రాజేష్ మిశ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజేష్ మిశ్రా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు రితి పాఠక్
నియోజకవర్గం సిధి

వ్యక్తిగత వివరాలు

జననం (1957-12-20) 1957 డిసెంబరు 20 (వయసు 66)
సిధి
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు కె.డి మిశ్రా, శివవతి
జీవిత భాగస్వామి సావిత్రి మిశ్రా

రాజేష్ మిశ్రా (జననం 1 మే 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సిధి నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

డాక్టర్ రాజేష్ మిశ్రా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2008లో మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచి 2009లో భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన ఆ తరువాత బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, ఉత్తరప్రదేశ్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌గా పని చేశాడు.

రాజేష్ మిశ్రా 2023లో మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో సిద్ధి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ టికెట్ ఆశించగా టికెట్ రాకపోవడంతో రాజీనామా చేశాడు. ఆయన ఆ తరువాత పార్టీ నచ్చచెప్పడంతో రాజీనామా వెనక్కు తీసుకున్నాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సిధి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి కమలేశ్వర్‌ పటేల్‌పై 187943 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. TimelineDaily (4 March 2024). "BJP Picks Former MLA Rajesh Mishra Who 'Passed Class 12th Last Year' For Sidhi Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.
  2. "2024 Loksabha Elections Results - Sidhi". 4 June 2024. Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
  3. TV9 Bharatvarsh (6 June 2024). "सीधी लोकसभा सीट से जीतने वाले BJP के राजेश मिश्रा कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. India Today (13 July 2024). "Doctors | Healthy corps" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.