవి)
 • కురుమగోల్ల లేదా కురుబగోల్ల, ఇతర గొల్లలు (పూజ, ఎర్రా, కర్ణ, పకనాటి భాగవతం గొల్ల మొదలైనవి) యాదవులు
 • కురుమగోల్ల లేదా కురుబగోల్ల (యాదవులు)

బిసి-బి జాబితాలో ఆంధ్రాప్రదేశ్, తెలంగాణ యాదవులు, బిసి - డి జాబితాలో ఉన్నారు

ఇతిహాసాల్లో ప్రస్తావన[మార్చు]

సంస్కృత మహాభారత కావ్యం ప్రకారం యాదవులు యదువంశస్థులు. యాదవ వంశము అనేకశాఖలు కలిగి మిక్కిలి ప్రసిద్ధులు అగు రాజులను పలువురను కలిగి ఉండెను. అందు యదువునకు జ్యేష్ఠపుత్రుఁడు అయిన సహస్రజిత్తునుండి హేహయ వంశము ఆయెను. వారికి మాహిష్మతి ముఖ్యపట్టణము. ఆవంశమున కార్తవీర్యార్జునుఁడు మిగుల ప్రసిద్ధికి ఎక్కిన రాజు. అతని వంశస్థులు తాళజంఘులు అను పేర వెలసిరి. యదుని రెండవ పుత్రుఁడు అగు క్రోష్టువు వంశమున ప్రసిద్ధికి ఎక్కినరాజులు శశిబిందువు, జ్యామఘుఁడు, విదర్భుఁడు. వారలలో విదర్భుఁడు విదర్భరాజు వంశస్థాపకుఁడు ఆయెను. అతని మూడవ కొమరుని నుండి చేదివంశము వచ్చెను. రెండవ కొమరుని వంశస్థుఁడు అగు సాత్వతుని నుండి భోజవంశమును, అంధకవంశమును, వృష్ణివంశమును కలిగెను. అందు భోజవంశస్థులు ధారాపురాధిపులు అయిరి. అంధక వంశమున కృష్ణుఁడు పుట్టెను. వృష్ణివంశమున సత్రాజిత్తును సాత్యకియు పుట్టిరి.[1]

 • పుజ గొల్ల
 • ముష్టి గొల్ల
 • కర్ణ గొల్ల
 • కాడు గొల్ల (కర్నాటక)
 • తోకల గొల్ల
 • తూమాటి గొల్ల
 • యయ గొల్ల
 • ఎర్ర గొల్ల
 • మేక్కల గొల్ల
 • పాక్నాటి గొల్ల
 • మోండు గొల్ల
 • హశ్తాన్ద్ర గొల్ల
 • కురుమ గొల్ల
 • ఊరు గొల్ల
 • కృశష్ణ గొల్ల (కర్నాటక)
 • పత్ర గొల్ల
 • భాగవతం గొల్ల
 • గంప గొల్ల
 • పాల గొల్ల (తమిళనాడు)
 • రాజకంబల నాయక్కరు (తమిళనాడు)[2]

ప్రధాన యాదవ వంశాలు[మార్చు]

 • యదువంషి - యదు యదువుని వంశ వృక్షం
 • నంద్ వంషి - (అహిర్స్) నందుని వంశ వృక్షం
 • గ్వాల్వంషి - హొలీ గ్వాల వంశ వృక్షం
 • అంధకవంశమును -దక్షిణ భారత దేశ వంశ వృక్షం
 • భోజవంశము
 • వృష్ణివంశము.[1]
 • తోకల వంశము

యాదవ రాజ్యాలు[మార్చు]

 • దేవగిరి యాదవులు
 • విధర్బ రాజ వంశము
 • ద్వారక రాజ వంశము
 • కుంతి రాజ వంశము
 • సౌరాష్ట్ర రాజ వంశము
 • హెహెయ రాజ వంశము
 • కరుష రాజ వంశము
 • చేది రాజ వంశము
 • కరుష రాజ వంశము
 • దాసర్ణ రాజ వంశము
 • అవంతి రాజ వంశము
 • మాలవ రాజ వంశము
 • అనర్త రాజ వంశము
 • యోధేయయ రాజ వంశము
 • మధుర రాజ వంశము
 • మైసూర్ రాజ వంశము
 • నేపాల్ రాజ వంశము
 • మరాఠా రాజ వంశము
 • కాటమ రాయుని రాజ వంశము
 • విజయనగర రాజ వంశము[3]

• రాష్ట్రకూట రాజవంశం

• కాలచూరి రాజవంశం

• ట్రావెన్కోర్ రాజవంశం

• వేనాడ్ రాజవంశం

• అయ్ రాజవంశం

• చందెలా రాజవంశము

• హోయసాల రాజవంశం

• పాల వంశం

• జైసల్మార్ రాజవంశం

• చేరా రాజవంశం

చారిత్రక ప్రముఖులు[మార్చు]

 • వాసు దేవుడు
 • నందుడు
 • యశోధా
 • శ్రీ కృష్ణుడు
 • బలరాముడు
 • సాత్యకి
 • సుబద్రా దేవి
 • కుంతీ దేవి
 • రాధా రాణి
 • కంస
 • శిశు పాలుడు
 • గోపాలురు
 • యశోధర (బుద్ధుని తల్లి)
 • పోరస్ ( అలెగ్జాండర్ ని నిలువరించింది.)
 • ఛత్రపతి శివాజి
 • జిజియా భాయి
 • కాళిదాసు
 • వీర పాండ్య కట్ట బ్రహ్మన్న
 • రావు తులారాం
 • ఆనంద కొనార్
 • కాటమ రాయ
 • జడేజా
 • ఆనంద వల్లి, కోటప్ప కొండ చరిత్రలో ప్రముఖురాలు.
 • సంకొలి రాయణ్ణ (కురుమగొల్ల) (కర్నాటకా)
 • హరిహర రాయలు (గొల్ల)
 • బుక్క రాయలు
 • శ్రీ కృష్ణదేవరాయలు (గొల్ల యాదవ్)
 • కనగదాసరు కవి (కురుబ గొల్ల) (కర్నాటకా)
 • వీరపాండియ కట్టబొమ్మన్ (తోకల గొల్ల)

రాజకీయ ప్రముఖులు :[మార్చు]

 • ములాయం సింగ్ యాదవ్
 • అఖిలేశ్ యాదవ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి
 • డా . రామ్ బరన్ యాదవ్, నేపాల్ ప్రెసిడెంట్
 • శ్రీమతి చిత్ర లేఖ యాదవ్, స్పీకర్, నేపాల్
 • ములాయం సింగ్ యాదవ్, సమాజ్వాది పార్టీ చీఫ్
 • శరద్ యాదవ్, జనతా దల్ చీఫ్
 • రావు బీరెంద్ర సింగ్ యాదవ్, హర్యానా 2 వ ముఖ్యమంత్రి
 • చౌదరి బ్రహ్మ ప్రకాష్ యాదవ్, ఢిల్లి మొదటి ముఖ్యమంత్రి
 • శ్రీమతి రబ్రిదేవి యాదవ్, మాజి బిహార్ ముఖ్యమంత్రి
 • తను పిళ్ళై, కేరళ 2 వ ముఖ్యమంత్రి
 • బి.పి. మండల్ యాదవ్ (లేట్), మాజి బీహర్ ముఖ్యమంత్రి
 • బాబు లాల్ గౌర్, మాజీ మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి
 • బాబా రాం దేవ్
 • యనమల రామకృష్ణుడు, ఆర్థిక మంత్రి
 • డా"పాలేటి రామారావు (మాజీ మంత్రి వర్యలు,మాజీ ఎమ్మెల్యే,చీరాల,ఆంధ్రాప్రదేశ్)
 • రాజ్ గోపాల్ యాదవ్
 • బ్రి ద్రదేవి యాదవ్
 • రఘు వీరా రెడ్డి ( కురవ (లేదా) కురుమగొల్ల) ఆంధ్రాప్రదేశ్)
 • పోలుభోయిన అనీల్ కుమార్ యాదవ్
 • బండారు దత్తాత్రేయా (గొల్ల) తెలంగాణా, కేంద్ర మంత్రి
 • రా.కృష్ణయ్య (కురుమగొల్ల) తెలంగాణా ( బీ.సీ నాయకుడు)
 • సిద్ధ రామైయ్యా (కురుమగొల్ల) కర్నాటకా రాశ్ట్ర ముక్యమంత్రి
 • చిమటా సాంబు బాపట్ల (మాజీ ఎంపీ,మాజీ ఎమ్మెల్యే,చీరాల,1983)

క్రీడా, ఇతర ప్రముఖులు[మార్చు]

 • కేదార్ జాధవ్, తొలి వ్యక్తిగత గోల్డ్ మెడల్ విజేత
 • అనూప్ కుమార్, కబడ్డి జాతియ జట్టు సారథి
 • వికాస్ యాదవ్,2010 ఆసియా గేమ్స్ విజేత
 • శివాజి రావ్ గైక్వాడ్ (రజినీ కాంత్), సూపర్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియా ( థంగర్ (లేదా) కురుబ గొల్ల)
 • అర్జున్, నట (కురుబ గొల్ల) కర్నాటకా.
 • కె. యస్. ఆర్. దాస్, సినీ దర్శకుడు (మోసగాళ్ళకు మోసగాడు మొ..వి)
 • సముద్ర ఖని, సినీ దర్శకుడు
 • కె. యస్. రవి కుమార్, సినీ దర్శకుడు
 • సూర్య, నటుడు
 • కార్తీక్, నటుడు
 • నిఖిల్, నటుడు
 • రంజిత్ సింగ్ యాదవ్
 • అజయ్ జడేజా
 • శివలాల్ యాదవ్, బి.సి.సి.ఐ నాయకుడు.
 • ఉమేశ్ యాదవ్
 • సూర్య కుమార్ యాదవ్
 • రవీంద్ర జడేజా
 • ధీరజ్ జాదవ్
 • కుల్దీప్ యాదవ్
 • శ్రీమతి సంతోశ్ యాదవ్, తొలిసారి ఎవరెస్ట్ ని 2 సార్లు అధిరోహించిన మహిళ
 • ధనరాజ్ పిళ్ళై
 • ఏక్తా చౌధురి, మిస్ ఇండియా విశ్వం.
 • రఘు బీర్ యాదవ్, హిందీ నటుడు
 • మాధవి, నటి
 • బోయిన సుబ్బారావు, దర్శకుడు.

సంబంధిత ఇతర తెగలు[మార్చు]

పేర్లు - గోపాలులు, గొల్లలు, సద్గోప, గౌర్, అహిర్, గౌడ, దుమల గౌడ, మధురపురియ గౌడ, నంద గౌడ, కంజ గౌడ, మగధ గౌడ, లక్ష్మీనారాయణ గౌడ, జడేజా, రావత్, జాదవ్ ,కురుమ గొల్ల (లేదా) కురుబగొల్ల

మందెచ్చుల వారు[మార్చు]

వెనుకబడిన తరగతులలో దాదాపు 22 కులాలకు యాచకవృత్తి కావడం గమనార్హం. కాగా బీసీ కులాలలో మరికొన్ని కులాలు ప్రత్యేకించి కొన్ని కులాలను మాత్రమే యాచిస్తాయి. ఇటువంటివాటిలో యాదవులను యాచించే కులస్తులు మందెచ్చులవాళ్లు. మందెచ్చులవారిని బొమ్మలాటవాళ్ళు, పొదపొత్తులవాళ్ళు, పొదరులు, పొగడపొత్తర్లు అని కూడా పిలుస్తారు . గొల్ల, కురుమల(కురుమగొల్ల) దగ్గర మాత్రమే యాచి స్తారు. యాచనలోనూ కులతత్వం వీరి తరతరాల ఆచారం. గ్రామా లకు వెళ్లినా యాదవ వాడలలోనే నివ సిస్తారు. మందెచ్చుల వాండ్లు తెలంగాణ ప్రాంతంలోని ప్రధానంగా నల్గొండ, వరం గల్‌, మెదక్‌ జిల్లాలలో ఎక్కువగా కనిపిస్తారు.మందెచ్చుల వారిలో పురుషుడు యాదవ పెద్దలను పొగుడుతూ రాగయుక్తంగా పాటలు పాడతాడు.అతని వెనక అతని భార్య తాళం వేస్తూ వంత పాడుతుంది.పాటలో గల వేగం కట్టిపడేస్తుంది.యాదవ కులానికి చెందిన వారు చనిపోతే అక్కడ మందెచ్చు లవాండ్లు హాజరవుతారు. శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్లే సమయంలో పాడెకు ముందు భాగంలో నడుస్తూ కొమ్ము బూర ఊదుతూ, డోలువాయిస్తూ నడుస్తారు. ఆ తర్వాత మందెచ్చులవాళ్లు ఆ ఇంటి యాదవ పెద్దల కథలు ప్రత్యేక తీరులో చెపుతారు . కథానాయకుడు ఒక చేత కట్టె పట్టుకుని, మరో చేత్తో చిడతలు వాయిస్తూ, కాళగజ్జెల చప్పుడు చేస్తూ, సహచరునితో ముందు నిలుచుంటాడు. అతని వెనక ఇద్ద రు వంతలు పాడేవారు, ముందు వరస వారితో వెనుక వరసవారు పోటీపడుతూ కథ నడుపు తారు.గంగ రాజు కథ, పెద్దిరాజు కథ, కాటమ రాజుకథ ఇలా యాదవ పెద్దల కథలు చెప్పి అక్కడివారిని ఆనందపరుస్తారు. కథ పూర్తయ్యాక ఆ వాడలో ఉన్న ప్రజలు కొంత ధనం ఇస్తారు. ఇంతకు ముందు గొఱ్ఱెలను మేకలను సంభావనగా ఇచ్చేవారు. [4]

గుర్రాల పారువేట ఉత్సవం[మార్చు]

విజయదశమి వేడుకల్లో జరిగే పారువేట ఉత్సవం మద్దికేర గ్రామంలో ప్రధాన ఆకర్షణ. స్థానిక యాదవ రాజుల వంశీయులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. మద్దికేరళో పెద్దనగిరి, చిన్ననగిరి అనే యాదవ రాజుల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబీకులు శ్రీ భోగేశ్వర స్వామిని తమ ఇష్టదైవంగా కొలుస్తారు. పనులు సవ్యంగా జరగాలంటే భోగేశ్వరుని దయ ఉండాలని, ఇందు కోసం ప్రతి ఏటా దసరా ఉత్సవాల్లో భోగేశ్వర స్వామిని పూజించాలన్నది వీరి విశ్వాసం. గతంలో ఈ రెండు రాజ కుటుంబాలు విడిపోయినా ఆనవాయితీగా దసరా సంబరాలను మాత్రం విస్మరించలేదు.

ఈ రెండు రాజరికపు కుటుంబాలతోపాటు యామన్న నగిరి అనే మరో రాజు కుటుంబం కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకుంటూ వస్తూంది. పేరుగాంచిన యాదవ రాజులు, తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. యాదవ రాజుల వంశీయులు దసరా పండుగ రోజున గుర్రాలపై కూర్చొని, తల పాగా, రాచరికపు దుస్తులు ధరించి ఖడ్గధారులై మేళతాళాలతో మద్దికేరకు 3 కి.మీ. దూరంలోని నాటి యాదవ రాజులు నిర్మించిన బొజ్జనాయినిపేట మజరా గ్రామంలోని భోగేశ్వరాలయానికి ఊరేగింపుగా వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. వీరికి మద్ది కులస్తులు సైన్యం వలె ఆయుధాలు ధరించి అంగరక్షకులుగా ఉంటారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి గుర్రాలపై వేగంగా వస్తారు. ఆ తరువాత మద్దికేరళో ప్రధాన రహదారుల్లో గుర్రాలపై స్వారీ చేస్తూ తమ రాచఠీవిని ప్రదర్శిస్తారు. మద్దికేర మద్దమంబ

మద్దికేర గ్రామములో మద్దమాంబ తిరుణాల చాలా ప్రసిద్ధి గాంచింది.ఈ గ్రామ దేవత పేరు మీదనే ఈ వూరు పేరు మద్దికేరగా పిలువబడుచున్నది.రతోస్త్వవానికి ముందు ఈ గ్రామాన్ని పాలించిన యాదవ రాజులు ఊరేగింపుగా వెళుతారు.ఈ వుత్శావము ప్రతి సంవస్త్రం మాఘ శుద్ధ పౌర్ణమి నాడు జరుగును. [5]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-06-26. Retrieved 2020-01-15.
 2. Rajannan, Busnagi (1992). Salem Cyclopedia: A Cultural and Historical Dictionary of Salem District, Tamil Nadu (in ఇంగ్లీష్). Institute of Kongu Studies.
 3. http://www.iyadavhistory.com[permanent dead link]
 4. "గొల్ల కురుమల దగ్గరే యాచన". సూర్య. 2012-07-12. Retrieved 2015-01-29.[permanent dead link]
 5. http://www.te.wikipedia.org/గుర్రాల[permanent dead link] పారువేట ఉత్సవం

ఇతర లంకెలు[మార్చు]