లవర్
లవర్ | |
---|---|
దర్శకత్వం | అనీష్ కృష్ణ |
లవర్ 2018 జులై 20 న విడుదలైన తెలుగు సినిమా
కథ
[మార్చు]రాజ్(రాజ్‌తరుణ్) ఓ మెకానిక్. స్వంత గ్యారేజ్ నడుపుతుంటాడు. అతడు బ్యాంకాక్ నగరానికి విహార యాత్ర వెళ్లాలనుకుంటాడు. అదే సందర్భంలో అన్నయ్య జగ్గూ భాయ్(రాజీవ్ కనకాల)కి ఓ ప్రమాదం వస్తుంది. తనని కాపాడే ప్రయత్నంలో రాజ్ గాయపడతాడు. ఆసుపత్రికి వెళ్లిన రాజ్‌కి చరిత(రిద్ధి కుమార్) పరిచయం అవుతుంది. తొలిచూపులోనే తనతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమలో దింపడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు. చివరకు చరిత.. రాజ్ ప్రేమను అంగీకరిస్తుంది. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న తరుణంలో చరితపై దాడి జరుగుతుంది. రాజ్ ఆమెను కాపాడుతాడు. కోయంబత్తూర్‌లో పేరు మోసిన రౌడీ(సచిన్ ఖేడేకర్)కి కాలేయ సమస్య ఉంటుంది. తను బ్రతకాలంటే కాలేయాన్ని మార్పిడి చేయాలి.. ఓ అమ్మాయి చంపి కాలేయాన్ని తన మావయ్యకి అమర్చాలనుకుంటాడు ఆ రౌడీ అల్లుడు(మావయ్య). ఆ అమ్మాయిని చరిత కాపాడుతుంది. ఇంతకు చరితకు.. ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి? రాజ్.. ప్రమాదంలోని చరితను ఎలా కాపాడుకుంటాడు? అనే విషయాలు మిగిలిన కథలో భాగం.[1]
తారాగణం
[మార్చు]- రాజ్ తరుణ్
- రిద్ది కుమార్
- రాజీవ్ కనకాల
- అజయ్
- సచిన్ ఖేడేకర్
- పెనుమత్స సుబ్బరాజు
- ప్రవీణ్
- సత్య రోహిణి
- అంజి వల్గుమాన్
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాణ సంస్థ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- సంగీతం: అంకిత్ తివారి, ఆర్కో, రిషి రిచ్ - అజయ్ వాస్, సాయి కార్తీక్,తనిష్క్ బాగ్చి
- నేపథ్య సంగీతం: జెబి
- కూర్పు: ప్రవీణ్ పూడి
- ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
- నిర్మాత: హర్షిత్ రెడ్డి
- రచన, దర్శకత్వం: అనీష్ కృష్ణ