రేగుల్లంక(అవనిగడ్డ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రేగుల్లంక. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

రేగుల్లంక
—  రెవెన్యూయేతర గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం అవనిగడ్డ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521121
ఎస్.టి.డి కోడ్ 08671.

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు ఇది కృష్ణా నదీగర్భ గ్రామం.

సమీప గ్రామాలు[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, తెనాలి, పెడన

సమీప మండలాలు[మార్చు]

మోపిదేవి, నాగాయలంక, రేపల్లె, చల్లపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

అవనిగడ్డ, నాగాయిలంక నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: గుంటూరు 66 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

సి.బి.సి.ఎన్.సి.పాఠశాల.

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

త్రాగునీటి సౌకర్యం[మార్చు]

రేగుల్లంక గ్రామములోని పాతకోట, ఎస్.సి.కాలనీవాసుల దాహార్తి తీర్చుటకై, 27.5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఒక ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం జరుగుచున్నది. [7]

"ఎకోశాన్" మరుగుదొడ్లు[మార్చు]

  1. రాష్ట్రంలో మొదటిసారి, ఈ గ్రామములో, ఎకోశాన్ మరుగుదొడ్లు రూపుదిద్దుకున్నవి. నీటితో పనిలేని, వాసన రాని, వాతావరణ బంధువుగా ఉండే, స్వయంగా ఎరువుగా తయారుచేసే మరుగుదొడ్లను (50+50) ఇక్కడ నిర్మించారు. "ఆర్ధిక సమతా మండలి" అను ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ ప్రాజెక్టును రూపొందించి, నిర్మించింది. [1]&[2]
  2. ఈ మరుగుదొడ్ల పనితీరునూ, ప్రత్యేకతనూ, వ్యవసాయశాఖ సహాయ సంచాలకుల బృందం, ఆర్థిక సమతా మండలి వారితో కలిసి, 31-12-2013న పరిశీలించారు. ఈ విధానంలో, 6 నెలలలో రసాయనిక ఎరువు తయారవుతుందని చెప్పారు. ఈ ఎరువును ఉపయోగించి, గ్రామంలో ప్రయోగాత్మకంగా పంటలను పండిచుచున్నట్లు తెలిపారు. [3]
  3. ఈ మరుగుదొడ్ల వినియోగంలో అద్భుత ఫలితాలు ఇమిడి ఉన్నాయని Central Insivation in Public system అను సంస్థకు డైరెక్టరు అయిన శ్రీ డి.చక్రపాణి, 2014,జనవరి-13న వీటిని సందర్శించి, కితాబు ఇచ్చారు. [4]
  4. రాష్ట్రంలోని 23 జిల్లాలలోని వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, 2014,మార్చి-12న ఈ గ్రామాన్ని సందర్సించి, ఈ గ్రామస్థులు అమలుచేస్తున్న పథకాలను చూసి, హర్షం వ్యక్త పరిచారు. వీరేగాక, ఇంకా, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు గూడా ఇక్కడకు వచ్చారు. వీరందరూ, ఎకోశాన్ మరుగుదొడ్ల పనితీరును ఆసక్తితో తెలుసుకున్నారు. "సెంటర్ ఫర్ ఇన్నొవేషన్ ఇన్ పబ్లిక్ సిస్టం" వారి ఆధ్వర్యంలో ఈ బృందం, గ్రామాన్ని సందర్శించి, ఈ పథకాన్ని అమలుచేస్తున్న గ్రామస్తులను అభినందించింది. వీరిలో కొందరు, తిరిగి వారి గ్రామాలకు వెళ్ళి, అక్కడ గూడా ఈ పద్ధతిని అమలుపరుస్థామని అన్నారు. [5]
  5. 2014,అక్టోబరు-28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభా ఉపసభాపతి, వీటి పనితీరుని పరిశీలించి ప్రశంసించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన ఆయన, ప్రతి ఇంటి ఆవరణలోని మరుగుదొడ్డి ముందు, పూలచెట్లు ఉండటాని చూసి, ఆశ్చర్యపోయినారు. [6]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం పులిగడ్డ గ్రామ శివారు గ్రామం.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ది హిందు, ఆంగ్ల దినపత్రిక; 2011,అక్టోబరు,20; 3వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,మార్చి-14; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జనవరి-1; 3వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,జనవరి-14; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2014,మార్చి-12; 3వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,అక్టోబరు-29; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-9; 37వపేజీ.