రామచంద్ర గాంధీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామచంద్ర గాంధీ (జూన్ 9, 1937 – జూన్ 13, 2007) భారతీయ తత్త్వవేత్త. అతడు దేవదాస్ గాంధీ (మహాత్మా గాంధీ కుమారుడు) మరియు లక్ష్మీ (రాజాజీ కుమార్తె) ల కుమారుడు. అతడి సోదరులు రాజ్ మోహన్ గాంధీ మరియు గోపాలకృష్ణ గాంధీలు. సోదరి తారా గాంధీ భట్టాచర్జీ.

రామచంద్ర గాంధీ ఆక్స్‌ఫర్డు నుండి పీటర్ స్ట్రాసన్ శిష్యరికంలో తత్త్వ శాస్త్రంలో డాక్టరేట్ డిగ్రీని పొందాడు.[1] అతను హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం విభాగాన్ని స్థాపించడానికి కృషి చేసాడు. అతడు విశ్వభారతి విశ్వవిద్యాలయం, పంజాబ్ విశ్వవిద్యాలయం, సాన్‌ఫ్రాన్సిస్కో లోని కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటెగ్రల్ స్టడీస్, సి.ఎ, మరియు బెంగళూరి విశ్వవిద్యాలయాలలో బోధించాడు. అతడు 2007 జూన్ 13న ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద మరణించాడు. [2]

అతడి కుమార్తె లీలా గాంధీ, బ్రౌన్ యూనివర్శిటీలో ప్రముఖమైన కళాకళా నిపుణురాలు.

గ్రంథములు[మార్చు]

  • ద అవైలబిలిటీ ఆఫ్ రెలిజియస్ ఐడియాస్ (1976)
  • సీతాస్ కిచెన్, అ టెస్టిమొనీ పాహ్ ఫైత్ అండ్ ఇంక్వైరీ (1992)
  • స్వరాజ్: ఎ జర్నీ విత్ టైబ్ మెహ్తాస్ శాంతినికేతన్ ట్రిప్తీచ్ (2003)
  • మునియాస్ లైట్ (2005)

మూలాలు[మార్చు]

  1. "Sita's Kitchen". SUNY Press. మూలం నుండి July 31, 2014 న ఆర్కైవు చేసారు. Retrieved July 31, 2014. Cite web requires |website= (help)
  2. Ramachandra Gandhi: the quintessential argumentative Indian | Ashish Mehta | Indiainteracts.com