రేవల్సార్ సరస్సు
ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
రేవల్సార్ సరస్సు | |
---|---|
![]() రేవల్సార్ సరస్సు | |
ప్రదేశం | మండీ జిల్లా, హిమాచల్ ప్రదేశ్ , భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 31°38′02″N 76°50′00″E / 31.63389°N 76.83333°E |
ఉపరితల వైశాల్యం | 160 చదరపు కిలోమీటర్లు (62 చ. మై.) |
సరాసరి లోతు | 10–20 మీటర్లు (33–66 అ.) |
గరిష్ట లోతు | 25 మీటర్లు (82 అ.) |
ఉపరితల ఎత్తు | 1,360 మీ. (4,460 అ.) |
ప్రాంతాలు | రేవల్సార్ |
మూలాలు | Himachal Pradesh Tourism Dept. |
రేవల్సార్ సరస్సు హిమాచల్ ప్రదేశ్ లోని మండీ జిల్లాలో ఉంది. ఇది జిల్లా ప్రధాన నగరమైన మండీ నుండి 22.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత ప్రాంతాలలో ఉంది. పద్మసంభవుడు, మంధారవ అనే బౌద్ధ గురువులను పూజించే టిబెట్ బౌద్ధులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.[1]
భౌగోళికం
[మార్చు]ఇది సముద్ర మట్టం నుండి దాదాపు 1,360 మీటర్ల ఎత్తులో ఉండి, 735 మీటర్ల తీర ప్రాంతం కలిగి ఉంది. దీనిని హిందువులు, సిక్కులు, బౌద్ధులు పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు.[2]
దేవాలయాలు, ఉత్సవాలు
[మార్చు]రేవల్సార్ సరస్సు వద్ద మూడు బౌద్ధ మఠాలు, మూడు హిందూ దేవాలయాలు ఉన్నాయి. పూర్వం కొందరు సాధువులు శివునిపై భక్తితో ఈ సరస్సు దగ్గర తపస్సు చేశారనీ, సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ 22 డిసెంబర్ 1666 - 7 అక్టోబర్ 1708 మధ్య కాలంలో ఇక్కడ జీవించాడనీ స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ సరస్సు దగ్గర ఫిబ్రవరి చివరలో లేదా మార్చి ప్రారంభంలో కొన్ని ఉత్సవాలు, పండగలు జరుగుతాయి.[3]
పద్మనాభ విగ్రహం
[మార్చు]ఈ సరస్సు దగ్గర ఏప్రిల్ 1, 2012 న, పద్మనాభుడి 37.5 మీటర్ల (123 అడుగులు) ఎత్తైన స్మారక విగ్రహాన్ని 14వ దలైలామా స్థాపించారు. ఈ విగ్రహం నిర్మించడంలో పునాదులు వేయడానికే మూడు సంవత్సరాలు పట్టింది. మొత్తం పూర్తి కావడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. దీనిని ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులు మాత్రమే సిమెంటుతో, యంత్రాలు వాడకుండా కేవలం చేతులతో నిర్మించారు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-07. Retrieved 2021-07-30.
- ↑ "himachaltourism.gov.in". Archived from the original on 2010-03-24. Retrieved 2021-09-29.
- ↑ 3.0 3.1 "Wangdor Rimpoche: Padmasambhava Project". www.customjuju.com (in ఇంగ్లీష్). Archived from the original on 2018-06-14. Retrieved 2018-07-30.
- ↑ "Guru Rimpoche Statue". Flickr (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-07-30.