రాహుల్ లోధీ
రాహుల్ సింగ్ లోధీ | |||
పదవీ కాలం 4 జూన్ 2024 – 2020 | |||
ముందు | ప్రహ్లాద్ సింగ్ పటేల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | దామోహ్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2018 | |||
ముందు | జయంత్ మలైయా | ||
తరువాత | అజయ్ కుమార్ టాండన్ | ||
నియోజకవర్గం | దామోహ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 6 డిసెంబర్ 1977 మధ్యప్రదేశ్ | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
బంధువులు | ఉమాభారతి (మేనత్త) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాహుల్ సింగ్ లోధీ (జననం 6 డిసెంబర్ 1977) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి మధ్యప్రదేశ్ శాసనభకు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో దామోహ్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]రాహుల్ లోధీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013లో జరిగిన శాసనసభ ఎన్నికలలో దామోహ్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి, ఆ తరువాత 2018లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జయంత్ మలైయాపై 798 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి డిసెంబర్ 2020లో బీజేపీలో చేరి,[2] 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ టాండన్ చేతిలో ఓడిపోయాడు. రాహుల్ లోధీ ఆ తరువాత మధ్యప్రదేశ్ వేర్హౌస్ కార్పొరేషన్ ఛైర్మన్గా క్యాబినెట్ మంత్రి హోదాలో పని చేశాడు.[3]
రాహుల్ లోధీ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో దామోహ్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తర్బర్ సింగ్ లోధిపై 406426 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Damoh". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
- ↑ India Today (25 October 2020). "Ahead of Madhya Pradesh bypolls, Congress MLA Rahul Singh Lodhi joins BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
- ↑ TimelineDaily (24 March 2024). "Rahul Singh Lodhi, BJP's Candidate From Damoh Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
- ↑ TV9 Bharatvarsh (5 June 2024). "दमोह सीट से जीतने वाले बीजेपी के राहुल सिंह लोधी कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)