రాజ్‌గిర్
రాజగిరి | |
---|---|
నగరం | |
Country | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | నలంద |
Elevation | 73 మీ (240 అ.) |
జనాభా (2011) | |
• Total | 41,619 |
భాషలు | |
• అధికార | మగధి, హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 803116 |
టెలిఫోన్ కోడ్ | 916112 |
Vehicle registration | BR |
లింగ నిష్పత్తి | 1000/889 ♂/♀ |
అక్షరాస్యత | 51.88% |
లోక్ సభ నియోజకవర్గం | నలంద |
విధానసభ నియోజకవర్గం | రాజగిరి(SC)(173) |
రాజ్‌గిర్ లేదా రాజగిరి, భారత రాష్ట్రమైన బీహార్ లోని నలంద జిల్లాలో గుర్తింపు పొందిన నగరం రాజగిరి. రాజగిరి నగరం మగధ సామ్రాజ్యం మొదటి రాజధానిగా ఉండేది, చివరికి మౌర్య సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా విస్తరించింది. ఈ నగరానికి గల ఇతర పేర్లు రాజగృహ, గిరివ్రజం. ఈ నగర పుట్టుక తేది తెలియరాలేదు, అయితే క్రీ.పూ 1000 నాటి సిరమిక్స్ ఈ నగరంలో కనుగొనబడ్డాయి.
మహావీర, గౌతమ బుద్ధులకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ప్రాంతం బౌద్ధమతం , జైనమతంలో కూడా గుర్తింపు పొందింది[1], పేరొందిన అతనతియ సుత సమావేశం ఇక్కడి రాబందు శిఖర పర్వతం వద్ద జరిగింది. రాజగిరి రైలు , రోడు మార్గాలచే భక్తియార్పూర్ వయా పాట్నాకు అనుసంధానించబడింది.
రాజ్‌గిర్ పాట్నా , మొకమెహ్ రెండింటి నుంచి దాదాపు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇది రాతి కొండలు చుట్టుముట్టి ఉన్న ఒక ఆకుపచ్చ లోయలో ఉంది. భారతీయ రైల్వే నేరుగా రాజగిరి నుండి న్యూఢిల్లీకి షరంజీవి ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది.
మూలాలు
[మార్చు]- ↑ Jain Dharma ka Maulik Itihas Part-1, Ed. Acharyashri Hastimalji Maharaj, 1971 p. 739-742