రణధీర్ సింగ్
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | 1957, ఆగస్టు 16 ఢిల్లీ | ||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2023, మార్చి 8 (వయసు 65) జంషెడ్‌పూర్, జార్ఖండ్ | ||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2006 మార్చి 6 |
రణధీర్ సింగ్ (1957, ఆగస్టు 16 - 2023, మార్చి 8) ఢిల్లీకి చెందిన భారతీయ క్రికెట్ ఆటగాడు. 1981, 1983లో ఇంగ్లాండ్, వెస్టిండీస్‌పై భారతదేశం తరపున రెండు వన్డేలు ఆడాడు.[1]
జననం
[మార్చు]రణధీర్ సింగ్ 1957 ఆగస్టు 16న ఢిల్లీలో జన్మించాడు.
క్రికెట్ రంగం
[మార్చు]కుడిచేతి వాటం బ్యాటింగుతో, కుడిచేతి ఫాస్ట్ మీడియం బౌలింగుతో రాణించాడు.
1981 నవంబరు 25న అహ్మదాబాదు వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[2] 1983, డిసెంబరు 17న గౌహతి వేదికగా వెస్టిండీస్ జరిగిన వన్డేలో చివరిసారిగా ఆడాడు.[3]
1978/79 - 1988/89 మధ్యకాలంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 65 మ్యాచ్ లలో 647 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 45 (నాటౌట్) చేశాడు. 10,610 బంతులు వేసి 5,388 పరుగులు ఇచ్చి, 146 వికెట్లు తీశాడు. అత్యుత్తమ బౌలింగ్ 6/95.
1979/80 - 1988/89 మధ్యకాలంలో లిస్ట్ ఎ క్రికెట్ లో 23 మ్యాచ్ లలో 79 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 30 (నాటౌట్) చేశాడు. 1,077 బంతులు వేసి 765 పరుగులు ఇచ్చి, 28 వికెట్లు తీశాడు. అత్యుత్తమ బౌలింగ్ 3/18.
మరణం
[మార్చు]రణధీర్ సింగ్ తన 65 సంవత్సరాల వయస్సులో 2023, మార్చి 8న జార్ఖండ్ లోని జంషెడ్‌పూర్‌లో మరణించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Randhir Singh Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-05.
- ↑ "IND vs ENG, England tour of India 1981/82, 1st ODI at Ahmedabad, November 25, 1981 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-05.
- ↑ "IND vs WI, West Indies tour of India 1983/84, 5th ODI at Guwahati, December 17, 1983 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-05.
- ↑ "Randhir Singh". ESPN Cricinfo. Retrieved 2023-08-05.