Jump to content

రాజా రామ్ సింగ్ కుష్వాహా

వికీపీడియా నుండి
రాజా రామ్ సింగ్ కుష్వాహా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు రామ్ విలాస్ సింగ్
తరువాత సత్యనారాయణ యాదవ్
నియోజకవర్గం కరకత్

పదవీ కాలం
1995 – 2005
నియోజకవర్గం ఓబ్రా

బీహార్ & జార్ఖండ్‌లకు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్
తల్లిదండ్రులు దీపన్ సింగ్
పూర్వ విద్యార్థి 1983లో బీసీఈ పాట్నా నుండి బీఎస్సీ (ఇంజనీరింగ్)(సివిల్)

రాజా రామ్ సింగ్ కుష్వాహా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కరకత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

రాజా రామ్ సింగ్ ఓబ్రా నియోజకవర్గం నుండి 1985, 1990 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర, ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995, 2000 శాసనసభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజా రామ్ సింగ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కరకత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ - ఎంఎల్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పవన్ సింగ్‌పై 1,05,858 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రాజా రామ్ సింగ్‌కు 3,80,581 ఓట్లు, పవన్‌ సింగ్‌కు 2,74,723 ఓట్లు వచ్చాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India. "2024 Loksabha Elections Results - Karakat". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  2. India Today (13 July 2024). "Farmer leaders | A harvest of ambitions" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
  3. आज तक (5 June 2024). "Karakat Election Result: कौन हैं राजा राम सिंह... जिन्होंने चुनावी मैदान में पवन सिंह और उपेंद्र कुशवाहा को किया पस्त". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.