Jump to content

లక్ష్మా గౌడ్

వికీపీడియా నుండి
లక్ష్మా గౌడ్
జననంకలాల్ లక్ష్మా గౌడ్
ఆగష్టు 21, 1940
నిజాంపూర్, మెదక్ జిల్లా
ప్రసిద్ధిచిత్రకారుడు
పిల్లలునందిని గౌడ్ (చిత్రకారిణి)
పురస్కారాలుపద్మశ్రీ (2016)

కలాల్ లక్ష్మా గౌడ్ ఆగష్టు 21, 1940మెదక్ జిల్లాలోని నిజాంపూర్లో జన్మించాడు. ఈయన చిత్రకళలోనే కాక, ముద్రణ, డ్రాఫ్టింగ్ లో కూడా దిట్ట. శిల్పకళ, గాజుపై చిత్రకళ లోనూ ఆరితేరిన లక్ష్మా గౌడ్, గ్రామీణ నేపథ్యంగల శృంగార భరిత చిత్రాలకు ఖ్యాతి గాంచాడు.[1] ఆయన 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం,[2] 2016లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.[3]

జీవితం

[మార్చు]

లక్ష్మా గౌడ్ బాల్యం గ్రామంలో కొనసాగడం వలన, గ్రామీణ సంప్రదాయాలు, కళలను గమనించే అవకాశం లభించింది. బాలుడిగా ఉన్నప్పుడు తోలుబొమ్మలాట, మట్టితో చేసే అలంకరణల పట్ల ఆకర్షితుడయ్యాడు.[4] కాలం గడిచే కొద్దీ చిత్రకళపై ఆసక్తి పెంచుకొని హైదరాబాదుకి చెందిన ప్రభుత్వ లలిత కళల కళాశాలలో చేరాడు. కే.జీ. సుబ్రమణ్యన్ నేతృత్వంలో పైకప్పుల లోపలి భాగాలపై వేసే మ్యూరల్ పెయింటింగుల అధ్యయనానికై 1963-65 లో బరోడా లోని ఫ్యాకల్టీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కి వెళ్ళిన లక్ష్మా గౌడ్ కు, ముద్రణరంగంలో ఆసక్తి కలిగింది . చిత్రకళలోని ముద్రణరంగ విభాగంలో తనదైన ఒరవడిని సృష్టించాడు.[5]

వృత్తి, శైలి

[మార్చు]

పట్టా పుచ్చుకొన్న తర్వాత గౌడ్ నిజాంపూర్ తిరిగివచ్చాడు. తాను కొత్తగా నేర్చుకొన్న లౌకిక పట్టణ దృక్కోణం నుండి తనలోని కళాకారుడు గ్రామీణ జీవితంలోని ప్రశాంతమైన వాతావరణం లోని శృంగార రసం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఇది పట్టణాలలో తాను మధ్యతరగతిలో గమనించిన శృంగార రసానికి వైరుధ్యంగా ఉండేది.[1]

లక్ష్మా గౌడ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకొనే ప్రక్రియలో గ్రామీణ, గిరిజన చలాకీదనాన్ని పట్టణ చట్రంలో నుండి చూస్తూ, ఊహాచిత్రాలను కవిత్వంతో అనుసంధానిస్తూ అధివాస్తవిక, కామేఛ్ఛ లక్షణాలు గల చిత్రాలను గీయసాగాడు. గ్రామీణ జీవిత చిత్రాలను బూడిద రంగులలో చిత్రీకరణ చేశాడు. తర్వాత వేసిన కలం, సిరాల చిత్రాలలో పాత జ్ఞాపకాలు, అధివాస్తవికత, శృంగారం కలగలిపి ఉండేవి.[1] ఈ శైలి గురించి ప్రస్తావిస్తూ, “ మనం స్త్రీ-పురుష సంబంధాలను, సంతానోత్పత్తిని గురించి బహిరంగంగా చర్చించే సంస్కృతి నుండి వచ్చాము. అవి సమకాలీన సందర్భంలో పునరావృత్తం అయినపుడు వాటి గురించి సిగ్గు పడవలసిన అవసరం ఏముంది?" అని అన్నాడు.[6]

నిండైన పొదుగులతో ఉన్న మేకలు, స్తంభించిన పురుషాంగాలు గల మేకపోతులు మూలాంశాలుగా కొన్ని చిత్రాలు సృష్టించాడు. ఈ మేకలు కేవలం గ్రామీణ భారత ప్రతిరూపాలు మాత్రమే కావు. గౌడ్ మాటలలో: "ఈ మేకల గురించి ఎవరూ పట్టించుకోరు, ఒక్క చిత్రకారుడు తప్ప. వీటిలో తమని పెంచి పోషించిన స్వస్థలాలను వీడి, శునక సంకల్పాలతో జీవిస్తున్న మనుషులే నాకు కనిపిస్తారు." [7]

1970 నాటికి జలవర్ణాలు, తీవ్రత పెరిగిన శృంగార చిత్రాలు వేసిన గౌడ్, 1980 నాటికి సాంప్రదాయికత వైపు మొగ్గి ఇట్టి అలంకారాలు, గాజు పై చిత్రీకరణ వైపు మొగ్గాడు.[1]

హైదరాబాదు యూనివర్శిటీ లోని సరోజినీ నాయుడు స్కూల్ అఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్, ఫైన్ ఆర్ట్ అండ్ కమ్యూనికేషన్ కి ప్రధానోపాధ్యాయుడుగా వ్యవహరిస్తున్నాడు.[8]

ప్రదర్శనలు

[మార్చు]

లక్ష్మా గౌడ్ పలు జాతీయ అంతర్జాతీయ ప్రదర్శనలలో తన చిత్రాలను ప్రదర్శించాడు.

  • Kala Bhavan, Hyderabad.
  • Ansdell Gallery, London, 1973.
  • Figurative Indian Artists, Warsaw, Budapest, Belgrade Goethe Institute, Munich. 1975-76.
  • Griffei Kunst, Hamburg, 1975-76.
  • Sãం Paulo Biennale, Brazil, 1977.
  • Contemporary Indian Painting, Festival of India, Royal Academy of Art, London, 1982.
  • India in Print, Koninklijk Institute Vorde, Amsterdam, 1983.
  • Festival of India, USA, 1985.
  • Contemporary Art of India, The Herwitz Collection, USA, 1986.
  • Contemporary Indian Art, Festival of China, Geneva, Switzerland, 1987.
  • Journey's Within Landscape, Jehangir Art Gallery, Bombay, 1992.
  • National Gallery of Modern Art, New Delhi, 1993.
  • Grey Art Gallery, New York, 1986
  • Worcester Art Museum, 1986
  • Y2K International Exhibition Of Prints, National Taiwan Arts, 2000.
  • Manifestations I, organized by Delhi Art Gallery, World Trade Center, Mumbai and Delhi Art Gallery, New Delhi, 2003.
  • Manifestations II, organized by Delhi Art Gallery, Jehangir Art Gallery, Mumbai and Delhi Art Gallery, New Delhi, 2004.
  • Manifestations III, organized by Delhi Art Gallery, Nehru Center, 2006
  • " SOLO SHOW ", organized by ICA GALLERY, Jaipur, Rajasthan, 2008

సేకరణలు

[మార్చు]
  • Ebrahim Alkazi & Art Heritage, New Delhi.
  • Masanori Fukuoka & Glenbarra Art Museum, Hemaji, Japan.
  • The Philips Collection, Washington D.C.
  • Salarjung Museum, Hyderabad.
  • Glenbarra Museum, Japan.
  • Devinder and Kanwaldeep Sawhney, Bombay.
  • National Gallery of Modern Art, New Delhi.
  • Delhi Art Gallery, New Delhi.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 A Guide to 101 Modern and Contemporary Indian Artists, Amrita Jhaveri, India Book House, 2005 ISBN 81-7508-423-5
  2. సాక్షి, తెలంగాణ (31 May 2015). "రాష్ట్రావతరణోత్సవాల్లో ప్రతిభకు పట్టం". Sakshi. Archived from the original on 19 December 2015. Retrieved 12 October 2021.
  3. Nipuna (2022-07-06). "తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు". Archived from the original on 2022-07-07. Retrieved 2022-07-07.
  4. Early Drawings: F.N. Souza and K. Laxma Goud, Nancy Adajania, The Guild Art Gallery, 2004
  5. Contemporary Art In Baroda, Tulika Publishers, 1997, ISBN 81-85229-04-X
  6. Indian Contemporary Painting, Neville Tuli, Hary N. Abrams Incorporated, 1998, ISBN 0-8109-3472-8
  7. Manifestations III, Geeta Doctor, Delhi Art Gallery, 2005, ISBN 81-902104-1-6
  8. Delhi Art Gallery, www.delhiartgallery.com

బాహ్య లంకెలు

[మార్చు]