Jump to content

రోహ్‌తక్ సోదరీమణుల వీడియో వివాదం

వికీపీడియా నుండి
(రోహ్‌తక్ సోదరీమణుల వీడీయో వివాదం నుండి దారిమార్పు చెందింది)
రోహ్‌తక్, హర్యాన
రోహ్‌తక్, హర్యాన
రోహ్‌తక్
రోహ్‌తక్, హర్యాన

రోహ్‌తక్ కు చెందిన "పూజాస్వామి", "ఆర్తీస్వామి" అనే సోదరీమణులు స్వీయరక్షణ పేరుతో ముగ్గురు యువకులపై హింసకు పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాలలో వివాదం సృష్టించింది.

విశేషాలు

[మార్చు]

నవంబరు 2014లో రోహ్‌తక్కు చెందిన అక్క చెల్లెళ్ళు "పూజాస్వామి", "ఆర్తీస్వామి" తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కారణంతో ముగ్గురు యువకులను బెల్టుతో దేహశుద్ధి చేస్తూ ఉన్న వీడియోను సాంఘిక మాధ్యమాలలో పోస్టు చేసి అలజడి సృష్టించారు.[1] ఈ వీడియో ప్రసారమాధ్యమాలకు కూడా పొక్కగనే దేశమంతా దావానలంలా వ్యాపించింది. ప్రసారమాధ్యమాలు "ధైర్యసాహసాలు" గల సోదరీమణులుగా వీరిని ప్రచారం చేశాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే ఈ సోదరీమణులే మరొక అబ్బాయిని దారుణంగా కొట్టే వీడియో మరొకటి వెలువడగనే వీరి ప్రవర్తన పై అనుమానాలు బయలుదేరాయి.[2] ప్రత్యక్ష సాక్షులైన ఆరుగురు మహిళలు పోలీసుల ఎదుట విచారింపబడ్డారు. ఈ ఘర్షణ జరగటానికి కారణం లైంగిక వేధింపులు కాదని, వయోవృధ్ధులకు కేటాయించిన సీట్లలో వీరు కూర్చుని ఉన్న కారణాననే ఘర్షణ చోటు చేసుకొన్నదని వారు తెలిపారు. తర్వాత మరొక యువకుడు కూడా ఈ సోదరీమణులు తనపై అత్యాచార యత్న ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలు ఉపసంహరించుకోవటానికి వారు తన వద్ద నుండి ₹20,000 వసూలు చేశారని తెలిపాడు.[3]

8 డిసెంబరు న తమ ఆరోపణలు నిజమేనని ఋజువు చేయటానికి తాము నార్కోఅనాలిసిస్ పరీక్షలకు సిద్ధమని సోదరీమణులు తెలిపారు.[4] అయితే ఈ పరీక్షలలో వీరు చెప్పినవి అబద్ధాలని తేలగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుల మాటలే నిజాలని తేలినవి.[5]. 18 జనవరి న ఈ కేసును ఉపసంహరించుకొమ్మని తమ పై ఒత్తిడి తెస్తున్నారని, విచారణలో తమని అసభ్యకర ప్రశ్నలతో వేధిస్తున్నారని వీరు పోలీసులకి ఫిర్యాదు చేశారు.[6] మే 2015లో సాంఘిక మాధ్యమాలలో ఎవరో తమ ఫోటోలను మార్ఫ్ చేసి పోస్టు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.[7] జూన్ 2015 నాటికి కూడా దీనిపై కోర్టు తీర్పు వెలువడలేదు.

తుది తీర్పు

[మార్చు]

4 మార్చి 2017న కోర్టు వెలువరించిన తీర్పులో యువకులపై అన్ని ఆరోపణలను కొట్టివేసినది. [8] [9]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. బస్సులో మృగాళ్ళకు దేహశుద్ధి చేసిన రోహ్‌తక్ సోదరీమణులు (ఎన్ డి టి వి - 30 నవంబరు 2014)
  2. మరొక అబ్బాయిని సోదరీమణులు కొడుతున్న వీడియో (హిందుస్తాన్ టైమ్స్ - 4 ఫిబ్రవరి 2015)
  3. అత్యాచార యత్న ఆరోపణలు ఉపసంహరించుకోవటానికి నా వద్ద నుండి 20,000 వసూలు చేశారు (ఐబీఎన్ లైవ్ - 08 డిసెంబరు 2014)[permanent dead link]
  4. కావాలంటే మమ్మల్ని నార్కోఅనాలిసిస్ ద్వారా పరీక్షించండి (టైంస్ ఆఫ్ ఇండియా - 9 డిసెంబరు 2014)
  5. సోదరీమణుల ఆరోపణలు అసత్యాలు అని తేల్చిన పాలీగ్రాఫ్ పరీక్షలు (జీ న్యూస్ - 19 ఫిబ్రవరి 2015)
  6. విచారణ పేరుతో మమ్మల్ని అసభ్య ప్రశ్నలని అడుగుతున్నారని తెలిపిన సోదరీమణులు - (టైమ్స్ ఆఫ్ ఇండియా - 19 జనవరి 2015)
  7. మా ఫోటోలను ఎవరో మార్ఫ్ చేసి సాంఘిక మాధ్యమాలలో పోస్టు చేస్తున్నారు అని ఫిర్యాదు చేసిన సోదరీమణులు (టైమ్స్ ఆఫ్ ఇండియా - 18 మే 2015)
  8. కేసులను కొట్టివేసిన రోహ్‌తక్ కోర్టు (డి ఎన్ ఏ - 3 మార్చి 2017)
  9. https://www.ndtv.com/india-news/court-ends-case-against-3-rohtak-molesters-girls-may-appeal-order-1666224 కేసుల వలన కొన్ని పోటీ పరీక్షలు రాయలేకపోయామన్న యువకులు (ఎన్ డీ టీ వీ - 05 మార్చి 2017)]

ఇతర లింకులు

[మార్చు]