Jump to content

తామర వ్యాధి

వికీపీడియా నుండి
(రింగ్‍వార్మ్ నుండి దారిమార్పు చెందింది)
తామర వ్యాధి
ఇతర పేర్లుతామర, టినియా
మానవపాదంపై తామరవ్యాధి
ప్రత్యేకతచర్మవ్యాధి
లక్షణాలుఎరుపురంగు, దురద, పొలుసులు, వృత్తాకార దద్దుర్లు[1]
కారణాలుమైకోసిస్[2]
ప్రమాద కారకములుక్రీడలు ఆడేవారికి, కుస్తీ పోటీలలో పాల్గొనేవారికి, సామూహిక స్నానాలు చేసినవారికి, పెంపుడు జంతువులతో గడిపేవారికి, స్థూల కాయం ఉన్నవారికి, రోగనిరోధక శక్తి లేనివారికి[3][4]
రోగనిర్ధారణ పద్ధతివ్యాధి లక్షణాలు, మైక్రోస్కోప్ పరీక్ష[5]
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతిచర్మవ్యాధి, సోరియాసిస్, పిట్రియాసిస్ రోసియా, టినియా వర్సికలర్[6]
నివారణచర్మాన్ని పొడిగా ఉంచుకోవడండి, చెప్పులు లేకుండా నడవకూడదు, వ్యక్తిగత వస్తువులను పంచుకోకూడదు[3]
చికిత్సక్రీములు (క్లోట్రిమజోల్ లేదా మైకోనజోల్)[7]
తరుచుదనము20% జనాభా[8]

తామర వ్యాధి, చర్మానికి సంబంధించిన ఒక అంటువ్యాధి.[2] మనుషులకూ, పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులకూ, గొర్రెలు, పశువుల వంటి సాధు జంతువులకూ ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సాధారణంగా ఎరుపు రంగులో, దురదతో, పొలుసులుగా, వృత్తాకార దద్దుర్లుగా మారుతుంది. అంతేకాకుండా దీని ప్రభావం వల్ల ఆ ప్రాంతంలో జుట్టు రాలడం కూడా సంభవిస్తుంది. నాలుగు నుండి పద్నాలుగు రోజుల తరువాత దీని లక్షణాలు కనపడుతాయి.[1] ఒక్కోసారి శరీరంపైన ఒకటికంటే ఎక్కువ ప్రాంతాలలో ఒకేసారి తన ప్రభావం చూపిస్తుంది.[4]

ట్రైకోఫైటన్, మైక్రోస్పోరం, ఎపిడెర్మోఫైటన్ రకానికి చెందిన దాదాపు 40 రకాల శిలీంధ్రాల ద్వారా ఈ తామర వ్యాధి వచ్చే అవకాశం ఉంది.[2] ఈ వ్యాధి కలిగించే శిలీంధ్రాలకు కెరటిన్ ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ కెరటిన్ పదార్థం చర్మం ఉపరితలంపై, వెంట్రుకలు, గోళ్ళలో లభిస్తుంది. క్రీడలు ఆడేవారికి, కుస్తీ పోటీలలో పాల్గొనేవారికి, సామూహిక స్నానాలు చేసినవారికి, పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడిపేవారికి, స్థూల కాయం ఉన్నవారికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువ.[5]

చరిత్ర

[మార్చు]

ఈ తామర వ్యాధి అనేది 1906కి పూర్వం నుండి ఉంది. అప్పట్లో దీనికి చికిత్స చేయడానికి పాదరసం మిశ్రమాలు లేదా గంధకాన్ని లేదా అయోడిన్ ఉపయోగించేవారు. చర్మంపై వెంట్రుకలు ఉన్న భాగాలకు చికిత్స చేయడం కష్టంగా భావించేవారు, కాబట్టి తలపై చర్మానికి చికిత్స చేయడానికి ముందుగా ఎక్స్-రేలు తీసి, తరువాత దాన్నిబట్టి ఔషధాలతో చికిత్స చేసేవారు.[9] కొన్నికొన్ని సందర్భాల్లో అరరోబా పౌడర్ ఉపయోగించి చికిత్స చేసేవారు.[10]

గుర్తింపు

[మార్చు]

చర్మంపై కనిపించే లక్షణాలను బట్టి ఈ వ్యాధిని గుర్తుపట్టవచ్చు. చర్మకణాన్ని సూక్ష్మదర్శిని కిందపెట్టి చూసినపుడు కూడా ఈ వ్యాధిని గుర్తించవచ్చు.[11]

వ్యాధి సంకేతాలు, లక్షణాలు

[మార్చు]

ఈ వ్యాధి సోకడం వల్ల శరీరంపై ఉబ్బిన ఎర్రటి వలయాలు ఏర్పడతాయి. గజ్జల ప్రదేశంలో దురద వస్తుంది. ఇది గోళ్ళకు సోకడంతో గోళ్ళు దళసరిగా మారడం, రంగు వెలిసిపోయి, విరిగి ఊడిపోవడం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలు ఎక్కువగా పెద్దవారిలో కనిపిస్తాయి, సుమారు 20 శాతం జనాభాకు ఇందులో ఏదో ఒక లక్షణం కనిసిస్తూ ఉంటుంది. వేసవికాలంలో దీని లక్షణాలు పెరిగి, శీతాకాలంలో తగ్గుతాయి. కుక్కలు, పిల్లుల వంటి జంతువులకు కూడా ఈ తామరవ్యాధి సోకడంతోపాటు జంతువులు, మనుషుల మధ్య కూడా సోకవచ్చు.

నివారణ

[మార్చు]
  • దుస్తులు, క్రీడా సామగ్రి, తువ్వాళ్ళు లేదా దుప్పట్లు వంటి ఇతరుల వ్యక్తిగత వస్తువులను వాడకూడదు .
  • వ్యాధికి గురైనట్టు అనుమానం వస్తే ఆ వ్యక్తి బట్టలు వేడి నీటిలో, సబ్బుతో కడగాలి.
  • చెప్పులు లేకుండా నడవడం మానుకోవాలి. ప్రతిసారి చెప్పులు, బూట్లు ఉపయోగించాలి.[12][13][14]
  • పెంపుడు జంతువులకు వెండ్రుకలు ఊడిన ప్రదేశాలలో తరచూ శిలీంధ్రం ఉంటుంది కాబట్టి, అక్కడ తాకకూడదు. పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్త వహించాలి.

చికిత్స

[మార్చు]

చర్మాన్ని పొడిగా ఉంచుకోవడం, చెప్పులు వేసుకొని నడవడం, ఇతరులు ఉపయోగించిన వ్యక్తిగత వస్తువులను పంచుకోకపోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.[3] క్లోట్రిమజోల్ లేదా మైకోనజోల్ వంటి వ్యాధి నివారణ క్రీములను వ్యాధిసోకిన ప్రదేశంలో లక్షణాలు తగ్గేవరకూ ప్రతిరోజూ రెండుసార్లు పూయాలి, దీనికి ఒకటి లేదా రెండు వారాలు పడుతుంది. కొన్నిసార్లు కానీ మూడువారాలు కూడా పట్టవచ్చు. కనిపించే లక్షణాలు తగ్గిన తరువాత కూడా, తిరిగి సోకకుండా ఉండడానికి మరొక 7 రోజులు కొనసాగించాలి.

మరింత తీవ్రమైన సందర్భాలలో లేదా తలపై చర్మం మీద నెత్తిమీద ఏర్పడినపుడు నోటి ద్వారా ఫ్లూకోనజోల్ వంటి ఔషధాలను వాడాల్సిన అవసరం వస్తోంది.[7] వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండడానికి, గాయాల్ని తాకకూడదు. చేతులు, శరీరం కడుక్కుంటూ మంచి ఆరోగ్య పద్ధతులు పాటించాలి.

వర్గీకరణ

[మార్చు]

ఎన్నో వివిధ జాతుల శిలీంధ్రాలు ఇందులో ఉన్నాయి. అతి సాధారణంగా ఈ వ్యాధి కలిగించేవి ట్రైకోఫైటాన్, మైక్రోస్పోరం జాతులకు చెందిన డెర్మటోఫైట్స్. ఈ శిలీంధ్రాలు శరీరంలోని వివిధ ప్రాంతాలకు సోకుతాయి. క్రింది పరిస్థితులకు దారితీస్తాయి:

  • తామర వ్యాధి
    • టినియా పెడిస్ (ఆటగాడి పాదం): ఇది పాదాలపై ప్రభావం చూపుతుంది
    • టినియా అన్గ్యిం: ఇది చేతివ్రేళ్ళ గోళ్ళపై, కాలివ్రేళ్ళ గోళ్ళపై ప్రభావం చూపుతుంది
    • టినియా కార్పొరిస్: ఇది చేతులు, కాళ్ళు, నడుముపై ప్రభావం చూపుతుంది
    • టినియా క్రురిస్ (గజ్జల్లో దురద): ఇది గజ్జలపై ప్రభావం చూపుతుంది
    • టినియా మన్యూం: ఇది చేతులు, అరచేతి ప్రాంతాల్లో ప్రభావం చూపుతుంది
    • టినియా కాపిటిస్: ఇది తలపైవున్న చర్మంపై ప్రభావం చూపుతుంది
    • టినియా బార్బే: ఇది ముఖంపైవున్న వెంట్రుకలపై ప్రభావం చూపుతుంది
    • టినియా ఫేసై (ముఖ శిలీంధ్రం): ముఖంపై ప్రభావం చూపుతుంది
  • ఇతర ఉపరితల మైకోజులు
    • టినియా వెర్సికలర్: దీనికి కారణం మలస్సేజియా ఫర్ఫర్.
    • టినియా నిగ్రా: దీనికి కారణం హోర్టే వేర్నేక్కీ

మందులు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]
  • మైకోబియోటా

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Symptoms of Ringworm Infections". CDC. December 6, 2015. Archived from the original on 20 January 2016. Retrieved 5 October 2020.
  2. 2.0 2.1 2.2 "Definition of Ringworm". CDC. December 6, 2015. Archived from the original on 5 September 2016. Retrieved 5 October 2020.
  3. 3.0 3.1 3.2 "Ringworm Risk & Prevention". CDC. December 6, 2015. Archived from the original on 7 September 2016. Retrieved 5 October 2020.
  4. 4.0 4.1 Domino, Frank J.; Baldor, Robert A.; Golding, Jeremy (2013). The 5-Minute Clinical Consult 2014 (in ఇంగ్లీష్). Lippincott Williams & Wilkins. p. 1226. ISBN 9781451188509. Archived from the original on 2016-09-15.
  5. 5.0 5.1 "Diagnosis of Ringworm". CDC. December 6, 2015. Archived from the original on 8 August 2016. Retrieved 5 October 2020.
  6. Teitelbaum, Jonathan E. (2007). In a Page: Pediatrics (in ఇంగ్లీష్). Lippincott Williams & Wilkins. p. 274. ISBN 9780781770453. Archived from the original on 2017-04-26.
  7. 7.0 7.1 "Treatment for Ringworm". CDC. December 6, 2015. Archived from the original on 3 September 2016. Retrieved 5 October 2020.
  8. Mahmoud A. Ghannoum; John R. Perfect (24 November 2009). Antifungal Therapy. CRC Press. p. 258. ISBN 978-0-8493-8786-9. Archived from the original on 8 September 2017.
  9. సేక్విర, J. H. (1906) "ది వెరైటీస్ అఫ్ రింగ్వామ్ అండ్ దైర్ ట్రీట్మెంట్", బ్రిటిష్ మెడికల్ జర్నల్ , http://www.bmj.com/cgi/reprint/2/2378/193.pdf
  10. Mrs. M. Grieve. A Modern Herbal. Archived from the original on 2015-03-25.
  11. "Diagnosis of Ringworm". CDC. December 6, 2015. Archived from the original on 8 August 2016. Retrieved 5 October 2020.
  12. Klemm, Lori (2 April 2008). "Keeping footloose on trips". The Herald News. Archived from the original on 18 February 2009.
  13. Fort Dodge Animal Health: Milestones from Wyeth.com. Retrieved April 28, 2008.
  14. Ringworm In Your Dog Cat Or Other Pet: Archived 2010-03-10 at the Wayback Machine Prevention by Ron Hines DVM PhD 5/4/06. Retrieved 5 October 2020.

ఇతర లంకెలు

[మార్చు]