Jump to content

యుషిరో మియురా

వికీపీడియా నుండి
యుషిరో మియురా
రికార్డు సాధించిన తర్వాత యుషిరో మియురా
జననంయుషిరో మియురా
అక్టోబరు 12 , 1932
ఇతర పేర్లుయుషిరో మియురా
ప్రసిద్ధిప్రపంచంలో అత్యున్నత ఎపరెస్ట్ ఎక్కిన
ఘనత సాధించిన తొలి వృద్ధుడు
పిల్లలు"గౌతా మియురా".
తండ్రి"కీజో మియురా",

యుషిరో మియురా (జ.అక్టోబరు 12, 1932) జపాన్ కు చెందిన పర్వతారోహకుడు. ఆయన తన 80 యేళ్ళ వయస్సులో ఎవరెస్టు శిఖరం ఎక్కి ఎవరెస్టు ఎక్కి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి వృద్ధుడుగా రికార్డు సృష్టించి చరిత్రను తిరగరాశాడు. తను తొలిసారి తన 70 ఏళ్ళ వయస్సులో ఎవరెస్టు శిఖరం అధిరోహించాడు. మే 26, 2008లో రెండోసారి తన 75 వ యేట ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. మే 23, 2013 న తన 80 వ యేట మరోసారి ఎవరెస్టు శిఖరం అధిరోహించి రికార్డును స్వంతం చేసుకున్నాడు. ఈ ఘనత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.[1][2]

ఆయన తన 78 వయేట తుంటె ఎముక విరిగి చికిత్స చేయించుకున్నాడు. 2013 సంవత్సరం జనవరిలో గుండెకు శస్తచ్రికిత్స జరిగింది.ఇవేవీ ఆయన ఆశయాన్ని, కలను నీరుగార్చలేదు. యిదివరకు రెండుసార్లు చేసిన సాహస కార్యానికే మళ్లీ పూనుకున్నాడు. మే 23, 2013 న ఉదయం 8.45 నిమిషాలకు ఆయన లక్ష్యం నెరవేరింది.ప్రపంచంలోనే ఎత్తయిన 8,848 మీటర్ల ఎవరెస్టు శిఖరం అగ్రభాగానికి చేరుకున్నాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి వృద్ధుడుగా రికార్డు సృష్టించి చరిత్రను తిరగరాశాడు. అంతకుముందు 76 ఏళ్ల వయసులో నేపాలీ వృద్ధుడి పేరనున్న రికార్డును తుడిచేశాడు. ఆయన తన కుమారుడు, ఫిజిషియన్ అయిన గోటాతో యుషిరో ఎవరెస్టు శిఖరానికి చేరుకున్నట్లు గ్యానేంద్ర శ్రేష్ఠ అనే పర్వతారోహక విభాగ అధికారి వెల్లడించారు. ఎవరెస్టును అధిరోహించే ముందు యుషిరో మాట్లాడుతూ ‘నేను ఇప్పటికీ ఆరోగ్యంగా, పటిష్ఠంగా ఉన్నా. ఈసారి కూడా ఖచ్చితంగా ఎవరెస్టును చేరుకుంటాననే ఆశిస్తున్నా’నని తెలిపాడు. ఇందుకోసం టోక్యోలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నానని, ప్రతి కాలుతో ఐదుకేజీల బరువు ఎత్తేలా కృషిచేశానన్నాడు. వారంలో మూడుసార్లు వీపుమీద 25 నుంచి 30 కిలోల బరువును మోస్తూ నడిచేవాడినని వివరించాడు. ముదిమి వయసులో ఎవరెస్టును అధిరోహించాలని కలలు కనేవాడినని తెలిపారు. మీ కల ఎప్పటికీ వృథా పోదు, అది వాస్తవ రూపం ధరిస్తుందని అంటాడు యుషిరో. యుషిరో కల నెరవేరింది. వృద్ధాప్యంలో ఎవరూ సాధించలేని ఘనతను సొంతం చేసుకున్నాడు.[3]

ఈయన మే 6, 1970 న ఎవరెస్టు శిఖరం నుండి 4200 అడుగులు క్రిందికి స్కై చేస్తూ మొదటి వ్యక్తిగా రికార్డు సాధించాడు. ఈ సాధన 1975 లో డాక్యుమెంటేషన్ అయి The Man Who Skied Down Everest. చిత్రంగా వెలువడినది. ఈ చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అకాడమీ రివార్డు పొందింది. యిది మొదటి స్పోర్ట్స్ చిత్రం.

యుషిరొ మియురా తండ్రి ప్రముఖ జపాన్ దేశ స్కిల్లింగ్ లెజెండ్ "కీజో మియురా", యుషిరో కుమారులలో ప్రసిద్ధుడు "గౌతా మియురా".

సూచికలు

[మార్చు]
  1. ఘనత సాధించిన తొలి వృద్ధుడుగా రికార్డు
  2. ఫాక్స్ న్యూస్ అర్టికల్
  3. "ఆంధ్ర భూమి పత్రకలో ఆర్టికల్". Archived from the original on 2020-08-15. Retrieved 2013-05-24.

యితర లింకులు

[మార్చు]