రాజనగర్
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
రాజనగర్ ఇది తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం
విశేషాలు
[మార్చు]రాయికల్ మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో జగిత్యాల జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంచి ఆహ్లాదకర వాతావరణం కలిగి ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు పచ్చని అడవి పొలాల మధ్యలో అందంగా ముస్తాబై ఉంటుంది. సరిహద్దులుగా ఆలూర్ ఉప్పుమడుగు రంగాపేట్ అల్లీపూర్ గ్రామాలను కలిగి ఉంది. రాజనగర్ ఒకే చోట కాకుండా పూర్వ గ్రామం , కొత్త పల్లె , లంబాడీ తండా అని మూడు ప్రాంతాలుగా ఉంటుంది అయినా అందరూ కలిసిమెలిసి బంధువుల్లా కలిసి ఉంటారు
జనాభా
[మార్చు]900 ల పైచిలుకు జనాభా కలిగిన గ్రామం.స్వంత పంచాయితీ కలిగి ఉండి ఎంపీటీసీ స్థానాన్ని ఆలూర్ గ్రామంతో పంచుకుంటుంది
పూర్వ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది అందులో ఇంగ్లీష్ తెలుగు మీడియంలో విద్యాబోధన చేస్తున్నారు అలాగే లంబాడీ తండాలో ఒక ప్రాథమిక పాఠశాల అందుబాటులో ఉంది. ఇక పై రెండు ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి
వైద్యం
[మార్చు]ప్రభుత్వ క్లినిక్ లేకున్నా ANM లు ఆర్ఎంపీ లు నిత్యం అందుబాటులో ఉంటారు
వృత్తులు
[మార్చు]కులవృత్తులతో పాటు ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి దాదాపు అందరూ వ్యవసాయం చేస్తారు
వరి ఇక్కడ ప్రధాన పంట దానితో పాటు మామిడి కూడా ప్రధాన పంటనే మొక్కజొన్న పసుపు కంది లాంటి పంటలు కూడా విరివిగా సాగు చేస్తుంటారు
చూడదగ్గ ప్రదేశాలు
[మార్చు]ఉప్పుమడుగు గ్రామ సరిహద్దును పంచుకుంటూ ఉన్న ఉసికే బోరు పైన స్వయంభు ఉమా మహేశ్వరస్వామి ఆలయం ఉంది ఇది ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు
అలాగే అల్లీపూర్ సరిహద్దులో ఉన్న పెద్దమ్మ దేవాలయం , గ్రామంలో ఉన్న పెద్దబిలుకు దగ్గరి పెద్దమ్మ దేవాలయం విశాలమైన గ్రామ పాఠశాల అందులో ఉన్న జ్ఞాన సరస్వతి గుడి దీనిని విరాళాలు సేకరించి నవరత్న ఫ్రెండ్స్ అసోసియేషన్ NFA వారు కట్టించారు వీటితో పాటు పెద్ద చెరువు మరో చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటి ఇవన్నీ గ్రామంలో చూడదగ్గ ప్రదేశాలు.
చెరువు కట్ట
[మార్చు]మండలం మొత్తంలో ఏ కాలంలో అయినా నీళ్ళు ఉండే చెరువు ఇదొక్కటే పొడవైన కట్ట దీని ప్రత్యేకత , అలాగే బతుకమ్మ ఘాట్ కట్ట పొడవునా చెట్లు చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడే చిన్నగా వెంకటేశ్వర్ల స్వామి విగ్రహం ( గుడి నిర్మాణ దశలో ఉంది ) వీక్షించడానికి చూడచక్కని అందమైన దృశ్యాలు మరెన్నో ఉన్నాయి..