Jump to content

రేమండ్స్ స్తూపం

అక్షాంశ రేఖాంశాలు: 17°21′53.4″N 78°30′54.7″E / 17.364833°N 78.515194°E / 17.364833; 78.515194
వికీపీడియా నుండి
రేమండ్స్‌ స్తూపం
మూసారాంబాగ్‌
అక్షాంశ,రేఖాంశాలు17°21′53.4″N 78°30′54.7″E / 17.364833°N 78.515194°E / 17.364833; 78.515194
ప్రదేశంమలక్‌పేట, హైదరాబాదు
రకంస్తూపం (సమాధి)
పొడవు60 మీటర్లు (200 అడుగులు)
వెడల్పు30 మీటర్లు (98 అడుగులు)
ఎత్తు8 మీటర్లు (26 అడుగులు)
అంకితం చేయబడినదిరేమండ్

రేమండ్స్‌ స్తూపం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మలక్‌పేట పరిధిలోని ఎత్తయిన కొండపై ఉన్న స్తూపం. నిజాం పాలనలో ఫిరంగి సేనలను పటిష్ఠంగా తీర్చిదిద్దిన జనరల్‌ మాన్సియర్‌ రేమండ్ (ఫ్రాన్స్‌ దేశస్థుడు) స్మృతి చిహ్నంగా సా.శ. 1755-1798 మధ్యకాలంలో ఈ స్తూపం నిర్మించబడింది.[1]

చరిత్ర

[మార్చు]

రెండో నిజాం రాజు నిజాం అలీఖాన్ సైన్యంలో ముఖ్యమైన ఫ్రెంచ్ అధికారి మన్సీ రేమండ్. ప్రజలు ఇతణ్ని ముసారాముడని పిలిచేవారు. ఇతడి పేరు మీద ముసారాంబాగ్ నిర్మాణం జరిగింది. 1798లో మన్సీ రేమండ్ మరణించాడు. ఇతడి సమాధిని యురోపియన్ శైలిలో 28 పిల్లర్లతో ముసారాంబాగ్ వద్ద నిర్మించారు. ఈ నిర్మాణంలో ఊదారంగు గ్రానైట్ రాయిని వాడారు.[2]

నిర్మాణం

[మార్చు]

18వ శతాబ్దపు చిహ్నానికి ప్రతీకగా ఈ స్తూపం నిలిచివుంటుంది. ఆస్మాన్‌గఢ్‌లోని ఎత్తయిన కొండపై 180 అడుగుల పొడవు, 85 అడుగుల వెడెల్పు గల గద్దెపై 23 అడుగుల ఎత్తు ఈ స్మారక స్తూపాన్ని నిర్మించారు. స్తూపం పక్కనే గ్రీకు శిల్ప కళారీతిలో 28 స్తంభాలతో నిర్మించిన సమాధి ఉంది. రెమాండ్‌ కుటుంబ సభ్యుల ప్రియమైన పెంపుడు జంతువులు గుర్రం, శునకం సమాధులు స్తూపానికి సమీపంలోనే నిర్మించారు.[3]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వెబ్ ఆర్కైవ్, ప్రత్యేక కథనాలు, ఈనాడు, హైదరాబాదు ఎడిషన్ (18 April 2018). "వారసత్వం.. ఇద్దాం జవసత్వం". Archived from the original on 18 ఏప్రిల్ 2018. Retrieved 18 April 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
  2. వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 21 April 2018.
  3. నమస్తే తెలంగాణ (6 November 2017). "వారసత్వ సంపదకు పూర్వవైభవం". Archived from the original on 18 September 2018. Retrieved 18 September 2018.