రిద్ధి కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిద్ధి కుమార్
జననం
జాతీయతఇండియన్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం

రిద్ధి కుమార్ ప్రధానంగా తెలుగు చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె తెలుగు సినిమా లవర్ (2018) లో తొలిసారిగా నటించింది.[1][2] ఆ తర్వాత ఆమె మలయాళంలో ప్రణయ మీనుకలుడే కాదల్ (2019), దండం (2019) తో మరాఠీ చిత్రసీమలోనూ అరంగేట్రం చేసింది.

ఆమె క్యాండీ (2021) తో వెబ్‌లోకి ప్రవేశించింది. అతాగే ఆమె హ్యూమన్ (2022) సిరీస్‌లో కూడా కనిపించింది.[3]

జీవితం తొలి దశలో[మార్చు]

మహారాష్ట్రలోని పూణేలో రిద్ధి కుమార్ జన్మించింది. ఆమె తండ్రి ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. ఆమె తల్లి అల్కా కుమార్‌ అడ్వకేట్‌. ఆమె ఫెర్గ్యూసన్‌ కాలేజ్‌ నుంచి తత్వశాస్త్రంలో బ్యాచిలర్స్‌ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[4] పదవ తరగతి పూర్తయిన నాటి నుంచే ఆమె డ్యాన్స్‌ టీచర్‌గా, ఈవెంట్‌ మేనేజర్‌గా, యాంకర్‌గా ఇలా పలు రంగాల్లో పని చేయడం మొదలుపెట్టింది.

కెరీర్[మార్చు]

మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి పలు అందాల పోటీల్లో పాల్గొని మిస్‌ పూణే (2015),  ఫేస్‌ ఆఫ్‌ ఇండియా (2016) వంటి అనేక టైటిల్స్‌ను ఆమె గెలుచుకుంది. అదే సమయంలో తెలుగు సినిమా లవర్‌ అవకాశం వచ్చింది. దాని తర్వాత తన మాతృభాష మరాఠీలో, అనంతరం మలయాళం సినిమాల్లో ఓ వైపు బిజీగా ఉంటూనే వెబ్‌ సీరీస్ లోకి అడుగుపెట్టింది.

2018 సంవత్సరం తెలుగులో రాజ్ తరుణ్ సరసన లవర్, విరాజ్‌ జె అశ్విన్‌ సరసన అనగనగా ఓ ప్రేమకథ సినిమాల్లో ఆమె నటించింది. కాగా 2019లో ఆమె వినాయకన్, దిలీష్ పోతన్‌లతో కలిసి ప్రణయ మీనుకలుడే కాదల్ అనే సినిమాతో మలయాళంలో, సంగ్రామ్ చౌఘులే సరసన దండం సినిమాతో మరాఠీలో రంగ ప్రవేశం చేసింది.

కుమార్ రోనిత్ రాయ్, రిచా చద్దాతో కలిసి క్యాండీ అనే హిందీ సిరీస్‌తో వెబ్‌లోకి ఆమె ప్రవేశించింది. 2022లో షెఫాలీ షా, కీర్తి కుల్హారీలతో కలిసి హ్యూమన్ అనే హిందీ సిరీస్‌లో కనిపించింది.

తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం రాధే శ్యామ్‌లో ప్రభాస్‌తో కలిసి నటించింది. ఆ తరువాత హిందీ వెబ్ సిరీస్ క్రాష్ కోర్స్‌లో అన్నూ కపూర్‌తో కలిసి చేసింది.[5]

2023లో విడుదల కానున్న మలయాళ చిత్రం చేతి మందారం తులసిలో సన్నీ వేన్ సరసన కూడా కనిపిస్తుంది.[6] అలాగే మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలోనూ ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌ లతోపాటు రిద్ది కుమార్‌ కూడా కీలక పాత్ర పోషిస్తోంది.[7]

మూలాలు[మార్చు]

  1. "Riddhi Kumar Biography - Sakshi". web.archive.org. 2022-11-27. Archived from the original on 2022-11-27. Retrieved 2022-11-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "EXCLUSIVE! Riddhi Kumar On Her Love For Acting And 'Lover'". The Hindu. Retrieved 18 July 2018.
  3. "Riddhi Kumar: 'I had a Malayalam connection right from my Telugu debut'". Times Of India. Retrieved 2 March 2019.
  4. "New kid on the block: All you need to known about Lover actress Riddhi Kumar". Deccan Chronicle. Archived from the original on 17 జూలై 2018. Retrieved 16 July 2018.
  5. "Annu Kapoor starrer Crash Course to premiere on Amazon Prime Video on August 5, 2022". Bollywoid Hungama. Retrieved 20 July 2022.
  6. "Sunny Wayne shares an exclusive still from RS Vimal movie Chethi Mandaram Thulasi". Times Of India. Retrieved 3 February 2021.
  7. "Prabhas: ప్రభాస్‌-మారుతీ మూవీ ఆ ముగ్గురు హీరోయిన్స్‌ ఫిక్స్‌". web.archive.org. 2022-11-27. Archived from the original on 2022-11-27. Retrieved 2022-11-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)