Jump to content

రేఖా శర్మ

వికీపీడియా నుండి
రేఖా శర్మ
రేఖా శర్మ


జాతీయ మహిళ కమిషన్ జాతీయ అధ్యక్షురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 ఆగస్టు 2018 - 7 ఆగస్టు 2024
తరువాత విజయ కిషోర్ రహత్కర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

రేఖా శర్మ భారతదేశంలోని జాతీయ మహిళా కమిషన్ కు మాజీ చైర్‌పర్సన్.[1][2]

కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఒంటరిగా ఇళ్లలో చిక్కుకున్న వృద్ధులకు సహాయం చేయడానికి ప్రత్యేక "హ్యాపీ టు హెల్ప్" టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంలో ఆమె మార్గదర్శకురాలు. మహమ్మారి సమయంలో ఫిర్యాదులు చేయడానికి మహిళల కోసం వాట్సాప్ నంబర్‌ను ప్రారంభించినందుకు కూడా ఆమె ప్రసిద్ధి చెందింది.

అయితే, ఆమె వ్యాఖ్యలు పలుమార్లు వివాదాలకు దారితీసాయి.

కెరీర్

[మార్చు]

రేఖా శర్మ జాతీయ మహిళా కమిషన్ (NCW) చైర్‌పర్సన్‌గా 2024 ఆగస్టు 6 వరకు వ్యవహరించింది.[3] చైర్‌పర్సన్‌గా, ఆమె పనిలో లింగ సమానత్వం కోసం వాదించడం, మహిళా సాధికారతను మరింత ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలకు ఆమె నాయకత్వం వహించింది.

ఆమె ఆగస్టు, 2015 నుండి కమిషన్‌ సభ్యురాలు, అలాగే, దాని రెగ్యులర్ చీఫ్‌గా 2018 ఆగస్టు 7న బాధ్యతలు స్వీకరించడానికి ముందు 2017 సెప్టెంబరు 29 నుండి చైర్‌పర్సన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించింది.

జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రేఖా శర్మ పదవీకాలం 2021 ఆగస్టు 06న ముగియనుండగా భారత ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీచేసింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Rekha Sharma appointed chairperson of NCW". India Today. PTI. 9 August 2018. Retrieved 11 December 2018.
  2. "Rekha Sharma Is New National Commission for Women Chairperson". NDTV.com. Retrieved 2018-10-12.
  3. "National Commission for Women: చైర్మన్ పదవికి రేఖా శర్మ రాజీనామా | Rekha Sharma steps down as NCW chief as her 9-year tenure ends: 'Roller coaster ride' VVNP". web.archive.org. 2024-08-07. Archived from the original on 2024-08-07. Retrieved 2024-08-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Rekha Sharma Gets Three-Year Extension As National Commission for Women's Chief". web.archive.org. 2024-02-04. Archived from the original on 2024-02-04. Retrieved 2024-02-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=రేఖా_శర్మ&oldid=4347549" నుండి వెలికితీశారు