రేవూరు (మేళ్లచెరువు)
రేవూరు, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, మేళ్ళచెరువు మండలంలోని గ్రామం.[1]
రేవూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°49′21″N 79°59′36″E / 16.82245210546882°N 79.99327889835847°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సూర్యాపేట |
మండలం | మేళ్లచెరువు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 11,719 |
- పురుషుల సంఖ్య | 5,973 |
- స్త్రీల సంఖ్య | 5,746 |
- గృహాల సంఖ్య | 3,081 |
పిన్ కోడ్ | 508246 |
ఎస్.టి.డి కోడ్ |
ఇది మండల కేంద్రమైన మేళ్ళచెరువు నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
గ్రామ జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3081 ఇళ్లతో, 11719 జనాభాతో 5222 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5973, ఆడవారి సంఖ్య 5746. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1109 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2444. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 577593[3].పిన్ కోడ్: 508246.
గ్రామ చరిత్ర
[మార్చు]చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాచీన గ్రామం ఇది. 16వ శతాబ్దం చివరి భాగంలో.... వెలమదొరలు ఊరిలో కోట నిర్మించుకుని జమీనడిపినట్టు ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి. ఆనాటి ఆనవాలుగా దొరల కోటలో పెద్దబావి ఉంది. అది ఇటీవలి వరకు ఊరి జననానికి మంచినీరు అందించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఊళ్లో నీటి కరువు పోయి అన్ని ప్రాంతాల్లో బావులు, చేతిపంపులు వెలిశాయి. అంటే .... అంతకు ముందు... ఊరు మొత్తం కూడా ' దొరోరిబావి ' నుంచే తాగునీరు వాడుకునేవారట. ఊళ్లో ఆకాలంలో కట్టిన వేణుగోపాలస్వామి, శివాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. దేవాలయాల ముందు మొన్న మొన్నటి వరకు పెద్దకోనేరు ఉండేది. 1990 ప్రాంతంలో గ్రామపంచాయతీ వారు కోనేరును పూడ్చివేశారు. రేవూరుకు ఉన్న మరో ప్రత్యేకత నాణ్యమైన పొగాకు... అవును. ..'నైజాం నవాబు' ల కాలంలో ఈ గ్రామంలో పండిన పొగాకుకు మాంచిగిరాకీ ఉండేదట. మొదట్లో ఊరికి కార్జంముక్కలాంటి నల్లరేగడి భూములు విలువైన ఆభరణంలా ఉండేవి... ఇపుడిపుడే... పెద్దపెద్దరైతులు భూములు అమ్ముకుని పట్టణాలకు వలసవెళ్లుతుండటంతో... నాటి వ్యవసాయ సౌభాగ్యం గ్రామంలో క్రమంగా కనుమరుగవుతోంది. అసలు ఊరు ఇపుడు ఉన్న చోటలేదట ఒకపుడు. ఊరుకు దక్షిణ భాగంలో ఉన్న ' పాటిచేలు ' ఉండే చోట గ్రామం ఉండేదట. దీనికి ఇప్పటికీ ఆనాటి ఆధారాలు పాటిచేలల్లో బయటపడుతాయి. అపుడు ఊరు ఉన్న చోట ఇపుడు వ్యవసాయం జరుగుతోంది. పొలం దున్నేపుడు ఆనాటి ' కుండపెంకులు ' ఇటుకలు బయటపడుతూ ఉంటాయి. అక్కడ ఉన్న గ్రామంలో ... నీటి ఎద్దడి బాగాఉండేదట. అందుకే అప్పట్లో దొరలు ' ఊరవాగు ' ఒడ్డున కోటకట్టి ఊరి జనాన్ని అక్కడికి తరలించారని పెద్దలు చెప్పేవారు. అక్కడ ఊరు కట్టాలనుకున్న దొరకు కీకారణ్యం పెద్దఅడ్డంకిగా మారిందట. అప్పట్లో ఊరవాగు పరీవాహక ప్రాంతాలు క్రూరమృగాలకు నెలవుగా ఉండేది. కోట కట్టేందుకు నిర్దేశించిన చోట ' గచ్చ', ' కోరింద ' పొదలు దట్టంగా అల్లుకుని ఉండేవి.... వాటిలో పులలు ఆవాసం ఉండేవట. అందుకు దొరవారు స్వయంగా పులుల్ని చంపి ఆపులి రక్తంతో ఊరికి బొడ్రాయి వేశారని చెబుతారు. అయితే... వందల ఏళ్లు గడిచిన తర్వాత ఊళ్లో బొడ్రాయిని మరోసారివేశారట. అపుడు పులిరక్తం, గాని పాలుగాని దొరకని పరిస్థితుల్లో....జూనేబోయినవంశం వారు కుక్కపాలు పోసి బొడ్రాయిని ప్రతిష్ఠించారని పెద్దలు చెప్పేవారు. అందుకే... ఇప్పటికీ ఊర్లో చాలమంది దీనిపై హస్యం చేస్తూ ఉంటారు. అదేంటంటే.... చుట్టుపట్టు గ్రామాల్లో కక్షలు, గొడవలతో హత్యలు, దోపిడీలు జరిగినా.... రేవూరులో మాత్రం జరగవట. అంటే... బొడ్రాయి ప్రతిష్ఠాపనకు కుక్కపాలువాడటంవల్ల ఊరిజనం కూడా... శాంతమూర్తుల్లా... విశ్వసపాత్రుల్లా ఉంటారని చెబుతారు. ఇదే మరోమాటలో చెప్పాలంటే... ఊరిజనానికి పౌరుషం తక్కువని జోకులేస్తారనుకోండి....!!
మరో విషయం ఏంటంటే... రేవూర్లో 1960ల నాటికే చదువుకున్నవాళ్లు ఎక్కువ. అలాగని చదువు కేవలం అగ్రవర్ణాకలకే పరిమితం కాలేదు. బీసీల్లో చాలామంది చదువుకున్నారు. రేవూర్లో బడి ఏర్పడటానికి ఓ మహాను భావుడే కారణం... అప్పట్లో ఊళ్లో గవర్నమెంట్ బడి లేకున్నా... ' సాలెపంతులు ' ... ఇలా అన్నందుకు విజ్జులు క్షమించుదురుగాకా. ఆ మహాను భావుడి పేరు పూర్తిగా తెలియదు. ఇంతకీ ఆయన చేసిందేంటంటే.... ఊళ్లో బడిఏర్పాటు కావడానికి కొందరు పెద్దలు సహకరించలేదట. దానికి నిరసనగా ఊళ్లో ఉన్న ' జండారావిచెట్టు ' అరుగుపై నిరాహార దీక్ష చేశాడట ఆ మహానుభావుడు. అంతేకాదు.... పేదలందరూ చదువుకోవాలని.... వారి ఇళ్లకు పోయి. చందాలు సేకరించేవారట. అపార్ధం చేసుకోకండి. సాలెపంతులు సేకరించింది. డబ్బుకాదు, బంగారం అంతకంటే కాదు. అయినా పేదల దగ్గర ఏం ఉంటాయి. తిండిగింజలు తప్పా....! అవే సేకరించేవారట ఆయన. అవికూడా.... అప్పట్లో జొన్నల్లు మాత్రమే తినేవారు జనం. అందుకే రోజూ జొన్నలు రోట్లోపోసి తొక్కేప్పుడు.... ఓ చారెడు ధాన్యం పొదపు చేయమనే వారట. దానికోసం ప్రతి ఇంటికీ పందిరిగుంజకు మట్టిపిడతనో.. మరోకటో కట్టి దాన్లో రోజూ జొన్నలు వేయమని చెప్పేవారట సాలెపంతులు. అలా నెలకొకసారి ఆ గింజలను సేకరించి... బడికి వచ్చే పిల్లలకు పలకలు, సుద్దముక్కలు కొనివారట ఆయన. అలా రేవూరులో బడి ఏర్పాటయ్యిందని మాపెద్దలు ఇప్పటకీ చెప్పుకుంటారు. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు... మావూరిలో చదువుల తల్లిని నిలపడానికి అంతలా ఆరాటపడిని సాలెపంతులుగారిది రేవూరు కాదు. ఎక్కడనుంచి వచ్చారోకూడా తెలియదట. అందుకే నూటికో కోటికో ఒక్కరు అంటారు మరి....
అదలా ఉంచితే.. రేవూరుకు మూడువైపులా అంటే... తూర్పు, పశ్చిమ, ఉత్తరభాగాల్లో సున్నపురాయి వేలఎకరాల్లో పరచుకుని ఉంది. ఒకపుడు... ఆభూమూలు పశువులకు మేతకోసం ఉపయోగపడేవి. ఇపుడు సింమెంట్ పరిశ్రమల ఆధీనంలోకి వెళ్లాయి. దక్షిణ భాగంలో ఉన్న నల్లరేగడి భూములే రేవూరుకు ప్రధాన వ్యవసాయ క్షేత్రం. అంటే... మాగాణి భూములు లేవని కాదు... ఊరు పక్కే ప్రవహించే ఊరవాగు ఆసరాగా వందల ఎకరాల్లో వరి పండుతుంది. మరో విషయం ఏంటంటే.... రేవూరుకు వందల ఎకరాల చెరువు ఉంది. అయితే.... అదిపుడు కేవలం చేపల చెరువుగా మాత్రమే ఊరి జనానికి ఉపయోగ పడుతోంది. చెరువు కింద మాగాణి మొత్తం రామాపురం రైతుల ఆధీనంలోకి వెళ్లింది. అసలు విషయం ఏంటంటే... ఒకపుడు రామాపురం రేవూరు నుంచే ఏర్పడింది. 1977 వరకు రేవూరు రెవెన్యూ కిందనే ఆగ్రామం ఉండేది. చెరువు ఊరికి దూరంగా ఉండటంతో అది ఉపయోగం లేకుండా పోయింది. ఇక రేవూరులో ఉన్న సామాజిక పరిస్థితులు చుట్టుపట్టు మరే ఊరిలో ఉండవు. నైజాం కాలం నుంచి.... ఊరి అధికారికి పండుక ' మొహర్రం ' కుల, మతాల తేడాల్లేకుండా ప్రజలందరూ పండుగను జరుపుకుంటారు. పీర్లపండక్కి అందరి ఇళ్లలో కోడిపలావు ఘుమఘుమలే మరి. అందుకే రేవూరు అంటే... ఓ సెక్కూలర్ కంట్రీ కిందనే లెక్క . అయితే..... ఒకపుడు నైజాం సంస్థానం లెవల్లో పొగాకు పంటలో ఓవెలుగు వెలిగిన గ్రామం ఇపడు ... అభివృద్ధి జాడలే కనరాక కునారిల్లుతోంది. దీనికి ప్రధాన కారణం.... రాజకీయం. అవును పాలిటిక్స్ పౌరులకు ఉపయోగ పడటంలేదక్కడ. నూటికి 90 శాతంగా ఉన్న లేబర్ ప్రధానంగా వ్యవసాయం, సిమెంట్ ఫ్యాక్టరీల్లో పనుల్లోనే ఉంటారు. అన్ని గ్రామాలకంటే... ముందుగా బడి ఏర్పాటైనా... నాణ్యమైన చదువు లేదక్కడ.
నాయకుల, కులపెద్ద పెత్తనంతో .... అభివృద్ధికి సుదూరంలో నిలబడింది రేవూరు. చుట్టూ సిమెంట్ పరిశ్రమలు వెలిసి.... అన్ని గ్రామాల్లో ప్రజాసౌకర్యాలు శోభిల్లుతుంటే... రేవూరు మాత్రం మట్టిరోడ్లు, మురికి గుంటలతో కునారిల్లుతోంది. ఊరిలో పుట్టి ఇంటర్నేషనల్ లెవల్లో ఉన్నపెద్దలూ ఉన్నారు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో హైలెవల్లో బతుకుతున్న సంపన్నులూ ఉన్నారు. అయినా ఏ ఒక్కరూ పుట్టింటిని పట్టించుకోరు. ఒకపుడు అందరూ చదువుకున్న ప్రాథమికోన్నత పాఠశాల... ఇపుడు పేదవాళ్ల పిల్లలు మాత్రమే కూర్చునే సత్రంగా మారింది. ఊరి చిన్నారులు నాణ్యమైన విద్యకు దూరం అవుతున్నారు. అరకొర చదువుకుని చేనుపనులో, సిమెంట్ ఫ్యాక్టరీకూలిగానో మారుతున్నరు. ఒకవేళ ఈవ్యాసం రేవూరు వాళ్లు ఎవరైనా చూస్తే... ఓసారి మన ఊరిని దుస్థితికి చింతించండి.... చాలు... !!
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల హుజూర్ నగర్లోను, ఇంజనీరింగ్ కళాశాల పాలెఅన్నారంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్ జగ్గయ్యపేటలోను, మేనేజిమెంటు కళాశాల పాలెఅన్నారంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జగ్గయ్యపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మం లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]రేవూరులో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]రేవూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]రేవూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 297 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 1270 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 32 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 3 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 1436 హెక్టార్లు
- బంజరు భూమి: 409 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1772 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 2754 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 864 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]రేవూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 82 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 675 హెక్టార్లు* చెరువులు: 85 హెక్టార్లు* వాటర్‌షెడ్ కింద: 20 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]రేవూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-27 suggested (help) - ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".