సిగ్గు

సిగ్గు లేదా లజ్జ (Shyness) అనగా ఒక వ్యక్తి ఇతరులతో కలవడానికి సంశయించడం. ఇది సామాన్యంగా కొత్త వ్యక్తుల్ని లేదా కొత్త ప్రదేశాలలో కలిసినప్పుడు కనిపిస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క జన్యువుల మీద, పెరిగిన సాంఘిక వాతావరణం మీద ఆధారపడుతుంది. ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు.సిగ్గుని అణశీక చికిత్సల్య ద్వారా గానీ, మందుల ద్వారా గానీ నివారించ వచ్చు.
సిగ్గుగా ఉండటం అనేది ఒక వ్యక్తి ఇతరుల మధ్యన ఉల్లాసంగా ఉండలేక పోవడం , అసౌకర్యంగా ఉన్నప్పుడు అనుభూతి చెందుతాడు. కొత్త పరిస్థితులలో లేదా కొత్త వ్యక్తులను కలిసి పరిచయం అవ్వాల్సిన సమయాల్లో కూడా ఇది జరిగే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా తమని గురించి అతి జాగరూకత , ఇతరులు ఏమనుకుంటున్నారో అని , తమని పరీక్ష చెస్తారేమో , లేదా తాము తిరస్కరించబడతామేమో అని భయపెట్టే ఆలోచనలతో వస్తుంది. సిగ్గు తో ఉన్న వ్యక్తులు ఇతరులతో ఉన్నప్పుడు గుండె వేగంగా గట్టిగా కొట్టుకోవడం , చెంపలు తడిసిపోవడం, లేదా నత్తిగా కానీ, వణుకుతూ మాట్లాడటం వంటివి అనుభవించవచ్చు.సిగ్గుని, ఆంతర్ముఖత్వం గా ఉండే వ్యక్తులు తో గాని, సమాజిక ఆందోళన రుగ్మత ఉన్న వారితో కానీ పోల్చకూడదు.
| ఆంతర్ముఖత్వము | సిగ్గు | |
|---|---|---|
| వ్యక్తిత్వ లక్షణం | వ్యక్తిత్వ లక్షణం | మానసిక రుగ్మత |
| తక్కువ ఉత్తేజం కలిగేవి ఇష్టపడతారు | ఇతరులు తమని తప్పుగా అనుకుంటారని భయం | అవమానింప పడతామేమోనని అతిభయం |
| తక్కువ సామాజిక స్పందన | ఆత్మ విశ్వాసం ముఖ్యంగా కొత్త వారితో తక్కువ | సామాజిక స్థితులు ఎంతో వత్తిడి తెస్తాయి |
| ఒంటరి వ్యక్తులు, చిన్న సమూహాలు ఇష్ట పడుతారు | అలవాటు పడ్డ వ్యక్తులతో హాయిగా ఉంటారు. | భయం, ఆందోళనలు తప్పించుకొనేట్లు చేస్తాయి |

సిగ్గుగా ఉండటంలో పలు రకాలు ఉన్నాయి. కొంతమంది ఎల్లప్పుడూ సిగ్గు గా ఉంటారు. మరికొంతమంది కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే సిగ్గు గా ఉంటారు.[3]
సామాజిక సిగ్గు : ఈ రకం ప్రజలు సామాజిక రీతిలో భావనలపట్ల ఆందోళనగా లేదా అసౌకర్యంగా ఉంటారు. వారు కొత్త వ్యక్తులు లేదా గ్రూప్‌లలో చేరటం కష్టంగా అనిపించవచ్చు.
[మార్చు]సంధర్భ సిగ్గు : ఇక్కడ, కేవలం నిర్దిష్ట సందర్భాల్లో మాత్రమే సిగ్గుగా ఉంటారు. ఉదాహరణకు, ఒక సభలో ఉపన్యసించడం, ముఖ్య వ్యక్తిని కలుసుకోవడం లాంటి సందర్భాలు.
[మార్చు]సిగ్గు గా ఉన్న ఎక్స్‌ట్రోవర్ట్స్: ఈ వ్యక్తులు ఇతరుల సమీపంలో ఉండడం ఇష్టపడతారు . కానీ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. వారు సన్నిహితంగా కనిపించవచ్చు కానీ అంతర్గతంగా ఆందోళన పడే అవకాశం ఎక్కువ.
[మార్చు]నిరంతర సిగ్గు : ఈ రకం తీవ్రమైనది. అది వ్యక్తి జీవితంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఎందుకంటే లజ్జా భావన ఎక్కువగా ఉంటుంది.
[మార్చు]అంతర్ముఖ సిగ్గు : ఈ రకమైన వ్యక్తులు చిన్న సమూహాలు గానీ, ఏకాంక సమయాన్ని కాస్త ఇష్టపడతారు. అది ఆందోళన కారణంగా కాదు — ఇది వారి వ్యక్తిత్వం.
[మార్చు]చిన్నప్పుడు సిగ్గు చూపించి పెద్దయినా అలా ఉండే వారు.. తమ భావాలను అదుపులో పెట్టుకొనట్లయితే పెద్దయినా అదే లక్షణాలు కలిగి ఉంటారు.
[మార్చు]- సుమారు 15 శాతం శిశువులు స్వభావం ప్రకారం సిగ్గు పడే విధంగా పుట్టుతారు. సిగ్గు పడే వ్యక్తుల మెదడులో జీవ సంబంధమయిన తేడాలు ఉన్నాయని పరిశోధనలు చూపుతున్నాయి .
- కానీ సిగ్గు పడే వారి ప్రవర్తన సామాజిక అనుభవాల ద్వారా కూడా ప్రభావితమవుతుంది. ఎక్కువ శాతం సిగ్గు పడే పిల్లలకు , తల్లిదండ్రులతో ఉన్న సంబంధాలను పట్టి సిగ్గు పడే స్వభావం పెరుగుతుంది, అని శాస్త్రజ్నులు నమ్ముతున్నారు..
- తల్లిదండ్రులు కఠినంగా ఉన్నవారాయినా , అతి జాగరూకత తో ఉన్నా తమ పిల్లలు సిగ్గు పడటానికి కారణ భూతులవుతారు. అనుభవపూర్వకంగా నేర్చుకోవడాన్ని అరికట్టబడిన పిల్లలు సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో కష్టపడతారు. పిల్లలను పెంచేటప్పుడు స్నేహపూర్వక, శ్రద్ధ తో కూడిన విధానం అవసర.ఇది పిల్లలు ఇతరుల మధ్య ఎక్కువ సౌకర్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
- పాఠశాలలు, ఇరుగు పొరుగు , సమాజం , సంస్కృతి సమిస్టీగా ఒక పిల్లవాడిని రూపొందిస్తాయి. సిగ్గుపడే తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఆ ప్రవర్తనను అనుకరించవచ్చు.
- పెద్దవారిలో చాల వత్తిడి తో కూడిన పని వాతావరణాలు మరియు బహిరంగంగా ఇరులు కించ పరచడం లాంటివి సిగ్గు పడటానికి దారితీయవచ్చు.
- గత అనుభవాలు[5] కొన్నిసార్లు ముందు జరిగిన విషయాలు వ్యక్తులను లజ్జాపరులను చేస్తాయి. వారు పాఠశాలలో పూర్వం ఎప్పుడైనా అవమానించబడ్డా, కస్టపడ్డా , ఇప్పుడు కొత్త వ్యక్తులతో మాట్లాడటం వారికి కష్టంగా అనిపించవచ్చు. చెడు జ్ఞాపకాలు వారితోనే ఉండి అదే విషయాలు మళ్లీ మళ్లీ జరుగుతాయని వారిని ఆందోళనకు గురి చేస్తాయి. వారు వారిని గురించే చెడుగా ఆలోచించడం ప్రారంభించవచ్చు. ఇతరులు వారిని ఇష్టపడరని భయపడవచ్చు. ఎవరైనా చిన్నతనంలో బెదిరింపులకు గురైనా, పెద్ద భయానికి గురైనా, వారు తరచుగా ఈ భయాన్ని పెద్దయ్యాక కూడా జ్ఞాపకం ఉంచుకుంటారు. వారు ఒంటరిగా భావిస్తూ, చాలా విషాదంగా, ఆందోళనగా మారవచ్చు.
- గాయపెట్టే సంఘటనలు గాయపెట్టే సంఘటనలు ఒక వ్యక్తి జీవితంలో లోతుగా నాటుకుపోతాయి. చెడు ప్రమాదాలు, పెద్ద నష్టాలు, చిన్నతనంలో హానికరమైన అనుభవాల వంటివి వారిని తరువాత చాలా లజ్జాపరులను చేస్తాయి. ఆ ఘటనలు జీవితాంతం , భయాందోళనలను రేకెత్తిస్తాయి. అతి సిగ్గు, సామాజిక ఆందోళన కల వారు, చాలా మంది పెద్దలు ఈ గత గాయాల భారాన్ని మోస్తుంటారు. ఆ భయంకరమైన జ్ఞాపకాలు, ఇతరులతో మాట్లాడటం, పెద్ద సమూహాల్లో కలిసి ఉండటం వారికి దుర్భరం అవుతుంది.
సిగ్గుపడే వ్యక్తుల గురించి అనేక అపోహలు, పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నాయి. "సిగ్గుపడిన" వారి ప్రవర్తనకు సహచరుల వెక్కిరింపులు ఎక్కువగా ఉంటాయి. . ఆ సంస్కృతులల్లో , సమాజంలో మౌనం , సౌమ్యతల కు తక్కువ విలువనివ్వడం, తరచుగా అందరితో కలిసే సిగ్గు లేకుండా ఉండే వారిని గౌరవించడం లాంటివి జరుగు తుంటాయి. అంతర్ముఖం గా ఉన్న వారిని తక్కువ గా చూడటం, సామాజిక భయాన్ని సిగ్గుగా అనుకోవడం, సిగ్గుపడే వ్యక్తులు తక్కువ తెలివైనవారని నమ్మడం లాంటి కొన్ని దురభిప్రాయాలు ఉన్నాయి. [7][8][9][10]
తెలివితేటలు
[మార్చు]తెలివితేటల కు , సిగ్గు కి మధ్య ఎటువంటి సానుకూల లేదా ప్రతికూల సంబంధం లేదు.సిగ్గుపడే పిల్లలు చర్చలలో చురుకుగా పాల్గొనకపోవడం వల్ల ఉపాధ్యాయులు వారిని తక్కువ తెలివైనవారిగా చూస్తారు. సహవిద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో కలవడానికి ఇష్టపడని విద్యార్థులు నేర్చుకోవడం మరింత కష్ట తరమవుతుంది. అయితే, సిగ్గు, విద్యా పరమయిన చర్చలలో పాల్గొనటాన్ని పరిమితం చేసినప్పటికీ , ఇది నిజమయిన విద్యా పరిజ్ఞానానికి , అవగాహనకు సంబంధం లేదు.ఉపాధ్యాయుని సొంత సిగ్గు స్థాయిని బట్టి, మరింత పరోక్ష వ్యూహాలతో సిగ్గుపడే వారి జ్ఞానాన్ని అంచనా వేయడానికి ఉపయోగించవచ్చు . మొదట్లో సామాజిక పరస్పర చర్చల సమయంలో సిగ్గుపడే వ్యక్తుల యొక్క సహచరులు, సిగ్గుపడే వ్యక్తులను తక్కువ తెలివైనవారిగా అంచనా వేస్తారు. అయితే, తరువాతి పరస్పర చర్యల సమయంలో, సహచరులు పిరికి వ్యక్తుల తెలివితేటలను గుర్తించి మరింత సానుకూలంగా ఉంటారు .
ప్రయోజనాలు
[మార్చు]సిగ్గుపడే వ్యక్తులు "స్వీయ-విమర్శల వైపు మొగ్గు చూపుతారు కాబట్టి, కేవలం పరిశోధన మరియు రచన వంటి ఒంటరి కార్యకలాపాలలోనే కాకుండా అన్నీ వ్యాసంగాలలో వారు తరచుగా అధిక విజయాలు సాధిస్తారు,. బహుశా స్వతంత్ర సాధన వైపు డ్రైవ్ కంటే, సిగ్గుపడిన వ్యక్తులు తరచుగా పరోపకార ప్రవర్తన ద్వారా ఇతరులతో సంబంధాలు పెట్టుకోవాలని కోరుకుంటారు". సుసాన్ కైన్ సిగ్గుపడే వ్యక్తులు సమాజానికి తీసుకువచ్చే ప్రయోజనాలను వివరించింది, "[11]సిగ్గుపడే వ్యక్తులు ఇతరుల భావోద్వేగాలను గ్రహించడం , ఆలోచనల పై దృష్టి , విలువైన శ్రవణ నైపుణ్యాలు వంటి సామాజిక చర్యల వలన , సమాజానికి సమతుల్యత వస్తుంది .[12] 1950లకు పూర్వపు తరాలలో, సమాజం సిగ్గును మరింత ఆకర్షణీయమైన లక్షణంగా భావించింది, ముఖ్యంగా మహిళల్లో. సిగ్గుపై అభిప్రాయాలు సంస్కృతిని బట్టి మారుతాయని సూచిస్తుంది.[13]
సామాజిక శాస్త్రవేత్త సూసీ స్కాట్ సిగ్గు యొక్క వివరణ మరియు చికిత్సను రోగలక్షణంగా భావించడాన్ని సవాలు చేశారు. "సిగ్గును వ్యక్తిగత రోగంగా పరిగణించి, ఇది సామాజికంగా ఉత్పత్తి చేయబడి, నిర్వహించబడే సామాజిక ఆధారిత మానసిక స్థితి అని కూడా మనం మరచిపోతాము" .మనం ఒకవిధమయిన మోసగాళ్ళం అన్నది ఆవిడ.
విభిన్న సాంస్కృతిక అభిప్రాయాలు
[మార్చు]బహిరంగంగా మాట్లాడటం, అతి విశ్వాసం లాంటి వాటిని విలువైనవిగా భావించే పాశ్చాత్య సంస్కృతులలో, సిగ్గును బలహీనతగా భావించవచ్చు. సానుభూతి లేని పరిశీలకుడికి, సిగ్గుపడే వ్యక్తిని అహంకారి, దూర దూరంగా ఉండేవాడు అని తప్పుగా భావించవచ్చు, ఇది సిగ్గుపడిన వ్యక్తికి నిరాశ కలిగించవచ్చు.అయితే, ఇతర ప్రాచ్య సంస్కృతులలో, సిగ్గు పడే వారు, ఆలోచనాత్మకంగా, తెలివైనవారుగా, మంచి శ్రోతలుగా, మాట్లాడే ముందు ఆలోచించే వారిలా అనుకునే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తారు . "[14]
చార్లెస్ డార్విన్ కు సిగ్గు అనేది మన జాతులకు ఎటువంటి ప్రయోజనం కలిగించని "విచిత్రమైన మానసిక స్థితి",. 1970ల నుండి మనస్తత్వశాస్త్రంలో కొత్త పోకడ , సిగ్గును రోగలక్షణంగా చూడటం.[15]ప్రాచ్య తూర్పు సంస్కృతులలో పాఠశాల వయస్సు పిల్లలలో సిగ్గు-బిడియం సానుకూలంగా కనిపిస్తుంది. ఈ లక్షణాలను ప్రదర్శించే వారిని తోటివారు బాగా చూస్తారు, అంగీకరిస్తారు. వారు తమ ఉపాధ్యాయులచే, సమర్థులుగా, పాఠశాలలో బాగా రాణించే వారీగా పరిగణింపబడతారు. సిగ్గుపడే వ్యక్తులు కూడా పాఠశాలలో నాయకత్వ హోదాను పొందే అవకాశం ఉంది. తూర్పు సంస్కృతులలో, సిగ్గుపడటం మరియు తక్కువ చురుకు గా ఉండటం అనేది మర్యాద, గౌరవం ,ఆలోచనాత్మకతకు చిహ్నంగా భావించబడుతుంది.
సిగ్గు పడటం వలన ఆత్మ స్థైర్యం కోల్పోయి , మానసికంగా బాధ పడుతున్న వారిని మానసిక చికిత్స , మందుల ద్వారా నయం చేయవచ్చు. సిగ్గు యొక్క ఒక ముఖ్యమైన అంశం, సామాజిక నైపుణ్యాల అభివృద్ధి. ఉపాధ్యాయులు వారిని నేరుగా ప్రశ్నలు వేసి వారి భయాన్ని తొలగించవచ్చు [17]పిల్లలను సామాజిక బృంద కాలపాలల్లోనూ , ఆటల లోనూ ఎక్కడయితే జట్టు జట్లుగా పాల్గొనాలో అక్కడికి తీసుకు వెళ్తే, వాళ్ళు కొలు కొనే అవకాశం ఎక్కువ .
కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) :
[మార్చు]CBT, లేదా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సామాజిక ఆందోళన ఉన్న వ్యక్తులకు సహాయపడే ఒక శక్తివంతమైన విధానం. ఈ చికిత్స ఆందోళన ,భయాన్ని తగ్గించడానికి కొత్త ఆలోచనా విధానాలను, ప్రవర్తనను మరియు పరిస్థితులకు స్పందించే విధానాలను నేర్పుతుంది., రోజువారీ జీవితంలో సిగ్గు లక్షణాలను నిర్వహించడానికి మరియు తగ్గించడానికి ఆచరణాత్మక పద్ధతులను అందిస్తుంది.
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం
సిగ్గు మరియు సామాజిక ఆందోళనను అధిగమించడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం.:
ఆలోచనలను తిరిగి రూపొందించుకోవడం :. వక్రీకరించిన ఆలోచనను మనస్సుతో గుర్తించి , దానికి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను పరిశీలించాలి . సంతులిత ఆలోచనలు , సహాయక సాధనాలను ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా దృక్పథాన్ని మార్చాలి .
సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకోండి: కొత్త వారితో సంభాషణను ప్రారంభించడం లేదా సమూహంలో మాట్లాడటం వంటి చిన్న, సాధించగల లక్ష్యాలతో ప్రారంభించాలి . వీటిని సాధించినప్పుడు, వారి విశ్వాసం పెరుగుతుంది.
దృఢ నిశ్చయాన్ని అలవర్చుకోవాలి : సిగ్గు కల వారు తమ అవసరాలను, అభిప్రాయాలను సరయిన రీతిలో చెప్పడం నేర్చుకుంటే, అది సామాజిక సంఘటిత కార్యకాలపాల్లో వారి విశ్వాసాన్ని పెంచుతుంది.
బలాలపై దృష్టి పెట్టండి: వారు తమ నైపుణ్యాలను ,ప్రతిభను గుర్తించాలి. అది గ్రహించిన బలహీనతల నుండి సానుకూల లక్షణాలకు, దృష్టిని మార్చడానికి సహాయపడుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
మద్దతు కోరండి: మద్దతు ఇచ్చే స్నేహితులతో మెలగాలి . వారికి తాము వ్యక్తపరచడానికి సుఖంగా ఉండే సమూహాలలో చేరాలి . తమకు మద్దతు ఇచ్చే వారు ఉన్నారని తెలుసుకోవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
స్వీయ సంరక్షణను స్వీకరించండి: వ్యాయామం, పోషకాహారం మరియు విశ్రాంతి పద్ధతుల ద్వారా వారి శారీరక, భావోద్వేగ శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవడం సానుకూల పెరిగిన ఆత్మవిశ్వాసానికి దోహదం చేస్తుంది.
గత విజయాలను ప్రతిబింబించండి: వారు సవాళ్లు లేదా భయాలను ఎదుర్కొని విజయం సాధించిన సమయాలను గుర్తు చేసుకోంటూ ఉండాలి. ఇది భవిష్యత్ ప్రయత్నాల కోసం ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది.
ఈ వ్యాసం జీవన విధానానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
- ↑ "Adult Shyness: Causes, Signs And Is It A Mental Health Disorder? - MindOwl" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2024-01-12. Retrieved 2025-12-03.
- ↑ "What You Should Know About Shyness". Healthline (in ఇంగ్లీష్). 2013-12-03. Retrieved 2025-12-03.
- ↑ "Adult Shyness: Causes, Signs And Is It A Mental Health Disorder? - MindOwl" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2024-01-12. Retrieved 2025-12-09.
- ↑ "What You Should Know About Shyness". Healthline (in ఇంగ్లీష్). 2013-12-03. Retrieved 2025-12-04.
- ↑ "Adult Shyness: Causes, Signs And Is It A Mental Health Disorder? - MindOwl" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2024-01-12. Retrieved 2025-12-03.
- ↑ Thomas H. Benton (24 May 2004). "Shyness and Academe". The Chronicle of Higher Education. Retrieved 20 October 2013.
- ↑ Paulhus, D. L.; Morgan, K. L. (1997). "Perceptions of intelligence in leaderless groups: The dynamic effects of shyness and acquaintance". Journal of Personality and Social Psychology. 72 (3): 581–591. CiteSeerX 10.1.1.586.2278. doi:10.1037/0022-3514.72.3.581. PMID 9120785.
- ↑ Hughes, K.; Coplan, R.J. (2010). "Exploring processes linking shyness and academic achievement in childhood". School Psychology Quarterly. 25 (4): 213–222. doi:10.1037/a0022070.
- ↑ Coplan, J. R.; Hughes, K.; Bosacki, S.; Rose-Krasnor, L. (2011). "Is silence golden? Elementary school teachers' strategies and beliefs regarding hypothetical shy/quiet and exuberant/talkative children". Journal of Educational Psychology. 103 (4): 939–951. doi:10.1037/a0024551.
- ↑ "All About Shyness". Psych Central. 25 February 2022.
- ↑ Thomas H. Benton (24 May 2004). "Shyness and Academe". The Chronicle of Higher Education. Retrieved 20 October 2013.
- ↑ Cain, Susan (25 June 2011). "Shyness: Evolutionary Tactic?". The New York Times. Archived from the original on 26 September 2013.
- ↑ Cain, Susan (25 June 2011). "Shyness: Evolutionary Tactic?". The New York Times. Archived from the original on 26 September 2013.
- ↑ Chen, X., Rubin, K., Sun, Y. Social Reputation and Peer Relationships in Chinese and Canadian Children: A Cross-Cultural Study. 1992.
- ↑ Moran, Joe (17 July 2013). "The crystalline wall". Aeon. Archived from the original on 9 August 2013.
- ↑ "Adult Shyness: Causes, Signs And Is It A Mental Health Disorder? - MindOwl" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2024-01-12. Retrieved 2025-12-04.
- ↑ . "The Stresses of a "Brave New World": Shyness and School Adjustment in Kindergarten".