Jump to content

రేమండ్

వికీపీడియా నుండి
నవాబ్, అష్దరుద్దౌలా, అష్దర్‌జంగ్
మిషెల్ జొవాకిమ్ మరీ రేమండ్
బహదూర్
మొన్‌షూ రేమండ్
మొన్‌షూ రేమండ్
స్థానిక పేరుMichel Joachim Marie Raymond
మారుపేరుమూసారాం, మూసారహీం
జననం(1755-09-25)1755 సెప్టెంబరు 25
సెరిన్యాక్, తార్న్-ఏ-గార్రోన్, ఫ్రెంచి రాజ్యం
మరణం1798 మార్చి 25(1798-03-25) (వయసు 42)
హైదరాబాదు, మొఘల్ సామ్రాజ్యం ప్రస్తుత భారతదేశం
ఖనన స్థలంరేమండ్స్ స్తూపం
రాజభక్తి
సేవలు/శాఖసైనికదళం
సేవా కాలం1778-98
ర్యాంకు
యూనిట్కార్ప్స్ దే చెవాలియర్ దే లాస్సే, (మైసూరు సైనికదళం, 1778-1783)
పనిచేసే దళాలుకార్ప్స్ ఫ్రాంషువా దే రేమండ్ లేదా నిజాం ఫ్రెంచి సైనికదళం
పోరాటాలు / యుద్ధాలు
స్మారకాలురేమండ్స్ స్తూపం
సంబంధీకులువిలియం జాన్ రేమండ్ (సోదరుడు)

జనరల్ రేమండ్ (జ. 25 సెప్టెంబర్ 1755 - మ. 25 మార్చి 1798) మన్సూర్ రేమండ్ గా ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచి జనరల్. ఇతడు హైదరాబాదు నిజాం సైన్యంలో ఉండగా గన్ ఫౌండ్రీని స్థాపించాడు. ఇతడు దక్షిణ ఫ్రాన్స్లోని అక్సిటానీ ప్రాంతంలో ఒక వ్యాపారస్తుని కుమారునిగా జన్మించాడు.[1] ఈయన్ను స్థానిక హిందూ ప్రజలు అభిమానంగా పిలిచిన మూసారాం అనే పేరుమీదనే, ఈయన హైదరాబాదులో నివసించిన ప్రాంతానికి మూసారాంబాగ్ అనే పేరు వచ్చింది.

సాహసాలు

[మార్చు]

1775 సంవత్సరంలో 20 ఏళ్ళ వయసున్న రేమండ్ తన తమ్ముడు విలియమ్ జీన్ రేమండ్ తో కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నామని తండ్రికి చెప్పి, పాండిచ్చేరి వచ్చాడు. అయితే భారతదేశంలో సైనికుడయ్యాడు.

ఇతడు మొదటగా ఫ్రెంచి జనరల్ బుస్సీ వద్ద కొంతకాలం పనిచేశాడు. 1786లో అప్పుడు హైదరాబాదును పాలిస్తున్న నిజాం దగ్గర సైనికుడిగా చేరాడు. అనతికాలంలోనే 300 మంది సైనికులపై అధికారాన్ని సంపాదించాడు.[2]

1796లో రేమండ్ అమీర్-ఏ-జిన్షీ (ఆయుధ కర్మాగారాల అధికారి) గా నియమించబడ్డాడు. ఈ పదవిలో ఉండగా రేమండ్ అనేక ఫిరంగులు, ఫిరంగి గుండ్లను తయారుచేసే కర్మాగారాలను స్థాపించాడు. ఈ కర్మాగారాల్లో రేమండ్ పర్యవేక్షణలో తుపాకులు, ఫిరంగులు, ఫిరంగి గుండ్లను అచ్చుపోసేవారు. ఈ కర్మాగారాల్లో నేటికీ మిగిలిన వాటిలో ఫతే మైదాన్లో నెలకొల్పిన గన్ ఫౌండ్రీ అత్యంత ప్రసిద్ధిచెందినది.

మార్చి 25, 1798లో తన 42వ యేట మరణించే సమయానికి రేమండ్ 14,000 మంది సైనికులకు సైనికాధికారి కాగలిగాడు. నిజాం సైన్యంలో సైనిక జీవితాన్ని ప్రారంభించిన 12 సంవత్సరాలలోనే అంతస్థాయిని సాధించగలిగాడు. రేమండ్ మరణానికి కచ్చితమైన కారణం తెలియలేదు. నిజాం, బ్రిటీషు వారితో చేతులు కలపడంతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక ప్రజలు నమ్మకం.

గౌరవం

[మార్చు]
హైదరాబాదులో అస్మాన్‌ఘడ్ సమీపములో ఉన్న జనరల్ రేమండ్ సమాధి

మిషెల్, హైదరాబాదు నిజాం, నిజాం అలీ ఖాన్కు అత్యంత సన్నిహతమైన స్నేహితుడయ్యాడు. మిషెల్‌ను నిజాం అత్యంత గౌరవప్రదంగా చూడటమే కాకుండా, స్థానిక ప్రజల అభిమానాన్ని, నమ్మకాన్ని చూరగొన్నాడు. ఈయన తన దయార్ధ హృదయం, తన సాహసం, హైదరాబాదుకు చేసిన తోడ్పాటుతో అత్యంత ప్రసిద్ధుడయ్యాడు. ముస్లింలు ఈయన్ను మూసారహీం అని, హిందువులు ఈయన్ను మూసారాం అని అభిమానంగా పిలుచుకునేవారు. జార్జ్ బ్రూస్ మాల్లేసన్ ఈయన గురించి చెబుతూ, ఈయన తర్వాత భారతదేశంలో ఎలాంటి ఐరోపా వ్యక్తి, స్థానికులనుండి రేమండ్ పొందినంత ప్రేమ, అభిమానం, గౌరవం పొందలేదని చెప్పాడు.

రేమండ్స్‌ స్తూపం

[మార్చు]

ఆస్మాన్‌గఢ్‌లోని ఎత్తయిన కొండపై 180 అడుగుల పొడవు, 85 అడుగుల వెడెల్పు గల గద్దెపై 23 అడుగుల ఎత్తు ఈ స్మారక స్తూపాన్ని నిర్మించారు. రేమండ్స్‌ స్తూపంగా ప్రసిద్ధి చెందిన ఈ స్థూపం ఒక గ్రానైటు రాతితో నిర్మించిన సమాధి స్థూపం. పిరమిడ్ ఆకారంలో ఏడు మీటర్ల ఎత్తు ఉన్నది. స్థూపంపై ఈయన పొడి అక్షరాలు "J.R." ఉన్నవి. స్తూపం పక్కనే గ్రీకు శిల్ప కళారీతిలో 28 స్తంభాలతో నిర్మించిన సమాధి ఉంది. రేమండ్‌ కుటుంబ సభ్యుల ప్రియమైన పెంపుడు జంతువులు గుర్రం, శునకం సమాధులు స్తూపానికి సమీపంలోనే నిర్మించారు.[3] 1940ల వరకు స్థానిక ప్రజలు ప్రతి సంవత్సరం రేమండ్ సంవత్సరీకం రోజున, సాంబ్రాణీ, పూలను సమర్పించి నివాళులు అర్పించేవారు. ఈయన సమాధి ఒక గుడిలా అయ్యింది. [4]

నిజాం నిర్మించిన ఈ స్థూపం సరైన సంరక్షణ లేక 2001 అక్టోబర్లో భారీ వర్షాల వల్ల కూలిపోయింది. ప్రభుత్వం దీన్ని పునరుద్ధరించి, కొత్త మండపాన్ని నిర్మించారు. పునరుద్ధరించిన మండపాన్ని 2003, ఏప్రిల్ 14న పర్యాటక శాఖ తిరిగి ప్రజలకందించింది. 5 లక్షల రూపాయల పునరుద్ధరణ ఖర్చు చేసింది.[2]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Lalanne, Ludovic (1877). Dictionnaire historique de la France (in French). p. 1530. Retrieved 9 March 2018.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. 2.0 2.1 "The Hindu : A new house for Monsieur Raymond". web.archive.org. 23 June 2003. Archived from the original on 23 జూన్ 2003. Retrieved 18 May 2021.
  3. నమస్తే తెలంగాణ (6 November 2017). "వారసత్వ సంపదకు పూర్వవైభవం". Archived from the original on 18 September 2018. Retrieved 18 September 2018.
  4. వెబ్ ఆర్కైవ్, ప్రత్యేక కథనాలు, ఈనాడు, హైదరాబాదు ఎడిషన్ (18 April 2018). "వారసత్వం.. ఇద్దాం జవసత్వం". Archived from the original on 18 ఏప్రిల్ 2018. Retrieved 18 April 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=రేమండ్&oldid=4309703" నుండి వెలికితీశారు