లక్ష్మీకాంత్ రాథోడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మీకాంత్‌ రాథోడ్‌
జననం
లోకా బావోజీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌

15 డిసెంబర్ 1965
జాతీయత భారతదేశం
వృత్తిప్రొఫెసర్
తల్లిదండ్రులుదేవీభాయి, హన్మ్యానాయక్‌

లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌. ఆయన 2021, మే 23న మహబూబ్‌నగర్‌ లోని పాలమూరు విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌గా నియమితుడయ్యాడు.ఆయన ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగనున్నాడు.[1][2][3]

జననం, విద్యాభాస్యం[మార్చు]

లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ పూర్తి పేరు లోకా బావోజీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌. ఆయన 1965, డిసెంబరు 15న మహబూబ్​నగర్​ జిల్లా, మద్దూరు మండలం, తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో హన్మ్యానాయక్‌, దేవీభాయి దంపతులకు జన్మించాడు. ఆయన మహబూబ్‌నగర్‌ ఎంబీసీ హైస్కూల్‌లో 1982లో పదో తరగతి పూర్తి చేశాడు. లక్ష్మీకాంత్‌ మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్, ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో 1987లో బీఏ పూ ర్తి చేశాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనమిక్స్‌, ఎంపీఈడీ పూర్తి చేసి 2006లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు.[4][5]

వృత్తి జీవితం[మార్చు]

లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ మహబూబ్ నగర్​ కేంద్రంలోని మార్కెట్‌లైన్‌ ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా, ఎస్‌ఎల్‌డీసీలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పని చేశాడు.[6] ఆయన హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్‌ డైరెక్టర్‌ డీన్‌గా, నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేశాడు.[7] ఆయన నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్న భాద్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే పాలమూరు విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌గా నియమితుడయ్యాడు.[8][9][10]

వైస్‌చాన్సలర్‌గా భాద్యతలు[మార్చు]

లక్ష్మీకాంత్ రాథోడ్ 2021, మే 24న పాలమూరు విశ్వవిద్యాలయం నూతన వైస్ చాన్సలర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[11][12][13]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (22 May 2021). "10 వర్సిటీలకు సారథులు". Namasthe Telangana. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  2. "After two years, 10 Telangana state universities finally get new Vice-Chancellors". The New Indian Express. 23 May 2021. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  3. TV9 Telugu, TV9 (22 May 2021). "Universities Vice Chancellors: తెలంగాణలో యూనివర్సిటీల కొత్త వీసీల నియమాకం.. ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్ - telangana government announced universities new vice chancellors". TV9 Telugu. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (22 May 2021). "పాలమూరు వీసీగా లక్ష్మీకాంత్‌ రాథోడ్‌". Namasthe Telangana. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  5. Andhrajyothy (22 May 2021). "పీయూ వైస్‌చాన్సలర్‌గా పాలమూరు బిడ్డ". www.andhrajyothy.com. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  6. Andhrajyothy (22 May 2021). "పీయూ వీసీగా లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ ఎంపికపై హర్షం". www.andhrajyothy.com. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  7. Sakshi (13 March 2020). "20 నుంచి అంతర్జాతీయ వ్యాయామ విద్య సెమినార్‌". Sakshi. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  8. Andhrajyothy (22 May 2021). "పాలమూరు వైస్‌ చాన్స్‌లర్‌గా లక్ష్మీకాంత్‌ రాథోడ్‌". www.andhrajyothy.com. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  9. Sakshi (22 May 2021). "TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం". Sakshi. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  10. Eenadu (23 May 2021). "TS News: 10 వర్సిటీలకు కొత్త వీసీలు". EENADU. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  11. Namasthe Telangana (24 May 2021). "యూనివర్సిటీ అభివృద్ధికి కృషి : వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్". Namasthe Telangana. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  12. Eenadu (24 May 2021). "ఎవరూ వేలెత్తి చూపని విధంగా పీయూను తీర్చిదిద్దుతా". EENADU. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  13. Namasthe Telangana (23 May 2021). "పాలమూరు వీసీని సన్మానించిన మంత్రి సత్యవతి". Namasthe Telangana. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.