యార్లగడ్డ వెంకట కృష్ణారావు
యార్లగడ్డ వెంకట కృష్ణారావు ( 1915 - 2010) వై.వి. కృష్ణారావు గా సుపరిచితుడూ, సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడూ, రైతు ఉద్యమ రథసారథి, స్వాతంత్ర్య సమర యోధుడు.ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా 12 సంవత్సరాలు (1966-78) పనిచేసారు.
వై.వి. కృష్ణారావు | |
---|---|
దస్త్రం:Y.V.Krishna rao.jpg | |
జననం | యార్లగడ్డ వెంకట కృష్ణారావు 1915 కృష్ణా జిల్లా గన్నవరం మండలం,పెద్దఅవుటపల్లి గ్రామం |
మరణం | 2010 డిసెంబర్ 26 |
సంస్థ | భారతీయ కిసాన్ సభ |
పదవి పేరు | శాసన మండలి సభ్యులు |
పదవీ కాలం | 1966 - 1978 |
రాజకీయ పార్టీ | భారత కమ్యునిస్ట్ పార్టీ |
బాల్యం
[మార్చు]యార్లగడ్డ వెంకట కృష్ణారావు గారు 1915లో కృష్ణా జిల్లా గన్నవరం మండలం, పెద్దఅవుటపల్లి గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]తొలిసారి జాతీయోద్యమం గురించి 1929లో గాంధీజీ ద్వారా విని, ప్రభావితుడై ఆ వైపు మరలారు. 1937లో విద్యార్థి సమాఖ్య సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1937లో డిటెక్షన్ విధానానికి వ్యతిరేకంగా ఎ.సి. కాలేజీలో జరిగిన చారిత్రక విద్యార్థి ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించారు. 1940లో గుంటూరు ఎ.సి. కాలేజీ నుండి సైన్స్ లో పట్టభద్రులయ్యారు.
ఆయన తెలంగాణా రైతాంగ విముక్తి పోరాటంలో భారత కమ్యునిస్టు పార్టీ కడప జిల్లా భాద్యునిగా పాల్గోని 1948 నుండి 1951 వరకు రహస్య జీవితం గడిపారు. 1951 నుండి 1987 వరకు ఆంధ్ర రాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా పనిచేసారు. 1958 నుండి భారత కమ్యునిస్టు పార్టీ జాతీయ సంఘ కమిటీ సభ్యులుగా కొనసాగారు. 1987 నుండి అఖిల భారత రైతు సంఘ ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. రైతు నాయకుడిగా రైతాంగ సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు. 1966 నుండి 1978 వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా 12 సంవత్సరాలు పనిచేసారు.
రచనలు
[మార్చు]వై.వి. కృష్ణారావు గారు విశాలాంధ్ర విజ్ణాన సమితి అధ్యక్షునిగా పనిచేసారు. కారల్ మార్క్స్ దాస్ కెప్టల్, భారత కమ్యునిస్ట్ పార్టీ చరిత్ర వంటి రచనలతో పాటు అనేక రాజకీయ, ఆర్థిక అంశాలపై పెక్కు రచనలు, వ్యాసాలు వ్రాసారు.[2] ఆంధ్ర ప్రదేశ్ దర్శిని (3 సంపుటాలు), మహా మనిషి చండ్ర రాజేశ్వరరావు వారి ఇతర రచనలు.
మరణం
[మార్చు]వై.వి. కృష్ణారావు గారు 96 ఏళ్ళ వయస్సులో 2010 డిసెంబరు 26న హైదరాబాదులో మరణించారు.[3]
మూలములు
[మార్చు]- ↑ కృష్ణా జిల్లా తేజోమూర్తులు, గుత్తికొండ జవహర్‍లాల్, సాహితి ప్రచురణలు, పేజీ 251
- ↑ Andhra Pradesh Lo Communist Udhyama Charitra Vol Ii 193642
- ↑ "Comrade Y V Krishna Rao Passes Away". NEW AGE WEEKLY Central Organ of the Communist Party of India. 2010-12-30. Archived from the original on 2021-07-26. Retrieved 2021-07-24.