మూసారాంబాగ్
మూసారాంబాగ్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°22′23″N 78°30′59″E / 17.3730°N 78.5164°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 036 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మలక్పేట్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
మూసారాంబాగ్ (మూసా రామ్ బాగ్), తెలంగాణలోని హైదరాబాదు నగర పాత శివారు ప్రాంతం.[1][2] 18వ శతాబ్దంలో నిజాం రాజులకు సేవలందించిన ఫ్రెంచ్ మిలటరీ కమాండర్ మోన్సియూర్ రేమండ్ పేరు మీదుగా ఈ ప్రాంతానికి "మూసా-రామ్-బాగ్" అని పేరు పెట్టబడింది. బాగ్ అంటే ఉద్యానవనం అని అర్థం. ఈ ప్రాంతం ఒకప్పుడు భారీ పచ్చదనంతో నిండివుండేది. ఇక్కడి ఆస్మాన్ ఘర్ ప్యాలెస్ సమీపంలో రేమండ్ సమాధి కూడా ఉంది.
చరిత్ర
[మార్చు]రెండవ అసఫ్ జా, నిజాం అలీ ఖాన్కు మోన్సియూర్ రేమండ్ సన్నిహిత మిత్రుడయ్యాడు. 2వ నిజాం గౌరవం పొందడమేకాకుండా స్థానిక ప్రజల ప్రేమను, నమ్మకాన్ని కూడా రేమండ్ సంపాదించుకున్నాడు. ముస్లింలకు, మూసా రహీమ్ గా, హిందువులకు మూసా రామ్ పేరొందాడు.[3][4]
వాణిజ్య ప్రాంతం
[మార్చు]మూసారాంబాగ్ ప్రాంతంలో నివసించేవారి అవసరాల కొరకు ఇక్కడ అనేక దుకాణాలు ఉన్నాయి. కాపిటల్ (అకా షామ్), బావార్చి వంటి హైదరాబాదీ రెస్టారెంట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. దూరదర్శన్ టీవీ టవర్ కూడా ఉంది.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి మూసారాంబాగ్ కు బస్సులు నడుపబడుతున్నాయి. ఇక్కడ మూసారాంబాగ్ మెట్రో స్టేషను కూడా ఉంది.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Soon you can earn while you pee". IBN Live. Archived from the original on 17 ఏప్రిల్ 2014. Retrieved 13 December 2020.
- ↑ "14 injured in wall collapse at Moosarambagh". Times of India. Archived from the original on 2012-07-08. Retrieved 13 December 2020.
- ↑ "When a French Revolution-modelled Army contingent was established in Hyderabad". The Hindu. The Hindu.
- ↑ Luther, Narendra. Hyderabad, A Biography. Oxford University Press. p. 117. ISBN 019567535-5.