రోళ్ళ శేషగిరిరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోళ్ళ శేషగిరిరావు
RSRao.jpg
రోళ్ళ శేషగిరిరావు
జననంసా.శ. 1921, ఆగష్టు 29
తాళ్ళరేవు
మరణం23 ఫిబ్రవరి 2015
ప్రసిద్ధివృక్ష శాస్త్రవేత్త

రోళ్ళ శేషగిరిరావు ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. రోళ్ళగారు దేశవ్యాప్తంగా అనేక వృక్షజాతులను కనుగొన్నారు. కొన్ని వృక్ష జాతులకు ఆయన పేరుపై సిరపీజియా రోళ్ళ, పింపినెలా రోళ్ళ, మొఘానియా రోళ్ళ అని ఆయన గౌరవార్థం నామకరణం చేసారు. అందమైన పూలగుత్తులతో, కొబ్బరిముక్కలా కరకరలాడుతూ కమ్మని రుచిగల జంట కాయలను కాస్తూ, సహ్యాద్రి అడవుల్లో పెరిగే కొత్త ప్రజాతి (జీనస్‌) తీగను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘శేషగిరియా సహ్యాద్రికా అన్సారీ అండ్‌ హేమాద్రి’ అని పిలుస్తున్నారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

యానాం కేంద్రపాలిత ప్రాంతాన్ని అంటిపెట్టుకున్నట్లుగా ఉండే తాళ్ళరేవులో 1921, ఆగస్టు 19 న రోళ్ళ శేషగిరిరావు జన్మించారు. ఆయన తన ఉద్యోగ జీవితాన్ని 1942 లో మొదట కాకినాడ పి.ఆర్‌. కాలేజీలో అధ్యాపకుడుగా ప్రారంభించాడు. తరువాత బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో చేరి, దాదాపు అన్ని సర్కిళ్ళలోనూ పనిచేసి, స్వచ్ఛందపదవీ విరమణ తీసుకుని, అప్పటి ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ఎం.ఆర్‌. అప్పారావు కోరికపై బోటనీ ప్రొఫెసర్‌గా చేరి చక్కని బొటనిస్టులను తయారు చేసారు. ఆయన 1980 వరకు పనిచేసారు. ఆయన 1950 లో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో చేరి తన సేవలను 1977 న ఆయన పదవీ విరమణ చేసే వరకు అందించారు. తరువాత ఆయన 1977-81 మధ్య కాలంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం వృక్ష శాస్త్ర విభాగానికి అధిపతిగా యున్నారు. ఆయన డీఎస్‌టీ, సీఎస్‌ఐఆర్‌, బీఎస్‌ ఐ, యూజీసీ రీసెర్చ్‌ ప్రాజెక్టులకు గౌరవ డైరెక్టర్‌గా ఉండేవారు. హిమాలయాల్లో సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగుల పైబడి ఎత్తు ఉన్న ‘మౌంట్‌ చొ ఒయు’ అనే పర్వతారోహణ జట్టులో బొటనిస్ట్‌ సభ్యుడిగా ఉండి, మొక్కల నమూనాలను రోళ్ల సేకరించారు. ఆ సందర్భంగా ప్రథమ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూతో సన్మానం పొందారు.

ఆయన 2015 ఫిబ్రవరి 23 న మరణించారు.[2]

ప్రచురణలు[మార్చు]

ఆయన 100 రీసెర్చ్ పత్రాలను 12 పుస్తకాలను ప్రచురించారు. వాటిలో ఫ్లోరా ఆఫ్‌ గోవా, దీవ్‌, దమన్‌ అండ్‌నాగర్‌ హవేలి (అప్పటి యూనియన్‌ టెరిటరీ), ఫ్లోరా ఆఫ్‌ ఈస్ట్‌ గోదావరి డిస్ర్టిక్ట్‌, ఫ్లోరా ఆఫ్‌ వెస్ట్‌ గోదావరి డిస్ర్టిక్ట్‌, ఫ్లోరా ఆఫ్‌ శ్రీకాకుళం డిస్ర్టిక్ట్‌- తదితర పరిశోధనా గ్రంథాలను తన శిష్యులతో ప్రచురించారు. రోళ్ళగారితో కలిసి కొప్పుల హేమాద్రి రాసిన ‘ఆంధ్రప్రదేశ్‌లో మందుమొక్కలు’ తెలుగు అకాడమీ 1979లో ప్రచురించి అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికీ దాన్ని వైద్యులూ, విద్యార్థులూ, వనౌషధీ వ్యాపారులూ అభిమానిస్తూనే ఉన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌’లో బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా రీజినల్‌ సర్కిల్‌ స్థాపించేటందుకు రోళ్ళగారు అనేక ఏళ్ళుగా పోరాడి అది హైదరాబాద్‌లో ప్రారంభమయ్యేలా చేశారు. హైదరాబాద్‌లో తన గృహంలో పదిలపరచిన అమూల్యమైన పరిశోధనా గ్రంథాలనూ, పత్రాలనూ బొటానికల్‌ సర్వే లైబ్రరీకి కానుకగా ఇచ్చేశారు.

అవార్డులు[మార్చు]

ఆయనకు 1984 లో ప్రతిష్టాత్మకమైన ప్రొఫెసర్ మహేశ్వరి మెడల్ లభించింది. 1995 లో వై.డి.తియాజీ గోల్డ్ మెడల్ లభించింది.

పుస్తకాలు[మార్చు]

  • rolla seshagiri Rao, s. hara Sreeramulu. 1986. Flora of Srikakulam District, Andhra Pradesh, India. Ed. Meerut : Indian Botanical Society. 640 pp.
  • 1986. Flora of India Series: Series II: State Flora Analysis: Flora of Goa, Diu, Daman, Dadra and Nagarhaveli. xxx + 546 pp.
  • s. Sudhakar, p. Venkanna. 1999. Flora of East Godavari District, Andhra Pradesh, India. 947 pp.
  • 2003. Floristic environment of lake Kolleru. En: Lake Kolleru : Environmental Status (Past and Present). Eds. M.K. Durga Prasad & Y. Anjaneyulu, BS Pub, viii + 236 pp. ISBN 81-7800-046-6

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]