రొమేష్ కలువితారణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రొమేష్ కలువితారణ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
దేశబంధు రొమేష్ శాంత కలువితారణ
పుట్టిన తేదీ (1969-11-24) 1969 నవంబరు 24 (వయసు 54)
కొలంబో, శ్రీలంక
మారుపేరులిటిల్ కాలు, లిటిల్ డైనమైట్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్, బ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 52)1992 ఆగస్టు 17 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2004 అక్టోబరు 28 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 61)1990 డిసెంబరు 8 - భారతదేశం తో
చివరి వన్‌డే2004 ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
సెబాస్టియనైట్స్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్
కోల్ట్స్ క్రికెట్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 49 189
చేసిన పరుగులు 1,933 3,711
బ్యాటింగు సగటు 26.12 22.22
100లు/50లు 2/9 3/23
అత్యధిక స్కోరు 132* 102*
క్యాచ్‌లు/స్టంపింగులు 93/26 132/75
మూలం: Cricinfo, 2016 ఫిబ్రవరి 9

దేశబంధు రొమేష్ శాంత కలువితారణ, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్. 1990 నుండి 2004 వరకు శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[1] 1996 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టుకు కీలక సభ్యుడు, వికెట్ కీపర్. దూకుడు బ్యాటింగ్ శైలికి ప్రసిద్ధి చెందాడు.

జననం[మార్చు]

రొమేష్ కలువితారణ 1969, నవంబరు 24న శ్రీలంకలో జన్మించాడు.

సనత్ జయసూర్యతోపాటు కలువితారణ 1990ల మధ్యకాలంలో బ్యాటింగ్‌తో వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో ఘనత పొందాడు. 2004 ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ20 టోర్నమెంట్‌లో కోల్ట్స్ క్రికెట్ క్లబ్ తరపున ట్వంటీ20లోకి అరంగేట్రం చేసాడు. 2018 మే 17న మలేషియా తాత్కాలిక క్రికెట్ కోచ్‌గా నియమితుడయ్యాడు. అతను సెయింట్ సెబాస్టియన్స్ కాలేజీ, మొరటువాలో చదువుకున్నాడు.

ఇతరాలు[మార్చు]

ఉదవాలావేలో విలాసవంతమైన జంగిల్ రిట్రీట్ అయిన కాలూస్ హైడ్‌వే అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "Romesh Kaluwitharana". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-16.
  2. Weerasuriya, Sanath (11 December 2019). "Kalu's Hideaway for nature lovers". The Sunday Times (Sri Lanka). ISSN 1391-0531. Retrieved 2023-08-16.