రాకేశ్ శర్మ

వికీపీడియా నుండి
(రాకేష్ శర్మ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాకేశ్ శర్మ
రాకేశ్ శర్మ
జననం (1949-01-13) 1949 జనవరి 13 (వయసు 75)
స్థితిపదవీ విరమణ
జాతీయతభారతీయుడు
వృత్తిTest Pilot
పురస్కారాలు Ashok Chakra
దస్త్రం:Golden Star medal 473.jpg Hero of the Soviet Union
అంతరిక్ష జీవితం
ర్యాంకుWing Commander, Indian Air Force
అంతరిక్షంలో గడిపిన కాలం
7d 21h 40m
అంతరిక్ష నౌకలుSoyuz T-11 / Soyuz T-10
అంతరిక్ష నౌకల చిత్రాలు

అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ. 1984 ఏప్రిల్ 3సోవియట్ యూనియన్ (ప్రస్తుతపు రష్యా) కు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కల్సి బైకనూర్అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినాడు. అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రపంచపు వ్యోమగాములలో ఇతను 138 వ వాడు.

1954 సం.లో పాటియాలాలో జన్మించిన రాకేశ్ శర్మ, భారత వైమానిక దళంలో చేరాడు. చకచకా ఉన్నతపదవులు పొంది స్క్వాడ్రన్ లీడర్, "విమాన చోదకుడు" అయ్యాడు. 1984లో భారత్ తరపున అంతరిక్షంలోకి వెళ్ళి మొదటి భారతీయ రోదసీ వ్యోమగామి అయ్యాడు. భారతదేశానికి చెందిన "భారత అంతరిక్ష పరిశోధన సంస్థ" (ISRO), రష్యాకు చెందిన "సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్" (ఇంటర్ కాస్మోస్) సమన్వయ కార్యక్రమమైన ఈ యాత్ర సాల్యూట్-7 రోదసీ స్టేషనులో 8 రోజులపాటు కొనసాగింది. ఈ యాత్రలో 35 యేళ్ళ రాకేష్ శర్మతో పాటు రష్యాకు చెందిన ఇరువురు వ్యోమగాములూ ప్రయాణించారు. వీరియాత్ర "సోయుజ్ టి-11"లో ఏప్రిల్ 2 వతేదీ 1984 న ప్రారంభమయింది. ప్రయాణసమయంలో రాకేష్ శర్మ హిమాలయాలలో జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టులకై ఛాయాచిత్రాలను తీశాడు. ఈ ప్రయాణ సమయాన అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాకేష్ శర్మను భారతదేశం ఎలా కనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు రాకేష్ శర్మ సారే జహాఁ సే అచ్ఛా హిందూస్తాఁ హమారా అని సమాధానం చెప్పి దేశభక్తిని చాటిచెప్పాడు.

రోదసీ నుండి తిరిగొచ్చాక రష్యా ఇతన్ని "హీరో ఆఫ్ సోవియట్ యూనియన్" అనే బిరుదు ఇచ్చి గౌరవించింది. భారతదేశం రాకేష్ శర్మనూ ఇరువురు రష్యన్ వ్యోమగాములనూ అశోక చక్ర అవార్డులతో సత్కరించింది.

రాకేష్ శర్మ, వింగ్ కమాండర్ రవీష్ మల్హోత్రా ఇరువురూ ఈ యాత్రకు పోటీపడ్డారు, అదృష్టం రాకేష్ శర్మను వరించింది. వీరిరువురూ "జీరో గ్రావిటీ" (భూమ్యాకర్షణా రహితం) శిక్షణపొందారు, ఈ శిక్షణలో వీరు యోగాభ్యాసం చేశారు. ప్రయాణంలోకూడా రాకేష్ శర్మ 'యోగాసనాలు' చేశాడు.

రాకేష్ శర్మ ప్రస్తుతం పదవీ విరమణ పొందాడు. 2006 నవంబరు ఇతను ప్రముఖ శాస్త్రజ్ఞుల సమావేశంలో పాల్గొన్నాడు.[1] ISRO నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత మొదటి వ్యోమగామి యాత్రకు పచ్చజెండా ఊపబడింది.

జీవిత విషయాలు

[మార్చు]

హైదరాబాద్ అబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో చదివాడు.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]