రామినేని రామానుజమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామినేని రామానుజమ్మ (1880 - 1977) ప్రముఖ అనువాదకురాలు, ప్రజా సేవకురాలు.[1]

బాల్యం, విద్యాబ్యాసం[మార్చు]

రామినేని రామానుజమ్మ మధ్య ప్రదేశ్ లోని బిలాస్ పూర్లో జన్మించింది. ఈమె తండ్రి ఈడ్పుగంటి రాఘవేంద్రరావు. ఈమె కుమారులు నాగపూర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రామినేని కౌసలేంద్రరావు. ఈమె మరాఠీ, హిందీ భాషలను నేర్చుకొని, తర్వాత బండారు అచ్చమాంబ వద్ద తెలుగు, ఆంగ్లము నేర్చుకొన్నారు. కృష్ణా జిల్లా లోని కొమ్మమూరు గ్రామంలో నివసిస్తూ హరిజన పేదలకు ఉచిత పాఠశాలను నిర్వహించారు.

రచనలు[మార్చు]

1921 లో "పుత్రోపహారం" అనే రచనను హిందీ నుండి తెలుగులోకి అనువదించారు. ఈ గ్రంథం చిన్నపిల్లలు నడుచుకోవలసిన సరైన పద్ధతులను తెలియజేస్తుంది. దీనిలో బాలలు సత్ ప్రవర్తన కలిగి ఉండాలని దానికోసం ఎలా నడుచుకోవాలో తెలియ జేశారు. [2]

మరణం[మార్చు]

ఈమె 1977 సెప్టెంబరు 22 తేదీన కన్నుమూసింది.

మూలాలు[మార్చు]

  1. రామానుజమ్మ, రామినేని (1880-1977), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ 1079-80.
  2. "హరిజన సేవలో ధన్యురాలైన శ్రీమతి రామి నేని రామానుజమ్మ(కొద్ది మార్పుల అనంతరం )". groups.google.com. Retrieved 2021-09-22.