Jump to content

లఖన్ సహదేవ్ మాలిక్

వికీపీడియా నుండి
లఖన్ సహదేవ్ మాలిక్

పదవీ కాలం
(1990-1995), (2009-2014), (2014-2019), (2019 – 2024)
నియోజకవర్గం కరంజా

వ్యక్తిగత వివరాలు

జననం (1964-01-20) 1964 జనవరి 20 (వయసు 60)
వాషిం , మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
సంతానం నితేష్, విజయ్, రోహిత్
వృత్తి రాజకీయ నాయకుడు

లఖన్ సహదేవ్ మాలిక్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు కరంజా శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

లఖన్ సహదేవ్ మాలిక్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పని చేసి 1990 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వాషిమ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంబ్లే భీంరావు హైబతిపై 3907 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 1995, 1999 పోటీకి దూరంగా ఉండి, 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

లఖన్ సహదేవ్ మాలిక్ 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వాషిమ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ అల్కా సత్యభాన్ మకాసరేపై 24229 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2014,[3] 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] 2024 శాసనసభ ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న లఖన్ మాలిక్ కు బీజేపీ టిక్కెట్‌ను కేటాయించలేదు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election Results 1990". Election Commission of India. Retrieved 16 November 2022.
  2. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
  3. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  4. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  5. TimelineDaily (4 November 2024). "BJP Drops Sitting MLA Lakhan Malik From Washim, Fields Shyam Khode" (in ఇంగ్లీష్). Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.
  6. The Times of India (28 November 2024). "BJP Strategy To Drop 7 Sitting MLAs Pays Off In Vidarbha". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.