రిషిజే ముద్గల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిషిజే ముద్గల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రిషిజే ముద్గల్
పుట్టిన తేదీ (1972-04-08) 1972 ఏప్రిల్ 8 (వయసు 52)
ఢిల్లీ, భారత దేశము
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేయి ఆఫ్ స్పిన్ / ఆఫ్ బ్రేక్
పాత్రబాట్స్ వుమన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 43)1995 7 ఫిబ్రవరి - న్యూజిలాండ్ తో
చివరి టెస్టు1995 10 డిసెంబర్ - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 46)1995 12 ఫిబ్రవరి - న్యూజిలాండ్ తో
చివరి వన్‌డే1995 15 డిసెంబర్ - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1992/93–1993/94ఢిల్లీ మహిళా క్రికెట్ జట్టు
1994/95–1996/97ఎయిర్ ఇండియా
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI
మ్యాచ్‌లు 2 6
చేసిన పరుగులు 30 15
బ్యాటింగు సగటు 10.00 3.75
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 24* 15
వేసిన బంతులు 12
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 1/–
మూలం: CricketArchive, 2022 17 ఆగస్ట్

రిషిజే ముద్గల్ కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆడిన ఒక భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె ఢిల్లీలో 1972 ఏప్రిల్ 8న జన్మించింది.

ఆమె 1995లో భారతదేశం తరపున రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆరు ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడింది. ఆమె ఢిల్లీ జట్టు, ఎయిర్ ఇండియా క్రికెట్ జట్టు తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1], [2]

గతంలో బ్యాడ్మింటన్ ఆడిన రిషిజ 1991లో ఢిల్లీ విశ్వవిద్యాలయం లోని గార్గి కళాశాలలో బీఏలో చేరింది. ఇప్పటి నుంచి క్రికెట్ ఆట ఆరంభించింది. ఆమె బ్యాటింగ్, ఫాస్ట్ బౌలింగ్‌ను పరీక్షించి, ఢిల్లీ రాష్ట్ర జట్టుకు రంజీలో ఎంపికచేసారు. ఆపై భారత జట్టు తరపున క్రికెట్ ఆడింది. మరి 5 సంవత్సరాలు ఎయిర్ ఇండియా జట్టులో కూడా ఉంది. అంజుమ్ చోప్రా, అంజు జైన్, ప్రమీలా భట్‌లతో కలిసి ఇన్నింగ్స్ ఆడిన రిషిజ చివరిసారిగా 1995లో న్యూజిలాండ్‌పై 60 పరుగులు చేసింది.

1995 నాటికి రిషిజే ఢిల్లీ రాష్ట్ర జట్టులో బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకుందని రిషిజా సోదరుడు ప్రణవ్ చెప్పాడు. 1997 మహిళల ప్రపంచకప్ జట్టులో ఆమె కచ్చితంగా ఎంపికవుతుందని ఆమె, కుటుంబ సభ్యులు అంతా భావించారు. అయితే జట్టులో అవకాశం రాలేదు. దానితో రిషిజా కృంగుబాటుకు లోనయింది. సోదరుడు ఢిల్లీలో ప్రణవ్ స్వయంగా వైద్యం చేయిస్తున్నాడు.[3]

ప్రస్తావనలు[మార్చు]

  1. "Player Profile: Rishijae Mudgel". ESPNcricinfo. Retrieved 17 August 2022.
  2. "Player Profile: Rishijae Mudgal". CricketArchive. Retrieved 17 August 2022.
  3. "21 साल पहले नहीं हुआ था सिलेक्शन, अबतक डिप्रेशन में महिला क्रिकेटर". नवभारत टाइम्स. 14 January 2019. Retrieved 24 August 2023.