Jump to content

రావిప్రోలు సుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి

రావిప్రోలు సుబ్రహ్మణ్యం (1923 - 1981) చరిత్ర పరిశోధకులు.[1]

వీరు నెల్లూరు జిల్లాకు చెందినవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం లో మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి వద్ద పరిశోధనా శిక్షణ పొందారు. వీరు "సూర్యవంశ గజపతులు" అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పొందారు. 1946లో సర్ మోర్టిమెర్ వీలర్ (Mortimer Wheeler) తో కలిసి అరికమేడు, హరప్పా తవ్వకాలలో కృషిచేశారు. 1954-60 మధ్య భారత పురావస్తు శాఖ నిర్వహించిన నాగార్జున కొండ తవ్వకాల పర్యవేక్షణ చేసి జవహర్ లాల్ నెహ్రూ ప్రశంసలందుకున్నారు. నాగార్జున కొండ తవ్వకాల సమగ్ర నివేదిక ప్రథమ భాగం ప్రచురించారు. భారత పురావస్తు శాఖలో ప్రాంతీయ సూపరింటెండెంటుగా భోపాల్, హైదరాబాదు, ఆగ్రా, ఢిల్లీలలో పనిచేశారు. రెండో దఫా నాగార్జునకొండ తవ్వకాల నివేదిక సమర్పనకు నియమితులయ్యారు. శాలిహుండం, యాదవ నాణెములు, ఇక్ష్వాకుల నాణెములు, గుంటుపల్లి శాసనము వీరి రచనలు. ఆంధ్రేతిహాస పరిశోధన పత్రిక ప్రధాన సంపాదకులు, నాగార్జున విశ్వవిద్యాలయం బౌద్ధ పరిశోధన విభాగం స్థాపనకు మూలకారకులుగా పనిచేశారు.

మూలాలు

[మార్చు]
  1. డా. ఆర్. అనంత పద్మనాభరావు (2000). ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు. హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 158.