Jump to content

రాణా జగ్జిత్‌సింగ్ పాటిల్

వికీపీడియా నుండి
రాణా జగ్జిత్‌సింగ్ పాటిల్
రాణా జగ్జిత్‌సింగ్ పాటిల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు మధుకర్‌రావు చవాన్
నియోజకవర్గం తుల్జాపూర్

రెవెన్యూ, పరిశ్రమలు, వ్యవసాయం, జీఏడీ, ప్రోటోకాల్ & సాంస్కృతిక శాఖ మంత్రి

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2002 ఏప్రిల్ 25 - 2014 ఏప్రిల్ 24

వ్యక్తిగత వివరాలు

జననం 30 అక్టోబర్ 1971
మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు పద్మసిన్హా బాజీరావ్ పాటిల్
జీవిత భాగస్వామి అర్చన రాణా జగ్జిత్‌సింగ్ పాటిల్[1][2]
వృత్తి రాజకీయ నాయకుడు

రాణా జగ్జిత్‌సింగ్ పద్మసిన్హా పాటిల్ (జననం 30 అక్టోబర్ 1971) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు తుల్జాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.

రాణా జగ్జిత్‌సింగ్ పాటిల్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మేనల్లుడు, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి పద్మసిన్హా బాజీరావ్ పాటిల్ కుమారుడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రాణా జగ్జిత్‌సింగ్ పాటిల్ తన తండ్రి పద్మసిన్హా బాజీరావ్ పాటిల్ అడుగుజాడల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2002 ఏప్రిల్ 25 నుండి 2014 ఏప్రిల్ 24వరకు ఎన్‌సీపీ నుండి మహారాష్ట్ర శాసనసమండలి సభ్యుడిగా ఎన్నికై మహారాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ, పరిశ్రమలు, వ్యవసాయం, జీఏడీ, ప్రోటోకాల్ & సాంస్కృతిక శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మధుకర్‌రావు చవాన్ పై 23169 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

రాణా జగ్జిత్‌సింగ్ పాటిల్ 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ ధీరాజ్ అప్పసాహెబ్ కదం పాటిల్ పై 36879 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Loksatta (25 April 2024). ""आमदार नसतानाही राणाजगजीतसिंह पाटलांना मंत्री केलं, पण त्यांचे...", शरद पवार यांचा टोला" (in మరాఠీ). Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
  2. Hindustantimes (5 April 2024). "BJP MLA's wife Archana Patil joins NCP, gets Osmanabad ticket". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
  3. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Tuljapur". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.