రాజా విక్రమదేవ వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Vikram Deo IV of Jeypore.

రాజా విక్రమదేవ వర్మ (1890 - 1951) పండితులు, విద్యాపోషకులు.

వీరు శ్రీకృష్ణ చంద్రదేవ మహారాజు, రేఖాంబ దంపతులకు ప్రస్తుత ఒరిస్సాలోని కోరాపుట్ లో జన్మించారు.

1930లో జయపురాధీశ్వరుడు విస్సం తుగ చనిపోవడంతో వారసత్వరీతిగా వీరు జయపురం జమిందారు అయ్యారు. వీరి మాతృభాష ఒరియా అయినా కూడా ఆంధ్ర భాషను కూడా ప్రేమించి, అభ్యసించి, దానిలో పండితులయ్యారు. వీరు మానవతీ చరిత్రము, కృష్ణార్జున చరిత్రము మొదలైన గ్రంధాలు రచించారు.

వీరు కవి పోషకులు. ఎందరో పండితులను, కవులను సత్కరించి సాయం చేశారు. విద్యావ్యాప్తిలో వీరికి ఆసక్తి ఎక్కువ. ఆంధ్ర విశ్వవిద్యాలయంకు తగిన ధనసహాయం చేయుటయే కాక తన జమిందారీ నుండి ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు ఆ విద్యాలయానికి ఇచ్చే ఏర్పటు చేశారు. జీవితాంతం ఆంధ్ర విశ్వకళా పరిషత్తుకు ప్రో ఛాన్సలరుగా ఉన్నారు. వీరి దానశీలతకు కృతజ్ఞతా సూచకంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని సైన్స్-టెక్నాలజీ కళాశాలకు వీరి పేరుమీద "రాజా విక్రమదేవ వర్మ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల" అని నామకరణం చేశారు. వీరి కాంస్య విగ్రహం ఆ కళాశాల భవనం ముందు ప్రతిష్టించబడి ఉంది.

ఉత్కళ, ఆంధ్ర, సంస్కృత విశ్వవిద్యాలయాలు వీరికి డి.లిట్. పట్టా ఇచ్చాయి.

మూలాలు[మార్చు]