రాక్ గార్డెన్, చండీగఢ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాక్ గార్డెన్ భారతదేశంలోని చండీగఢ్‌లో సుఖ్‌నా సరస్సుకు దగ్గరలో ఉన్న రాతి ఉద్యానవనం. దీనిని "నెక్ చంద్ రాతి ఉద్యానవనం" గా కూడా వ్యవహరిస్తారు. 

విశేషాలు

[మార్చు]
ఈ ఉద్యానవనం రాతితోచేసిన విగ్రహాలకు ప్రసిద్ధి చెందినది.
రాతి ఉద్యానవనంలో వాటర్ ఫాల్

ఇది సృజనాత్మకతకు, నూతన ఆవిష్కరణకు, అద్భుత చాతుర్యానికి పెట్టింది పేరు. చండీగఢ్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ ఇన్‌స్పెక్టర్ అయిన నెక్ చంద్ ఈ ఉద్యాన సృష్టికర్త. 1957లో 12 ఎకరాల స్థలంలో 18 ఏళ్లపాటు కృషి చేసి దేశంలోనే ప్రత్యేక ఉద్యానంగా దీనిని తీర్చిదిద్దాడు. ఇది ప్రస్తుతం సుమారు నలభై ఎకరాలకు విస్తరించింది. [1][2]

ఇది సుకానా సరస్సుకు దగ్గరలో ఉంది.[3] ఇందులో కృత్రిమ జలపాతాలు, చెత్త, యితర వ్యర్థాలతో (గాజువస్తువులు, గాజులు, టైల్సు, సిరామిక్ కుండలు, సింకులు, విద్యుత్ వ్యర్థపదార్థాలుమొదలైనవి) చేయబడిన యితర విగ్రహాలు విస్తరింపబడి ఉన్నాయి.[4]

నెక్ చంద్ ఈ ఉద్యానవనాన్ని 1957లో 12 ఎకరాల స్థలంలో 18 ఏళ్లపాటు కృషి చేసి దేశంలోనే ప్రత్యేక ఉద్యానంగా తీర్చిదిద్దాడు. వాస్తవానికి ఈ గార్డెన్ ఏర్పాటుపై అప్పటి ప్రభుత్వం నిషేధం విధించింది. అందుకని 18 ఏళ్లపాటు చీకటి రాత్రుల్లోనే ఎవరికీ తెలియకుండా ఈ రాతి తోటను సృష్టించాడు. రాత్రివేళ రహస్యంగా సమీపంలోని అడవికి వెళ్లి, రాళ్లను చేతులతో మోసుకొచ్చేవాడు. కొండ ప్రాంతాలకు సైకిలు పై వెళ్లి పెద్ద పెద్దరాళ్లను తీసుకువచ్చేవాడు. కూల్చివేసిన భవనాల నుంచి వ్యర్థాలను సేకరించి తెచ్చేవాడు. వీటన్నింటి మిశ్రమంతో నృత్యభంగిమల్లో ఉన్నవి, సంగీతకారుల శిల్పాలు, జంతువులకు సంబంధించిన శిల్పాలను ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఈ పార్క్ కోసం 50 మంది శ్రామికులు రేయింబవళ్లు ఏకాగ్రతతో పనిచేశారు. 1975లో ఈ రాతి ఉద్యానం వెలుగులోకి రావడం, ప్రభుత్వం చంద్ శ్రమను గుర్తించి, పట్టణంలో పనికిరాని వస్తువులను, విరిగిన సెరామిక్ రాళ్లను ఇందుకోసం ఉపయోగించమని సూచించింది. 1976లో ఈ పార్క్‌ను పబ్లిక్ ప్లేస్‌గా గుర్తించి ప్రజల సందర్శనకు అనుమతి ఇచ్చింది. 1983లో ఈ ఉద్యానం పేరిట ప్రత్యేక తపాలా బిళ్ళను వెలువరించారు. ఈ రాక్‌గార్డెన్ సందర్శనకు ప్రతిరోజూ 5 వేల మందికి పైగా సందర్శకులు వస్తున్నారు.[5][6]

ఆయన ఉద్యోగ విధులు ముగిసాకా, శివాలిక్ కొండల దిగువన తిరుగుతూ, పక్షి ఆకృతిలో, వివిధ జంతువుల ఆకారాల్లో, మనిషి ఆకారంలో ఉన్న రాళ్ళను ఏరి, తన సైకిల్ పై తీసుకు వచ్చేవాడు. తాను ఉండి, పని చేసుకునేందుకు వీలుగా ఒక రాతి గుడిసెను ఏర్పరచుకున్నాడు. మొదటి ఏడేళ్ళు గృహాల నుంచి, పరిశ్రమల నుంచి, వీధుల నుంచి వ్యర్ధ పదార్ధాల సేకరణలో గడిపాడు. విరిగిన గాజు ముక్కలు, పగిలిన కుండలు, సిరామిక్ టైల్స్, మాడిన బల్బులు, సీసాలు, మంగలి వద్ద నుంచి కత్తిరించిన జుట్టు, ఇవే అతని ముడి పదార్ధాలు. క్రమంగా అవన్నీ అద్భుతమైన 20,000 కళాకృతులుగా రూపుదిద్దుకున్నాయి. 12 ఎకరాల్లో నాట్యకారులు, సంగీత వాద్య కారులు, వివిధ జంతువులు, రాతి మేడలు, తోరణాలు, జలపాతాలు, సింహాసనం, కళారూపాలతో ‘సుఖ్రాని’ అద్భుత సామ్రాజ్యం నిర్మించాడు. ఒక సన్నటి దారి గుండా వెళ్తుంటే, ముందర ఏమి వస్తుందో తెలియని ఉద్విగ్నత! మరొక్క క్షణం ఆగితే, కళ్ళముందు మరో అద్భుత ప్రపంచం.ఇలా సాగుతుంది చండీగఢ్ రాక్ గార్డెన్స్ లో సందర్శకుల పయనం. ‘ఒక్క మనిషి, ఇంత అద్భుతాన్ని సృష్టించగలడా ?’, అని ఆశ్చర్యపోనివారు ఉండరు.

ఇతర పఠనాలు

[మార్చు]
  • Nek Chand's outsider art: the rock garden of Chandigarh, by Lucienne Peiry, John Maizels, Philippe Lespinasse, Nek Chand. Published by Flammarion, 2006. ISBN 2-08-030518-2.
  • The Collection, the Ruin and the Theatre: Architecture, sculpture and landscape in Nek Chand's Rock Garden, by Soumyen Bandyopadhyay and Iain Jackson. Liverpool University Press, 2007. ISBN 1-84631-120-9.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Nek Chand Rock Garden Sublime spaces & visionary worlds: built environments of vernacular artists, by Leslie Umberger, Erika Lee Doss, Ruth DeYoung (CON) Kohler, Lisa (CON) Stone, Jane (CON) Bianco.
  2. "Night tourism to light up 'rocks'". The Times of India. 2012-07-01. Archived from the original on 2013-01-26. Retrieved 2012-10-30.
  3. "Working wealth out of waste". Archived from the original on 2012-07-18. Retrieved 2015-06-15.
  4. "Chandigarh, the City Beautiful: Environmental Profile of a Modern Indian City".
  5. చూసొద్దాం... రాక్ గార్డెన్స్!
  6. "Discover India by Rail".

ఇతర లింకులు

[మార్చు]