రక్ష హరికృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రక్ష హరికృష్ణ

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానాంకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన యానాం అసెంబ్లీ నియోజకవర్గ నుంచి శాసనసభ్యుడిగా పనిచేసారు.

రక్ష హరికృష్ణ (జననం 1940 సెప్టెంబర్ 1)[మార్చు]

శ్రీ రక్ష హరికృష్ణ గారు యానాంలో సెప్టెంబర్ 1, 1940వ సంవత్సరంలో మెట్టకూరు గ్రామంలో రక్ష అప్పాయమ్మ, గంగరాజు దంపతులకి మూడవ సంతానంగా జన్మించారు. వీరు అగ్నికులక్షత్రియ సామజికవర్గానికి చెందినవారు, రఘుకుల గోత్రిజ్ఞులు. యానాం సెంట్రల్ బాయ్స్ హైస్కూలులో విద్యాభ్యాసం పూర్తిచేసారు. తదుపరి కాకినాడ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లమో పూర్తిచేసి కరెస్పాండంట్ ద్వారా బి.ఇ సివిల్ ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడల్ సంపాదించారు. యానాం అగ్నికులక్షత్రియ కులంలో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి వ్యక్తి రక్ష హరికృష్ణ గారే. అనంతరం హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజనీర్ గా ఉద్యోగం చేసారు.

          జాతికి సేవచేయాలనే ప్రగాడ సంకల్పంతోను యానంలో కడుదీనస్థితిలో ఉన్న అగ్నికులక్షత్రియ జాతి ఉద్దరణ కోసం ఉద్యోగానికి రాజీనామ చేసి, యానాంకి తిరిగి వచ్చేశారు. 1975వ సంవత్సరం నుండి గ్రామసభలు నిర్వహించి అగ్నికులక్షత్రియుల చైతన్యానికి కృషిచేశారు. అంతే కాకుండా దళిత-బిసి ల మధ్య ఐక్యత కోసం కృషిచేస్తూ, బహుజనుల రాజ్యాధికారం కోసం ఉద్యమాలు చేపట్టారు. అగ్నికులక్షత్రియులను అధిక సంఖ్యలో సమీకృతం చేసి  ప్రజల రాజకీయశక్తిగా మార్చడానికి ప్రయత్నించారు.

రాజకీయ రంగ ప్రవేశం[మార్చు]

1985లో అగ్రకుల నాయకుడు, యానాన్ని అప్రతిహతంగా పరిపాలిస్తున్న శ్రీ కామిశెట్టి పరుశరామ వరప్రసాద్ నాయుడి మీద స్వాతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసి 386 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. యానాం రీజెన్సీ కార్మికుల హక్కుల కోసం పోరాడారు. ట్రేడ్ యూనియన్లు స్థాపించి వాటి నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందారు. తదుపరి 1990శాసనసభ ఎన్నికల్లో DMK పార్టీ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వెలగా రాజేశ్వరరావు గారిని ఓడించారు.

1991లో పెరంబదూర్ లో రాజీవ్ గాంధీ హత్య కారణంగా అధికారంలో ఉన్న DMK ప్రభుత్వం పతనం అయ్యింది. దాంతో కేవలం 9నెలలు మాత్రమే శాసనసభ్యులుగా, పనిచేసారు. తన వారసుడిగా మల్లాడి కృష్ణారావు గారిని రాజకీయాల్లో ప్రోత్సహించారు.

మరణం[మార్చు]

   జీవిత చరమాంకంలో యానాం భారతీయజనతాపార్టీ కన్వీనరుగా పనిచేసారు. హృద్రోగంతో కాకినాడ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 2010, డిసెంబర్ 18న, 71 ఏళ్లకు తుది శ్వాస విడిచారు.