రాజన్న సిరిపట్టు
రాజన్న సిరిపట్టు | |
---|---|
ప్రాంతం | సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ |
దేశం | భారతదేశం |
రాజన్న సిరిపట్టు అనేది తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలో తయారుచేసిన పట్టుచీర.[1] ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ఈ పట్టుచీరలను తెలంగాణ ప్రభుత్వ సహకారంతో 2022 సెప్టెంబరు 17న న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ ఆ దేశంలో ఆవిష్కరించింది.[2]
నేపథ్యం
[మార్చు]2018లో బతుకమ్మ చీరల తయారీని చూసేందుకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ సిరిసిల్లలోని నేతన్నలు, వారి నైపుణ్యం గురించి తెలుసుకున్నది. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ తయారుచేసిన పట్టుచీరెలను అమెరికా, యుకె, న్యూజిలాండ్ తదితర దేశాల వారికి పరిచయం చేసింది. ఈ పట్టుచీరలకు ఓ బ్రాండ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ‘రాజన్న సిరిపట్టు’గా పేరు పెట్టబడింది. ప్రస్తుతం జిల్లాలో 40 మందికిపైగా నేత్నలు ఈ చీరలను తయారుచేస్తున్నారు.[3]
ప్రదర్శన
[మార్చు]న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్, 300 మంది ప్రవాస భారతీయుల సమక్షంలో ఏర్పాటుచేసిన సిరిసిల్ల నేతన్నల ఉత్పత్తుల ప్రదర్శనలో భాగంగా సిరిసిల్ల పట్టుచీరలతోపాటు ఫ్యాషన్ షో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ ఆ దేశంలో ఆవిష్కరించగా, వర్చువల్ గా ఏర్పాటుచేసిన మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక, చేనేత-జౌళిశాఖలమంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొని శుభాకాంక్షలు అందించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Rajanna Siripattu sarees weave magic in New Zealand". The New Indian Express. 2022-09-19. Archived from the original on 2022-09-19. Retrieved 2022-10-14.
- ↑ telugu, NT News (2022-09-18). "అంతర్జాతీయ వేదికపై 'రాజన్న సిరిపట్టు' ఆవిష్కరణ.. హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-09-18. Retrieved 2022-10-14.
- ↑ Velugu, V6 (2022-09-18). "'రాజన్న సిరిపట్టు' బ్రాండ్ కు మరింత ప్రచారం". V6 Velugu. Archived from the original on 2022-09-21. Retrieved 2022-10-14.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "KTR: న్యూజిలాండ్‌లో 'రాజన్న సిరిపట్టు' ఆవిష్కరణ.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్". EENADU. 2022-09-19. Archived from the original on 2022-09-18. Retrieved 2022-10-14.