రీమాఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రీమాఖాన్
జననం
సమీనా ఖాన్

(1971-10-27) 1971 అక్టోబరు 27 (వయసు 52)
వృత్తిహోస్ట్, డాన్సర్, నటి, దర్శకురాలు, నిర్మాత.
క్రియాశీల సంవత్సరాలు1985 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిఎస్. తారిఖ్ షహబ్‌ (2011)[1]
పిల్లలుఅలీ షహబ్[1]
పురస్కారాలుప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ (2019)[2]
వెబ్‌సైటుwww.reemakhan.info

రీమాఖాన్, పాకిస్తానీ టెలివిజన్ హోస్ట్, స్టేజ్ డాన్సర్, లాలీవుడ్ సినిమా నటి, దర్శకురాలు, నిర్మాత. 1990లలో పాకిస్థాన్‌లోని ప్రముఖ సినీ నటీమణులలో ఒకరుగా పేరుపొందింది.[3] 1990లో సినిమారంగంలోకి వచ్చిన రీమాఖాన్, 200 కంటే ఎక్కువ సినిమాలలో నటించింది. తన నటనకు పాకిస్తాన్, భారతీయ సినీ విమర్శకులచే ప్రసంశలు పొందింది.[4] పాకిస్తానీ సినిమాకు రీమాఖాన్ చేసిన సేవలకు 2019 మార్చి 23న ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అవార్డును అందుకుంది.[2]

జననం[మార్చు]

సమీనాఖాన్ 1971, అక్టోబరు 27న పాకిస్తాన్ లోని లాహోర్‌లో జన్మించింది.[5][6] 1985లో క్విస్మత్ సినిమాలో బాలనటిగా నటించిన రీమాఖాన్, మొదటిసారిగా 1990లో పాకిస్తానీ సినిమా దర్శకుడు జావేద్ ఫాజిల్ తీసిన బులంది సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.[6]

వ్యక్తిగత జీవితం[మార్చు]

రీమాఖాన్, 2011 నవంబరులో పాకిస్థాన్-అమెరికన్ కార్డియాలజిస్ట్ ఎస్. తారిఖ్ షహబ్‌ను వివాహం చేసుకున్నది. 2015 మార్చి 24న, ఖాన్ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.[1][7]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

నటిగా[మార్చు]

  • బులంది (1990)
  • జమీన్ ఆస్మాన్ (1994)
  • జో దర్ గ్యా వో మర్ గయా (1995)
  • ముండా బిగ్రా జే (1995)
  • ప్రేమ 95 (1995)
  • ఉమర్ ముఖ్తార్ (1997)
  • నికాహ్ (1998)
  • ముజే చాంద్ చాహియే (2000)
  • పెహచాన్ (2000)
  • ఫైర్ (2002)
  • శరరత్ (2003)
  • కోయి తుజ్ సా కహాన్ (2005)
  • వన్ టూ కా వన్ (2006)
  • లవ్ మే ఘుమ్ (2011)

దర్శకురాలిగా, నిర్మాతగా[మార్చు]

సంవత్సరం సినిమా భాష నటవర్గం
2005 కోయి తుఝ్ స కహాన్ ఉర్దూ మోఅమ్మార్ రాణా, రీమా ఖాన్, నదీమ్ బేగ్, వీణా మాలిక్, బబ్రక్ షా
2011 లవ్ మే ఘుమ్ ఉర్దూ రీమా ఖాన్, జియా అలీ, అలీ సలీమ్, జావేద్ షేక్, అఫ్జల్ ఖాన్, నబీల్ ఖాన్, అరైడా, జానీ లివర్

టెలివిజన్ సిరీస్[మార్చు]

సంవత్సరం నిర్మాణం పాత్ర ఇతర వివరాలు
2011 తరంగ్ ("హీరో బన్నయ్ కి తరంగ్ సాహి జోడీ కి తలాష్") ఏఆర్పై డిజిటల్
2012 యే ఘర్ ఆప్ కా హువా జియో టివి ఉత్పత్తి[8]
2012 రాతి మాషా తోలా జీనత్ టెలిఫిల్మ్ (ఇమ్రాన్ అబ్బాస్ సరసన పివిటి హోమ్ లో ప్రసారం)
2012 యాద్ తో అయేంగీ జియో టీవీ ప్రొడక్షన్
2013 రీమా కా అమెరికా ఎ అబ్రాడ్ మీడియా
2018 క్రోన్ మే ఖేల్ గేమ్ షో

అవార్డులు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగం ఫలితం పేరు మూలాలు
1993 నిగర్ అవార్డు గెలుపు హాథీ మేరే సాథీ [9]
1998 నిగర్ అవార్డు గెలుపు నికాహ్ [9]
2000 నిగర్ అవార్డు గెలుపు ముఝే చాంద్ చాహియే [9]
2019 ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ గెలుపు ఆమెనే [2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Reema blessed with baby boy". The Express Tribune. 24 March 2015.
  2. 2.0 2.1 2.2 Images Staff (2019-03-24). "8 artists including Mehwish Hayat and Babra Sharif receive civil awards on Pakistan Day". Images (in ఇంగ్లీష్). Retrieved 2022-04-18.
  3. tabloid!, Usman Ghafoor, Special to (2018-01-29). "Reema Khan poised for a comeback?". GulfNews. Retrieved 2022-04-18.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  4. ANI (8 June 2009). "Reema Khan is Pakistan's Aishwarya Rai". Hindustan Times. Archived from the original on 23 July 2011. Retrieved 2022-04-18.
  5. "Fact check: 20 famous celebrities and their real names". ARYNEWS. 2018-08-21. Retrieved 2022-04-18.
  6. 6.0 6.1 "ریما خان آج 45 ویں سالگرہ منائے گی". Daily Pakistan. 27 October 2016.
  7. "Reema and Dr Tariq Shahab celebrate 8 years together | SAMAA". Samaa TV. Retrieved 2022-04-18.
  8. "Pride of Pakistan: Reema Khan". Daily Times. 2018-08-26. Archived from the original on 2022-04-18. Retrieved 2022-04-18.
  9. 9.0 9.1 9.2 Swami Ji. "Pakistan's "Oscars"; The Nigar Awards (1957 - 2002)". The Hot Spot Film Reviews website. Archived from the original on 24 November 2017. Retrieved 2022-04-18. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 22 జూలై 2015 suggested (help)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రీమాఖాన్&oldid=4034727" నుండి వెలికితీశారు