Jump to content

రాబిన్ స్వికార్డ్

వికీపీడియా నుండి
రాబిన్ స్వికార్డ్
జననం
రాబిన్ స్టెండర్ స్వికార్డ్[1]

(1952-10-23) 1952 అక్టోబరు 23 (వయసు 72)
కొలంబియా, యుఎస్
విద్యాసంస్థఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ
వృత్తిస్క్రీన్ ప్లే రచయిత్రి, దర్శకత్వం
క్రియాశీల సంవత్సరాలు1979–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ (2008)
గుర్తించదగిన సేవలు
లిటిల్ ఉమెన్ (1994)
జేన్ ఆస్టెన్ బుక్ క్లబ్
జీవిత భాగస్వామి
పిల్లలుజో కజాన్
మాయ కజాన్

రాబిన్ స్టెండర్ స్వికార్డ్, అమెరికన్ స్క్రీన్ ప్లే రచయిత్రి, సినిమా దర్శకురాలు, నాటక రచయిత, సాహిత్యకారిణి.[2] లిటిల్ ఉమెన్ (1994), మటిల్డా (1996), ప్రాక్టికల్ మ్యాజిక్ (1998), మెమోయిర్స్ ఆఫ్ ఎ గీషా (2005),[3] ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ (2008) వంటి సినిమాలకు స్క్రీన్‌ప్లే రాసింది.[4][5] ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ సినిమా ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో అకాడమీ అవార్డుకు, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ ఆయింది. 2007లో వచ్చిన ది జేన్ ఆస్టెన్ బుక్ క్లబ్‌ సినిమాకు రచన, దర్శకత్వం వహించింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యురాలు.

జననం

[మార్చు]

స్వికార్డ్ 1952, అక్టోబరు 23న జీన్ కారోల్ స్వికార్డ్ (నీ స్టెండర్) - వ్యాపారవేత్త హెన్రీ "హాంక్" గ్రేడీ స్వికార్డ్ II దంపతులకు దక్షిణ కరోలినాలోని కొలంబియాలో జన్మించింది.[3] స్వికార్డ్ తండ్రి మిలిటరీలో పనిచేసినందున కుటుంబం తరచుగా వివిధ ప్రాంతాలకు తరలివెళ్ళేది. తన బాల్యంలో ఎక్కువభాగం స్పెయిన్‌లోని బార్సిలోనాలో గడిపిన స్వికార్డ్, చివరికి ఫ్లోరిడాలో స్థిరపడింది.[6] స్టీవెన్ స్వికార్డ్ అనే సోదరుడు ఉన్నాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సినీ దర్శకుడు ఎలియా కజాన్ కుమారుడు అయిన స్క్రీన్ ప్లే రచయిత నికోలస్ కజాన్‌తో 1984లో స్వికార్డ్ వివాహం జరగింది. వారి కుమార్తెలు నటీమణులు జో కజాన్, మాయా కజాన్ ఉన్నారు.[7][8]

సినిమాలు

[మార్చు]
  • 1980: క్యూబా క్రాసింగ్ – స్క్రీన్ ప్లే/కథ
  • 1987: ది డిస్నీ సండే మూవీ (టీవీ సిరీస్) – రచయిత, 1 ఎపిసోడ్: "యు రుయిన్డ్ మై లైఫ్"
  • 1989: షాగ్ – లానియర్ లానీ & టెర్రీ స్వీనీతో స్క్రీన్ ప్లే
  • 1993: ది రెడ్ కోట్ (చిన్న) - రచయిత, దర్శకుడు
  • 1994: లిటిల్ ఉమెన్ ( లూయిసా మే ఆల్కాట్ రాసిన లిటిల్ ఉమెన్ పుస్తకం నుండి స్వీకరించబడింది) – స్క్రీన్ ప్లే, సహ నిర్మాత
  • 1995: ది పెరెజ్ ఫ్యామిలీ (క్రిస్టిన్ బెల్ రాసిన ది పెరెజ్ ఫ్యామిలీ పుస్తకం నుండి స్వీకరించబడింది) - స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
  • 1996: మటిల్డా ( రోల్డ్ డాల్ రాసిన మటిల్డా పుస్తకం నుండి నికోలస్ కజాన్‌తో స్వీకరించబడింది) – స్క్రీన్ ప్లే, సహ నిర్మాత
  • 1998: ప్రాక్టికల్ మ్యాజిక్ ( ఆలిస్ హాఫ్‌మన్‌చే ప్రాక్టికల్ మ్యాజిక్ పుస్తకం నుండి అకివా గోల్డ్స్‌మన్, ఆడమ్ బ్రూక్స్‌తో స్వీకరించబడింది) – స్క్రీన్‌ప్లే, సహ నిర్మాత
  • 2005: మెమోయిర్స్ ఆఫ్ ఎ గీషా ( ఆర్థర్ గోల్డెన్ రచించిన మెమోయిర్స్ ఆఫ్ ఎ గీషా పుస్తకం నుండి స్వీకరించబడింది) – స్క్రీన్ ప్లే
  • 2007: ది జేన్ ఆస్టెన్ బుక్ క్లబ్ ( కరెన్ జాయ్ ఫౌలర్ రాసిన ది జేన్ ఆస్టెన్ బుక్ క్లబ్ పుస్తకం నుండి స్వీకరించబడింది) – స్క్రీన్ ప్లే, దర్శకుడు
  • 2008: ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ (ఎఫ్. స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్ రచించిన చిన్న కథ నుండి ఎరిక్ రోత్‌తో కథ క్రెడిట్) – కథ
  • 2016: ది ప్రామిస్ – స్క్రీన్‌ప్లే ( టెర్రీ జార్జ్‌తో కలిసి)[9]
  • 2016: వేక్‌ఫీల్డ్ – స్క్రీన్‌ప్లే, దర్శకుడు. ఈఎల్ డాక్టరోవ్ చిన్న కథ ఆధారంగా[10]
  • 2019: వెన్ దే సీ యు (టీవీ సిరీస్) - రచయిత, 2 ఎపిసోడ్‌లు

నాటకరంగం

[మార్చు]
  • స్వికార్డ్, రాబిన్. లాస్ట్ డేస్ ఎల్ ది డిక్సీ గర్ల్ కేఫ్‌. న్యూయార్క్: శామ్యూల్ ఫ్రెంచ్, 1983.ISBN 978-0-573-61917-5[11]
  • స్వికార్డ్, రాబిన్. క్రిమినల్ మైండ్స్. న్యూయార్క్: శామ్యూల్ ఫ్రెంచ్, 1984.ISBN 978-0-573-61942-7ISBN 978-0-573-61942-7[12][13][14]

పదవులు

[మార్చు]
  • 2012–ప్రస్తుతం: అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 'గవర్నర్స్ బోర్డ్[15]
  • అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ' నికోల్ స్క్రీన్ రైటింగ్ ఫెలోషిప్ కమిటీ చైర్ – రైటర్స్ బ్రాంచ్[16]
  • యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా లైబ్రరీస్, స్క్రిప్ట్ అవార్డులు - ఎంపిక కమిటీ
  • రైటర్స్ కో-ఆప్, సభ్యురాలు[17][18]
  • బోర్డ్ ఆఫ్ ది రైటర్స్ గిల్డ్ ఫౌండేషన్
  • రైటర్స్ గిల్డ్ పెన్షన్, హెల్త్ ఫండ్ ట్రస్టీ
  • శాన్ డియాగో స్టేట్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఉమెన్ ఇన్ టెలివిజన్ & ఫిల్మ్ అడ్వైజరీ బోర్డ్[19]

మూలాలు

[మార్చు]
  1. "Florida Obituary and Death Notice Archive - Page 1042: Henry "Hank" Grady Swicord II". GenLookups. October 24, 2013. Retrieved 2023-06-07.
  2. Wolf, Jaime (August 23, 1998). "The Blockbuster Script Factory". The New York Times. Retrieved 2023-06-07.
  3. 3.0 3.1 Kay, Jeremy (January 10, 2006). "Memoirs of an adaptation". The Guardian. Retrieved 2023-06-07.
  4. Morgan, Barbara; Perez, Maya (2013). "Structure and Format: A Conversation with Frank Pierson, Whit Stillman, Robin Swicord, and Nicholas Kazan". On Story: Screenwriters and Their Craft (First ed.). Austin, TX: University of Texas Press. pp. 63–80. ISBN 978-0-292-75460-7. OCLC 879547941.
  5. "Literary Luncheon Series with author and screenwriter Robin Swicord". Research Channel, University of Southern California. Archived from the original on 2016-03-09. Retrieved 2023-06-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. Grierson, Tim (2013). "Robin Swicord". Screenwriting. Burlington, MA: Focal Press. pp. 154–163. ISBN 978-1-136-07061-7. OCLC 867050208.
  7. "Zoe Swicord Kazan - California Birth Index". FamilySearch. Retrieved 2023-06-07.
  8. Turan, Kenneth (March 28, 2010). "Film Critic's Notebook: When an actor is also a friend". Los Angeles Times. Retrieved 2023-06-07.
  9. Ford, Rebecca (June 15, 2015). "Christian Bale, Oscar Isaac Join Indie 'The Promise'". The Hollywood Reporter. Retrieved 2023-06-07.
  10. "In Development". Mockingbird Pictures. Retrieved 2023-06-07.
  11. "Last Days at the Dixie Girl Cafe by Robin Swicord". Samuel French, Inc. 1983. Retrieved 2023-06-07.
  12. "Criminal Minds by Robin Swicord". Samuel French, Inc. 1984. Retrieved 2023-06-07.
  13. Rich, Frank (January 18, 1984). "Stage: 'Criminal Minds'". The New York Times. Retrieved 2023-06-07.
  14. Arkatov, Janice (December 11, 1992). "Theater: Love on the Lam : The Gnu Theatre in North Hollywood brings Robin Swicord's dark, oddball comedy 'Criminal Minds' back to the Valley". Los Angeles Times. Retrieved 2023-06-07.
  15. Kilday, Gregg (September 19, 2012). "Screenwriter Robin Swicord Joins Academy's Board of Governors". The Hollywood Reporter. Retrieved 2023-06-07.
  16. Swicord, Robin (November 14, 2014). "2014 Nicholl Screenwriting Awards: Robin Swicord". Academy of Motion Picture Arts and Sciences. Archived from the original on 2015-10-02. Retrieved 2023-06-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  17. Grabicki, Michelle (September 14, 2007). "Robin Swicord, screenwriter-director". The Hollywood Reporter. The Associated Press. Retrieved 2023-06-07.
  18. Fleming, Michael (March 18, 2007). "Wells forms writer co-op at WB". Variety (magazine). Retrieved 2023-06-07.
  19. "The Advisory Board". San Diego State University's Center for the Study of Women in Television & Film Advisory Board. Retrieved 2023-06-07.

బయటి లింకులు

[మార్చు]