లక్కవరం (తాళ్ళూరు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?లక్కవరం
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 15°41′54″N 79°47′40″E / 15.698285°N 79.794474°E / 15.698285; 79.794474
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా(లు) ప్రకాశం జిల్లా జిల్లా
జనాభా
ఆడ-మగ నిష్పత్తి
10,645 (2010 నాటికి)
• 1:1
కోడులు
పిన్‌కోడు
వాహనం

• 523264
• AP27


లక్కవరం
—  రెవిన్యూ గ్రామం  —
లక్కవరం is located in ఆంధ్ర ప్రదేశ్
లక్కవరం
అక్షాంశరేఖాంశాలు: 15°41′58″N 79°47′41″E / 15.699498°N 79.794651°E / 15.699498; 79.794651
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం తాళ్ళూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,474
 - పురుషుల సంఖ్య 2,284
 - స్త్రీల సంఖ్య 2,190
 - గృహాల సంఖ్య 1,132
పిన్ కోడ్ 523 264
ఎస్.టి.డి కోడ్ 08592

లక్కవరం, ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 264., ఎస్.టి.డి.కోడ్ = 08592.

తాళ్ళూరు మండలంలో అతి పెద్ద గ్రామం. ఈ ఊరి జనాభా దాదాపు 10,000 వరకు ఉంటుంది. ఓటు హక్కు వున్న వారు దాదాపు 5,000. లక్కవరంలో పాత ఊరు, కొత్త ఊరు, మాల పల్లె, మాదిగ పల్లె, యానాది పల్లె అని 5 మూల స్తంభాలు ఉన్నాయి. ఊరిలో రెడ్ది కులస్తులు యెక్కువగా ఉంటారు. అలాగే మిగతా వారు కూడా. అన్నీ కులాల, మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటారు. ఊరిలో ప్రధానంగా దసరా, దీపావళి, సంక్రాంతి, శ్రీరామ నవమి, ఉగాది, అట్లతద్ది, తొలి ఏకాదశి, గంగమ్మ తిరునాళ్ళ, క్రిస్మస్, రంజాన్ పండగలని ఊరి జనాభా అంతా కలిసి జరుపుకుంటారు.

  • లక్కవరంలో తూము అని ఇంటి పేరు కలవాళ్ళు చాలా యెక్కువ. దాదాపు 1/10 ఊరి జనాభా ఇంటి పేరు తూముతో మొదలు అవుతుంది.
  • ఈ ఊరి రహదారులు చాలా చెత్తగా ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లు నడవటానికి కూడా వీలుపడదు. ఇంక రవాణా విషయానికి వస్తే రోజుకి ఒక బస్సు 3 ట్రిప్పులు తిరుగుతుంది. ఇంతకు మునుపు 3-4 బస్సులు తిరిగేవి. ఆటోలు యెక్కువ అవటం వలన, జనం బస్సులు యెక్కువ యెక్కక పొవటం వలన ఆ బస్సులను తీసేశారు. జనవరి 1 వ తేదీన ఆ వచ్చే ఒక బస్సును కొత్త పెళ్ళి కూతురిలా ముస్తాబు చేస్తారు.

ఈ ఊరిలో ప్రధానంగా వరి, పత్తి, సజ్జలు, నువ్వులు, చెరకు, వేరుశెనగ మరియు ప్రొద్దు తిరుగుడు పంటలను యెక్కువగా పండిస్తారు. పంట సాగు ప్రధానంగా వర్షం పై ఆధార పడి వుంటుంది. ఊరిలో రెండు చెరువులు ఉన్నాయి. వాటిని చిన్న చెరువు, పెద్ద చెరువుగా పిలుస్తారు. మరియు వాగులు కుడా నిరంతరం పారుతూ వుంటాయి. నాగార్జున సాగర్ కాలువ కూడా 3 నెలలు నీళ్ళు వస్తాయి. సాగర్ కాలువ కింద సాగు సంవత్సరానికి 3 సార్లు పంట పండుతుంది. ఈ మధ్య ఊరిలో కూడా రైతులు ఆధునిక పనిముట్లని వాడుతున్నారు. ఇంతకు ముందు ఊరిలో అందరు వ్యవసాయం కోసం ఎడ్లను ఉపయొగించె వాళ్ళు. కాలం మారింది. యువ రైతులు అందరు వ్యవసాయాన్ని సులభతరం చేశారు.

  • త్రాగు నీరు కూడా ట్యాకర్ల ద్వారా సరఫరా అవుతాయి. రోజుకి 2-3 బిందెలు సరఫరా చేస్తారు. ఇక నిత్యవసరాలకు బొరు బావుల ద్వారా పుష్కలంగా నీరు వస్తాయి.
  • ఊరిలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువు కొవటానికి ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. కానీ విద్యార్థులు చాలా తక్కువ మంది వుంటారు, అలాగే ఉపాధ్యాయులు కూడా. అందరు తల్లిదండ్రులు వాల్ల పిల్లలని పాఠశాలలలో చదివిస్తున్నారు. లక్కవరం గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీ పల్లె సీతారామయ్య, ఉగాది పురస్కారానికి ఎంపికైనారు. ఆయన ఈ పురస్కారానికి ఎంపికకావడం ఇది మూడవసారి. ఈ సందర్భంగా వీరిని 2014,మార్చి-31 (ఉగాదిరోజు) న, శ్రీకృష్ణదేవరాయ సాహిత్య, సాంస్కృతిక సేవాసమితి వారు ఒంగోలులో సన్మానించనున్నారు. [1]
  • ఈ ఊరి ప్రజలకు భక్తిప్రవత్తులు ఎక్కువే. దానికి నిదర్శనంగా మా ఊరిలో గుడులు చాలా ఉన్నాయి. ఈశ్వరుని గుడి చాలా పురాతనమైనది. అంతేకాక ఆంజనేయ స్వామి దేవాలయము, రాములవారి గుడి, పొలేరమ్మ గుడి, బ్రహ్మంగారి గుడి చెప్పుకొతగ్గవి. వీటితొ పాటు సుప్రసిద్ద శివుని ఆశ్రమం (కొత్తది) ఉన్నాయి. అదె విదంగా కొత్తాగా ఒక స్కులు పెతరు దాని పేరు . మా ఊరిలో గొదవలు అసలు

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • తూము ఇందిరమ్మ (సర్పంచ్)
  • తూము లక్ష్మి రెడ్డి (ఉప సర్పంచ్)

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,474 - పురుషుల సంఖ్య 2,284 - స్త్రీల సంఖ్య 2,190 - గృహాల సంఖ్య 1,132

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,042.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,091, మహిళల సంఖ్య 1,951, గ్రామంలో నివాస గృహాలు 895 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,507 హెక్టారులు.

సమీప గ్రామాలు[మార్చు]

పొతకమూరు 4 కి.మీ, వెలుగువారిపాలెం 4 కి.మీ, నాగంబొట్లపాలెం 5 కి.మీ, బొద్దికూరపాడు 5 కి.మీ, సామంతపూడి 7 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన దర్శి మండలం, ఉత్తరాన ముండ్లమూరు మండలం, దక్షణాన చీమకుర్తి మండలం,పశ్చిమాన పొదిలి మండలం.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014,మార్చి-31; 14వ పేజీ.