Jump to content

రామ్ షిండే

వికీపీడియా నుండి
రామ్ షిండే
రామ్ షిండే


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 డిసెంబర్ 15
డిప్యూటీ నీలం గోర్హే
ముందు రామరాజే నాయక్ నింబాల్కర్

పదవీ కాలం
2016 జూలై 8 – 2019 నవంబర్ 8
ముందు పంకజా ముండే
తరువాత శంకర్ రావు గదఖ్

పదవీ కాలం
2014 డిసెంబర్ 5 – 2016 జూలై 8

శాసనమండలి సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022 జూలై 8
నియోజకవర్గం ఎమ్మెల్యేల కోటా

పదవీ కాలం
2009 – 2019
ముందు సదాశివ్ లోఖండే
తరువాత రోహిత్ పవార్
నియోజకవర్గం కర్జాత్ జమ్‌ఖేడ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ఆశా షిండే
నివాసం చొండి, జమ్‌ఖేడ్ అహ్మద్‌నగర్
వృత్తి రాజకీయ నాయకుడు

రామ్ శంకర్ షిండే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్జాత్ జమ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నీటి సంరక్షణ శాఖ మంత్రిగా ఆ తరువాత 2022లో రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై 2024 డిసెంబర్ 15న మహారాష్ట్ర శాసనమండలి ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రామ్ షిండే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర ఎన్నికలలో కర్జాత్ జమ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బాపూసాహెబ్ రావుసాహెబ్ పై 10172 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి ఖాడే రమేష్‌ భీవ్‌రావుపై 37816 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[4] 2014లో దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో హోం, పబ్లిక్ హెల్త్, హార్టికల్చర్, మార్కెట్స్, పర్యాటక శాఖల సహాయ మంత్రిగా ఆ తరువాత 2016లో నీటి సంరక్షణ శాఖ మంత్రిగా పని చేశాడు.

రామ్ షిండే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 మహారాష్ట్ర ఎన్నికలలో కర్జాత్ జమ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిత్ పవార్ చేతిలో 43,347 ఓట్ల తేడాతో ఓడిపోయి జూలై 2022లో ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి రోహిత్ పవార్ చేతిలో 1243 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[5][6]

రామ్ షిండే 2024 డిసెంబర్ 15న మహారాష్ట్ర శాసనమండలి ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Why BJP made Ram Shinde chairman of legislative council" (in ఇంగ్లీష్). The Indian Express. 19 December 2024. Archived from the original on 8 January 2025. Retrieved 8 January 2025.
  2. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  3. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. "Maharastra Assembly Election Results 2024 - Karjat Jamkhed". 23 November 2024. Archived from the original on 8 January 2025. Retrieved 8 January 2025.
  6. "Karjat Jamkhed Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 17 December 2024. Retrieved 8 January 2025.
  7. "BJP's Ram Shinde elected unopposed as chairperson of Maharashtra Legislative Council" (in Indian English). The Hindu. 19 December 2024. Archived from the original on 8 January 2025. Retrieved 8 January 2025.