రైలీ రోసోవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రైలీ రోసోవ్
2014 లో రోసోవ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రైలీ రోస్కో రోసోవ్
పుట్టిన తేదీ (1989-10-09) 1989 అక్టోబరు 9 (వయసు 34)
బ్లోమ్‌ఫోంటీన్, ఆరెంజ్ ఫ్రి స్టేట్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రTop-order batter
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 112)2014 ఆగస్టు 21 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2016 అక్టోబరు 12 - ఆస్ట్రేలియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.27
తొలి T20I (క్యాప్ 63)2014 నవంబరు 5 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2023 మార్చి 28 - వెస్టిండీస్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.27
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007/08–2012/13ఫ్రీ స్టేట్
2007/08–2016/17నైట్స్
2012Basnahira Cricket Dundee
2014–2015రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2017–2019క్వెట్టా గ్లేడియేటర్స్ (స్క్వాడ్ నం. 04)
2017–2019హాంప్‌షైర్ (స్క్వాడ్ నం. 30)
2017Khulna Titans
2018Tshwane Spartans
2019Rangpur Riders (స్క్వాడ్ నం. 27)
2019/20ఖుల్నా టైగర్స్
2020–presentముల్తాన్ సుల్తాన్స్ (స్క్వాడ్ నం. 2)
2020/21మె;ల్‌బోర్న్ రెనెగేడ్స్
2021/22–presentఫ్రీ స్టేట్
2022 సోమర్సెట్ (స్క్వాడ్ నం. 4)
2022Oval Invincibles
2022/23సిడ్నీ థండర్
2023Pretoria Capitals
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 36 28 108 158
చేసిన పరుగులు 1,239 725 7,363 5,818
బ్యాటింగు సగటు 38.71 34.52 40.90 39.84
100లు/50లు 3/7 2/3 19/33 12/35
అత్యుత్తమ స్కోరు 132 109 319 156
వేసిన బంతులు 45 78 93
వికెట్లు 1 3 1
బౌలింగు సగటు 44.00 23.33 87.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/17 1/1 1/17
క్యాచ్‌లు/స్టంపింగులు 22/– 13/– 119/– 78/–
మూలం: ESPNcricinfo, 2023 మే 4

రైలీ రోస్కో రోసోవ్ (జననం 1989 అక్టోబరు 9) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు, 2014, 2016 మధ్య దక్షిణాఫ్రికా తరపున ఆడాడి, మళ్ళీ 2022 జూలైలో అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు.[1] దక్షిణాఫ్రికాలో అతను 2017 జనవరిలో ఇంగ్లాండ్‌లోని హాంప్‌షైర్‌తో కోల్‌పాక్ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు నైట్స్, ఫ్రీ స్టేట్ కోసం దేశీయ క్రికెట్ ఆడాడు. అతను ఎడమ చేతి బ్యాటరు, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలరు. 2022 టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్‌పై తన 109 పరుగులతో ఐసిసి పురుషుల T20 ప్రపంచ కప్ చరిత్రలో సెంచరీ చేసిన మొదటి దక్షిణాఫ్రికా ఆటగాడిగా రోసోవ్ చరిత్ర సృష్టించాడు.

దేశీయ, T20 ఫ్రాంచైజీ క్రికెట్[మార్చు]

రోసోవ్ 2007 నవంబరులో ఫ్రీ స్టేట్ కోసం ఈస్టర్న్స్‌పై తన ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేసి, మూడో స్థానంలో బ్యాటింగు చేశాడు. ఈ మ్యాచ్‌లో 13 ఫోర్లతో 83 పరుగులతో మ్యాచ్‌లో అత్యధిక స్కోరు సాధించాడు. [2] తన తొలి సీజన్ ముగింపులో అతను ఈగల్స్ కోసం మూడు ట్వంటీ 20 మ్యాచ్‌లు ఆడాడు.[3]

రోసోవ్ 2008/09 సీజన్‌లో ఈగల్స్ జట్టులో సాధారణ ఆటగాడు. సూపర్‌స్పోర్ట్ సిరీస్‌లో అతను మూడు సెంచరీలతో సహా 765 పరుగులతో జట్టుకు ప్రధాన స్కోరర్‌గా నిలిచాడు. [4] అతని తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీ 2008 నవంబరులో టైటాన్స్‌పై వచ్చింది. ఆ మ్యాచ్‌లో 20 బౌండరీలతో సహా 106 పరుగులు చేశాడు. [5] 2009 మార్చిలో రిటర్న్ మ్యాచ్‌లో అతను జట్టు మొత్తం 178లో 109 పరుగులు చేశాడు, మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా 16 దాటలేదు.[6] లీగ్ ఛాంపియన్‌తో ఈగల్స్ ఓడిపోవడంతో మళ్లీ అతని ఇన్నింగ్స్ నిష్ఫలమైంది. వన్డే ఫార్మాట్‌లో కూడా అతను తొలి సెంచరీని సాధించాడు. అతను వారియర్స్‌పై 108 బంతుల్లో 131 పరుగులు చేశాడు. [7]


రోసోవ్ 2009/10 సీజన్‌లో 57.61 సగటుతో 1,261 పరుగులు చేశాడు, ఇందులో టైటాన్స్‌పై 291 బంతుల్లో 319 పరుగులు కూడా ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా దేశీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ, 47 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. డీన్ ఎల్గార్‌తో కలిసి అతను 84 ఓవర్లలో 480 పరుగుల రెండవ వికెట్ భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఇది ఏ వికెట్‌కైనా అతిపెద్ద దక్షిణాఫ్రికా భాగస్వామ్యం.[8]

రోసోవ్ IPL 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. IPL 2014లో నిక్ మాడిన్సన్ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. 2015 ఆఫ్రికా T20 కప్ కోసం ఫ్రీ స్టేట్ క్రికెట్ జట్టులో చేరాడు. [9]

రోసోవ్ క్వెట్టా గ్లాడియేటర్స్ కోసం 2017 పాకిస్తాన్ సూపర్ లీగ్ సీజన్‌లో రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా ఆడాడు. అతను సుమారు $370,000 సంపాదించినట్లు వార్తలొచ్చాయి. అతను BPL 2017లో ఖుల్నా టైటాన్స్ తరపున ఆడాడు.

2018 అక్టోబరులో, అతను 2018–19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కోసం, రంగ్‌పూర్ రైడర్స్ జట్టులో ఎంపికయ్యాడు. [10] అతను 14 మ్యాచ్‌ల్లో 558 పరుగులతో టోర్నమెంట్‌లో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. [11] 2019 నవంబరులో 2019–20 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఖుల్నా టైగర్స్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు. [12] 2020 జూలైలో 2020 కరేబియన్ ప్రీమియర్ లీగ్ కోసం సెయింట్ లూసియా జౌక్స్ జట్టులో ఎంపికయ్యాడు. [13] [14] అయితే, సరైన సమయంలో ప్రయాణ ఏర్పాట్లను చేసుకోనందున టోర్నమెంట్‌కు దూరమైన ఐదుగురు దక్షిణాఫ్రికా క్రికెటర్లలో రోసోవ్ ఒకడు. [15] 2020 నవంబరులో అతను, 2019-20 బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టులో ఎంపికయ్యాడు. [16]


2021 నవంబరులో, అతను 2021 లంక ప్రీమియర్ లీగ్ కోసం దంబుల్లా జెయింట్స్‌కు ఆడటానికి ఎంపికయ్యాడు. [17] 2022 ఏప్రిల్లో, ఇంగ్లాండ్‌లోని ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం ఓవల్ ఇన్విన్సిబుల్స్ అతన్ని కొనుగోలు చేసింది. [18]

2022 మేలో, అతను T20 బ్లాస్టు కోసం సోమర్సెట్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. [19]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

బ్లూమ్‌ఫోంటైన్‌లోని గ్రే కాలేజీలో చదువుతున్నప్పుడు రోసోవ్ దక్షిణాఫ్రికా పాఠశాలల జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యాడు. [20] అతను 2007 డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండవ 'టెస్ట్'లో దక్షిణాఫ్రికా అండర్-19 కి రంగప్రవేశం చేసాడు [21] అతను 2008 U/19 క్రికెట్ ప్రపంచ కప్‌కు ముందు భారత్‌తో కూడా ఆడాడు. [3] ప్రపంచ కప్‌లో అతను మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడి, 34.00 సగటుతో 136 పరుగులు చేశాడు. అప్పుడు దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంది. [22]

2010లో బంగ్లాదేశ్, శ్రీలంక పర్యటనలు చేసిన దక్షిణాఫ్రికా A జట్టులో రోసోవ్ ఎంపికయ్యాడు. ఆ తర్వాత అతను శ్రీలంక Aకి వ్యతిరేకంగా 151 బంతుల్లో 131 పరుగులు చేశాడు, డీన్ ఎల్గార్, జోనాథన్ వాండియార్‌లతో సెంచరీ స్టాండ్‌లను పంచుకున్నాడు. [23]

అతను 2014 ఆగస్టులో జింబాబ్వేపై వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు.

అతను 2014 నవంబరు 5న ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా తరపున తన ట్వంటీ20 అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు [24] 50 బంతుల్లో 78 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

2017 జనవరి 5న, రోసోవ్ హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో కోల్‌పాక్ ఒప్పందంపై సంతకం చేశాడు. దీని వలన అతని అంతర్జాతీయ కెరీర్‌ను ముగించి దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించడానికి అనర్హుడయ్యాడు. [25] అతను తిరిగి రావడానికి ముందు అంతర్జాతీయ క్రికెటర్‌గా అతని చివరి ఆట న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో 122 పరుగులు చేయడం. ఆ సీరీస్‌లో దక్షిణాఫ్రికా, 5-0 తో ఆస్ట్రేలియాను ఓడించింది. అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకుంది. [26]

2022 అక్టోబరులో, ఇండోర్‌లో భారత్‌పై తన మొదటి T20I సెంచరీ చేశాడు. [27]

ప్రస్తావనలు[మార్చు]

  1. "Rilee Rossouw rebuilds his burnt bridges with innings of World Cup pedigree". ESPN Cricinfo. Retrieved 29 July 2022.
  2. Free State v Easterns, South African Airways Provincial Three-Day Challenge 2007/08 (Pool B), CricketArchive, Retrieved on 11 April 2009
  3. 3.0 3.1 Player Oracle: RR Rossouw, CricketArchive, Retrieved on 11 April 2009
  4. SuperSport Series 2008/09 – Batting and Fielding for Eagles, CricketArchive, Retrieved on 11 April 2009
  5. Titans v Eagles, SuperSport Series 2008/09, CricketArchive, Retrieved on 11 April 2009
  6. Eagles v Titans, SuperSport Series 2008/09, CricketArchive, Retrieved on 11 April 2009
  7. Warriors v Eagles, MTN Domestic Championship 2008/09, CricketArchive, Retrieved on 11 April 2009
  8. Rilee Rossouw enters record books with triple ton, Cricinfo, Retrieved on 25 March 2010
  9. Free State Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  10. "Full players list of the teams following Players Draft of BPL T20 2018-19". Bangladesh Cricket Board. Retrieved 29 October 2018.
  11. "Bangladesh Premier League, 2018/19 - Rangpur Riders: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 6 February 2019.
  12. "BPL draft: Tamim Iqbal to team up with coach Mohammad Salahuddin for Dhaka". ESPN Cricinfo. Retrieved 18 November 2019.
  13. "Nabi, Lamichhane, Dunk earn big in CPL 2020 draft". ESPN Cricinfo. Retrieved 6 July 2020.
  14. "Teams Selected for Hero CPL 2020". Cricket West Indies. Retrieved 6 July 2020.
  15. "Five South Africans to miss CPL after failing to confirm travel arrangements". ESPN Cricinfo. Retrieved 28 July 2020.
  16. "Rilee Rossouw completes Melbourne Renegades' BBL squad". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2020-12-13.
  17. "Kusal Perera, Angelo Mathews miss out on LPL drafts". ESPN Cricinfo. Retrieved 10 November 2021.
  18. "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
  19. "Rilee Rossouw joins Somerset for T20 Blast".
  20. SA schools cricket team announced, iol.co.za, Retrieved on 11 April 2009
  21. South Africa Under-19s v Bangladesh Under-19s, Bangladesh Under-19s in South Africa 2007/08 (2nd Test), CricketArchive, Retrieved on 11 April 2009
  22. ICC Under-19 World Cup 2007/08 – Batting and Fielding for South Africa Under-19s, CricketArchive, Retrieved on 11 April 2009
  23. Rossouw century puts South Africa in command, Cricinfo, Retrieved on 9 October 2010
  24. "South Africa tour of Australia (November 2014), 1st T20I: Australia v South Africa at Adelaide, Nov 5, 2014". ESPN Cricinfo. Retrieved 5 November 2014.
  25. "Rossouw gives up SA career for Kolpak deal with Hampshire". ESPN Cricinfo. Retrieved 5 January 2017.
  26. "Rossouw's 122 thrusts SA to 5-0 whitewash". ESPN Cricinfo. Retrieved 7 February 2021.
  27. "IND vs SA Highlights: Rilee Rossouw Shines as South Africa Beat India by 49 Runs for Consolation Win | Cricket News".