Coordinates: 16°22′35″N 80°05′31″E / 16.376328°N 80.091903°E / 16.376328; 80.091903

రుద్రవరం (అచ్చంపేట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుద్రవరం
—  గ్రామం  —
రుద్రవరం is located in Andhra Pradesh
రుద్రవరం
రుద్రవరం
అక్షాంశరేఖాంశాలు: 16°22′35″N 80°05′31″E / 16.376328°N 80.091903°E / 16.376328; 80.091903
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం అచ్చంపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522412
ఎస్.టి.డి కోడ్

రుద్రవరం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం లోని గ్రామం. పిన్ కోడ్:522 412. ఊరి చుట్టూరా పచ్చని పొలాలు, ఎత్తయిన కొండలు, ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. ఊరికి 2 కిలో మీటర్ల దూరంలో కృష్ణానది ప్రవహిస్తోంది. ఊరిలో. శ్రీ సీతారామస్వామి ఆలయం ప్రధానమైనది. ప్రతి ఏటా ఊరిలో పండగలు చాల వైభవంగా నిర్వహిస్తారు. ఊరిలో కమ్మ, రెడ్లు, రాజులు, యాదవులు ఉంటారు. గడ్డం, గంటా, బిక్కి, వడ్లమూడి,తల తల, అన్నపురెడ్డి వంటి ఇంటి పేర్లున్నాయి. మిరప, ప్రత్తి, వరి వంటి పంటలు పండుతాయి. చాల మందికి పొలం ఉంది . మండల కేంద్రం అచ్చంపేట నుండి ఇది 6 కిలోమీటర్ల దూరములో ఉంది. ఎటువంటి సరుకులకైన, ఇతర అవసరాలకు చాల మంది అక్కడికి వెళ్తారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గ్రామం. గ్రామం మొత్తం సుమారు 400 ఇళ్ళు ఊంటాయి.

మూలాలు[మార్చు]