యూరీ ఒగనేసియన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యూరీ అగనేసియన్
2016 లో యూరీ ఒగనేసియన్
జననం (1933-04-14) 1933 ఏప్రిల్ 14 (వయసు 90)
రోస్టోవ్-ఆన్-డాన్, రష్యన్ సోవియట్ ఫెడెరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్, సోవియట్ యూనియన్
జాతీయతరష్యన్-ఆర్మేనియన్
రంగములుకేంద్రక భౌతిక శాస్త్రం
వృత్తిసంస్థలుఫ్లోరోవ్ లేబొరేటరీ ఆఫ్ నూక్లియర్ రియాక్షన్స్
చదువుకున్న సంస్థలుమాస్కో ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇనిస్టిట్యూట్
ప్రసిద్ధిఆవర్తన పట్టిలలో భారమూలకమైన ఒగానెస్సాన్‌ కు సహ ఆవిష్కర్త. దీనికి అతని పేరుతో నామకరణం చేసారు.

యూరీ త్సోలంకోవిచ్ ఒగనేసియన్ (జ.1933 ఏప్రిల్ 14) రష్యా దేశానికి చెందిన కేంద్రక భౌతిక శాస్త్రవేత్త. అతడు ఆర్మేనియన్ సంతతికి చెందినవాడు. అతడు అధిక భారం గల రసాయన మూలకాల ఆవిష్కరణ కొరకు ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకునిగా ఖ్యాతి పొందాడు. [1] అతడు ఆవర్తన పట్టికలో ఈ మూలకాల యొక్క ఆవిష్కరణకు దోహదపడ్డాడు. [2][3] అతడు 1989లో జాయింట్ ఇనిస్టిట్యూట్ ఫర్ నూక్లియర్ రీసెర్చ్ వద్ద ఫ్లెరోవ్ లేబొరేటరీ ఆఫ్ నూక్లియర్ రియాక్షన్స్ యొక్క డైరక్టరు "జార్జీ ఫ్లెరో" తో కలసి భారలోహ ఆవిష్కరణలో విజయం సాధించాడు. రసాయన మూలకం ఒగానెస్సాన్‌ (Og, పరమాణు సంఖ్య 118) కు 2016లో అతడిపేరుతొ నామకరణం చేసారు. ఒక మూలకానికి బ్రతికున్నవారి పేరుతో నామకరణం చేసిన వారిలో ఒకనిగా గుర్తింపబడ్డాడు.

ప్రారంభ జీవితం[మార్చు]

యూరీ త్సోలంకోవిచ్ ఒగనేసియన్[lower-alpha 1] 1933 ఏప్రిల్ 14రష్యా లోని రోస్టోవ్-ఆన్-డాన్ వద్ద ఆర్మేనియన్ తల్లిదండ్రులకు జన్మించాడు.[7][8][9] అతడి తండ్రి రోస్టోవ్ కు, తల్లి అర్మావిర్ కు చెందినవారు.[10] 1939లో తన కుటుంబం అప్పటి సోవియట్ ఆర్మేనియా కు రాజధాని అయిన "యెరెవాన్" లోకి వెళ్ళినందున ఒగనేసియన్ తన బాల్యాన్నిఅచట గడిపాడు. అతడి తండ్రి "త్సోలాక్" థర్మల్ ఇంజనీరుగా యెరెవాన్ లోని కృత్రిమ రబ్బరు తయారుచేసే కర్మాగారంలో పనిచేసేవాడు. రెండో ప్రపంచ యుద్ధం యొక్క తూర్పు ఫ్రంట్‌లో పోరాడినప్పుడు, అతని కుటుంబం నాజీలు ఆక్రమించిన "రొస్కోవ్" కు తిరిగి రాకూడదని నిర్ణయించుకుంది. మిగిలిన పాఠశాల విద్యను యూరీ "యెరెవాన్" లో పూర్తిచేసాడు.[10][4]

జీవితం[మార్చు]

ఒగనేసియన్ "ఫ్లెరోవ్ లాబొరేటరీ ఆఫ్ నూక్లియర్ రియాక్షన్స్ (FLNR)" కు విజ్ఞానశాస్త్ర నాయకుడు. [11] అతడు ఒక-పరమాణువు-ఒకే-ఒక-సారి నూక్లియో సింథసిస్ లో "కోల్డ్" సంలీనం (ఫ్యూజన్) ను 1970లో కనుగొన్నాడు. 1990ల చివరలో "హాట్" సంలీనాన్ని ఆవిష్కరించాడు.[1] 2009లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని శాస్త్రవేత్తలు "ఒగనేసియన్ బృందం" ఫ్లెరోవియం మూలకాన్ని ఒక దశాబ్దం ముందుగానే కనుగొన్నట్లు ధృవీకరించారు. [12] అతడు కేంద్రక భౌతిక శాస్త్రంలో "ఐలాండ్స్ ఆఫ్ స్టెబిలిటీ" కి పరిశోధకుడు. అతడు "పాలసైట్లు" లో "ఆలివైన్" (మెగ్నీషియం ఖనిజం) ను శోధిస్తూ ప్రకృతిలో అధిక భార లోహాలనుకనుగొనే దిశగా పరిశోధనలు చేస్తున్నాడు.[1]

Oganessian on a 2017 stamp of Armenia

ఒగనేసియన్[మార్చు]

2002 లో జాయింట్ ఇనిస్టిట్యూట్ ఫర్ నూక్లియర్ రీసెర్చ్ వద్ద రష్యా, అమెరికన్ శాస్త్రవేత్తల బృందం ఒగానెస్సాన్‌ పరమాణువులు మొదటిసారి విఘటనం చెందుటను పరిశీలించారు. అమెరికన్ శాస్త్రవేత్తలు కలిగిన "ఓక్ రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ, టెన్నెస్సీ", "లారెన్స్ లివెర్‌మోర్ నేషనల్ లాబొరేటరీ, కాలిఫోర్నియా" బృందాలకు ఒగనేసియన్ నాయకత్వం వహించాడు.[13] అంతర్జాతీయ శుద్ధ, అనువర్తిత రసాయన శాస్త్ర సంఘం (IUPAC) 2016 నవంబరులో ఆవర్తన పట్టికలోని 118 మూలకానికి ఒగనేసియన్ గౌరవార్థం "ఒగనేసన్" అని నామకరణం చేసింది.[14][15][16] ఈ ప్రకటనకు ముందు 12 మూలకాలకు మనుష్యుల పేర్లతో నామకరణం చేసారు. [lower-alpha 2] కానీ వాటిలో సియాబోర్గియం మూలకానికి మాత్రం గ్లెన్ టి.సీబోర్గ్ అనే వ్యక్తి బ్రతికుండగా నామకరణం చేసారు.[1]

గౌరవాలు, పురస్కారాలు[మార్చు]

1990లో ఒగనేసియన్ సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు సభ్యునిగా ఎంపికయినాడు. 2003 లో రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు పూర్తి స్థాయి సభ్యునిగా ఉన్నాడు.[17]

Yuri Oganessian interviewed for the Dutch TV-show The Mind of the Universe.

ఒగనేసియన్ గౌరవ డిగ్రీలను "గోతే యూనివర్శిటీ ఫ్రాంక్‌ఫల్ట్" (2002),[18] యూనివర్శిటీ అపహ్ మెస్సినా (2009),[19] యెరెవాన్ స్టేట్ ఊనివర్శిటీ .[20][4] ల నుండి పొందాడు.

స్టేట్ ఆర్డర్స్, పురస్కారాలు
 • యు.ఎస్.ఎస్.ఆర్ స్టేట్ ప్రైజ్ (1975)[3]
 • లైస్ మైట్నెర్ ప్రైజ్ ఆఫ్ ద యూరోపియన్ ఫిజిక్స్ సొసైటీ (2000)[21]
 • ఆర్డర్ "ఫర్ మెరిట్ టు ద ఫాథర్‌లాండ్" 3వ తరగతి (2003)[22]
 • రష్యన్ ఫెడెరేషన్ నేషనల్ అవార్డు. (2010)[23][24]
 • ఆర్డర్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా(2016)[5]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అతడు ఇరినా లెవోనోవ్నా అనే వాయులీన విద్వాంసురాలిని వివాహమాడాడు. వారికి ఇద్దరు కుమార్తెలు.[25][26]

నోట్సు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 1. Armenian: Յուրի Ցոլակի Հովհաննիսյան, Yuri Tsolaki Hovhannisyan.[4][5] Oganessian is the Russified version of the Armenian last name Hovhannisyan. The article on Oganessian in the Armenian Soviet Encyclopedia (1980) described him as an "Armenian Soviet physicist."[6]
 2. 12 other elements named in honor of people: curium, einsteinium, fermium, mendelevium, nobelium, lawrencium, rutherfordium, seaborgium, bohrium, meitnerium, roentgenium, copernicium

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 Chapman, Kit (30 November 2016). "What it takes to make a new element". Chemistry World. Royal Society of Chemistry.
 2. "EPS introduces new Lise Meitner prize". CERN Courier. IOP Publishing. 2 April 2001.
 3. 3.0 3.1 "Yuri Tsolakovich Oganessian". jinr.ru. Joint Institute for Nuclear Research. Archived from the original on 19 June 2017.
 4. 4.0 4.1 4.2 "Հովհաննիսյան Յուրի Ցոլակի (1933–) [Hovhannisyan Yuri Tsolaki (1933–)]". sci.am (in ఆర్మేనియన్). National Academy of Sciences of the Republic of Armenia. Archived from the original on 19 June 2017.
 5. 5.0 5.1 "Presidential Decree on Awarding Y. Ts. Hovhannisyan with the Order of Honor". president.am (in ఆర్మేనియన్). 17 September 2016.
 6. Armenian Soviet Encyclopedia Volume 6 (in ఆర్మేనియన్). Yerevan. 1980. p. 572. ՀՈՎՀԱՆՆԻՍՅԱՆ Յուրի Ցոլակի (ծն. 14.4.1933, Դոնի Ռոստով), հայ սովետական ֆիզիկոս{{cite book}}: CS1 maint: location missing publisher (link)
 7. Shevchenko, Nikolay (10 June 2016). "Moscovium joins the periodic table". Russia Beyond the Headlines. ...Yuri Oganessian, a Russian nuclear physicist of Armenian heritage...
 8. "New element discovered by Armenian scientist included in Periodic Table". Armenpress. 30 November 2016.
 9. "New Element In Periodic Table To Be Named After Armenian Physicist". Asbarez. 9 June 2016.
 10. 10.0 10.1 Mirzoyan, Gamlet (July 2011). "Человек, замкнувший таблицу Менделеева". Noev Kovcheg (in రష్యన్). Archived from the original on 19 June 2017.
 11. "FLNR Directorate". Archived from the original on 12 అక్టోబరు 2013. Retrieved 16 October 2013.
 12. "Element 114 confirmed". RSC.org. Royal Society of Chemistry. 30 September 2009. Retrieved 19 November 2011.
 13. Oganessian, Yu. T.; et al. (2002). "Results from the first 249
  Cf
  +48
  Ca
  experiment"
  (PDF). JINR Communication. JINR, Dubna.
 14. "Periodic Table of Elements". IUPAC. 28 November 2016.
 15. "IUAPC announces the names of the elements 113-115-117-118". IUPAC. 30 November 2016.
 16. "Names proposed for new chemical elements". BBC News. 8 June 2016.
 17. "Оганесян Юрий Цолакович [Oganessian Yuri Tsolakovich]". isaran.ru (in రష్యన్). Archives of the Russian Academy of Sciences. Archived from the original on 19 జూన్ 2017. Retrieved 8 జనవరి 2020.
 18. "Honorary doctorates of the faculties of natural sciences". uni-frankfurt.de. Archived from the original on 2018-05-11. Retrieved 2018-05-08.
 19. "International Conference: Nuclear Reactions on Nucelos and Nuclei" (PDF). unime.it. 5–9 October 2009. Archived from the original on 19 జూన్ 2017. Retrieved 8 మే 2018. In honour of Yuri Oganessian for his laurea honoris causa that will be conferred by the University of Messina.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 20. "The 118th element of the Mendeleev Tablle is named in the honor of the Honorary Doctor of YSU". ysu.am. 7 March 2017. Archived from the original on 9 సెప్టెంబర్ 2017. Retrieved 8 మే 2018. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 21. "EPS Nuclear Physics Division – Lise Meitner Prize". eps.org.
 22. "Указ Президента РФ от 20 ноября 2003 г. N 1372 «О награждении государственными наградами Российской Федерации»". onagradah.ru (in రష్యన్). 20 November 2013.
 23. "2010 Russian Federation National Awards have been presented". kremlin.ru. 12 June 2011.
 24. "Yu.Ts.Oganessian and M.G.Itkis are National Award winners 2010". jinr.ru. Joint Institute for Nuclear Research. 12 June 2011. Archived from the original on 25 జనవరి 2016. Retrieved 8 మే 2018.
 25. Yakutenko, Irina (26 April 2010). "Бацилла творчества". lenta.ru (in రష్యన్).
 26. Titova, Anna (2017). "Легенда № 118 [Legend #118]". expert.ru (in రష్యన్). Expert Online. Archived from the original on 2017-05-26. Retrieved 2018-05-08.
ఉల్లేఖన లోపం: <references> లో "flerovlab" అనే పేరుతో నిర్వచించిన <ref> ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.