Jump to content

రామ్‍ స్వరూప్ శర్మ

వికీపీడియా నుండి
రామ్ స్వరూప్ శర్మ
పార్లమెంటు సభ్యుడు లోక్‌సభ
In office
2014 మే 16 – 2021 మార్చి 17
అంతకు ముందు వారుప్రతిభా సింగ్
తరువాత వారుప్రతిభా సింగ్
నియోజకవర్గంమండి లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1958-06-10)1958 జూన్ 10
జోగేందర్ నగర్, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
మరణం2021 మార్చి 17(2021-03-17) (వయసు 62)
న్యూఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిచంపా శర్మ
సంతానం3
నివాసంజోగేందర్ నగర్, మండి జిల్లా, హిమాచల్ ప్రదేశ్ భారతదేశం
As of డిసెంబరు 15, 2016
Source: [1]

రామ్ స్వరూప్ శర్మ ( 1958 జూన్ 10-2021 మార్చి 17) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. రామ్ స్వరూప్ శర్మ భారతీయ జనతా పార్టీ (బిజెపి) కి చెందిన రాజకీయ నాయకుడు. రామ్ స్వరూప్ శర్మ 2014, 2019లో రెండుసార్లు ఎంపీగా గెలిచి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రామ్ స్వరూప్ శర్మ హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లా జోగిందర్ నగర్ లో జన్మించారు. రామ్ స్వరూప్ శర్మ మొదట్లో మండి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా పనిచేశాడు, తర్వాత హిమాచల్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు. రామ్ స్వరూప్ శర్మ హెచ్ పి స్టేట్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ గా పనిచేశారు.

2014 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రామ్ స్వరూప్ శర్మ మండి పార్లమెంట్ స్థానానికి పోటీ చేశాడు.[2]

ఆ ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలిచాడు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రతిభా సింగ్ పై రామ్ స్వరూప్ శర్మ 39796 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 4 పార్లమెంటు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది అందులో రామ్ స్వరూప్ శర్మ పోటీ చేసిన మండి ఒకటి. 2019లో రామ్ స్వరూప్ శర్మ భారతీయ జనతా పార్టీ తరఫున రెండోసారి ఎంపీగా గెలిచాడు.

మరణం.

[మార్చు]

ఆయన 2021 మార్చి 17న న్యూఢిల్లీలో మరణించారు. రామ్ స్వరూప్ శర్మ ఢిల్లీలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sen, Meghna (17 March 2021). "Himachal Pradesh BJP MP Ram Swaroop Sharma found dead at Delhi residence". mint.
  2. "Shimla BJP to field Ram Swaroop Sharma from Mandi LS seat". Business Standard India. Press Trust of India. 26 March 2014.
  3. Sengar, Mukesn Singh; Nair, Arun (March 17, 2021). "BJP MP Ram Swaroop Sharma Found Dead At Delhi Home, Suicide Suspected". NDTV. Retrieved March 17, 2021.