రామ్ లఖన్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామ్ లఖన్ సింగ్

పదవీ కాలం
1996-2009
ముందు యోగానంద్ సరస్వతి
తరువాత అశోక్ అర్గల్
నియోజకవర్గం భిండ్

వ్యక్తిగత వివరాలు

జననం (1950-12-20) 1950 డిసెంబరు 20 (వయసు 73)
మధుపురా, భిండ్ జిల్లా, మధ్యప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బహుజన్ సమాజ్ పార్టీ
తల్లిదండ్రులు సరయూ సింగ్, గుజరాతీ దేవి
జీవిత భాగస్వామి సరితా సింగ్
సంతానం 2 కుమారులు, 1 కూతురు
మూలం [1]

రామ్ లఖన్ సింగ్ (జననం 20 డిసెంబర్ 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భిండ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రామ్ లఖన్ సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1984 నుండి 1990 వరకు భిండ్ జనపద్ (పంచాయత్) అధ్యక్షుడిగా పని చేసి 1993లో జరిగిన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో లైబ్రరీ కమిటీ, పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీలలో సభ్యుడిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భిండ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి కేదార్ నాథ్ కుష్వాపై 15798 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రామ్ లఖన్ సింగ్ 1998, 1999, 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో, 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భిండ్ లోక్‌సభ నియోజకవర్గం వరుసగా నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత బహుజన్ సమాజ్ పార్టీలో చేరి 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చి 28న తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. Deccan Herald (28 March 2024). "Ex-Bhind MP & BSP leader Ramlakhan Singh joins BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  2. The Week (28 March 2024). "BSP leader Ramlakhan Singh more Congress members join BJP in Madhya Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.