Jump to content

తృప్తి

వికీపీడియా నుండి
శాంతి, తృప్తి గల ఎడ్వర్డ్ గుట్జ్ నెర్

తృప్తి లేదా సంతృప్తి అనగా ఏ విషయంలోనైనా Satisfaction లేదా Contentment. దీనికి వ్యతిరేక పదం అసంతృప్తి.

అసంతృప్తి లేదా ఉన్నదానితో తృప్తి పడకపోవటం అనేది ఒక భావోద్వేగాన్ని వర్ణిస్తుంది, ఇది ముఖ్యంగా నిరాశ, నిస్పృహలను కలిగించి తద్వారా ఒకరి ప్రస్తుత పరిస్థితితో విచారాన్ని కలిగిస్తుంది.

ఆకలితో ఉన్నవారికి కడుపునిండా భోజనం పెడితే తృప్తి కలుగుతుంది. కానీ ఎంత ధనాన్ని ఇచ్చినా ఆ తృప్తి రాదు.

పెళ్ళైన దంపతుల మధ్య సంభోగంలో భర్తకి శీఘ్ర స్ఖలనం సమస్య ఉంటే భార్యకు అసంతృప్తిని కలిగిస్తుంది. దీనికోసం దంపతులు నేరుగా సెక్స్‌లో పాల్గొనకుండా ముందు 5-10 నిమిషాల పాటు ఫోర్‌ప్లేలో పాల్గొనాలి. అప్పుడు మనస్సు కాస్త అదుపులో ఉంటుంది. ఇద్దరికీ పూర్తి మూడ్ వచ్చిన తర్వాత అప్పుడు సెక్స్‌లో పాల్గొంటే 2-3 నిమిషాలకే వీర్యం పడిపోయినా అసంతృప్తి అనిపించదు. అప్పటికీ శీఘ్ర స్ఖలనం సమస్య ఉంటే దాని నిరోధానికి మందులతో ప్రమేయం లేకుండా స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్, స్క్వీజ్ టెక్నిక్ ప్రాక్టీసు చేయవచ్చు. వీటిని అభ్యాసం చేస్తే నెల రెండు నెలల్లో శీఘ్ర స్ఖలనం కాకుండా మనస్సుని నియంత్రించుకోవడం సాధ్యమవుతుంది.

స్త్రీపురుషుల మధ్య ప్రాకృతిక సంభోగం సంభవం కానప్పుడు, ఇతర అప్రాకృతిక సంభోగం ఇష్టం లేన్నప్పుడు, తృష్ణ తీరడానికి వెలసుబాటులో ఉన్న ఏకైక మార్గం స్వయంతృప్తి. దీనినే హస్త ప్రయోగం అని కూడా అంటారు. మగవాళ్ళలో, హస్త ప్రయోగం ద్వారా స్కలనం జరిగినప్పుడు కలిగిన తృప్తి, స్త్రీలలో జి స్పాట్ గాని క్లైటోరిస్ గాని ప్రేరేపింపబడి, భావప్రాప్తి (Orgasm) కలిగి తృప్తి పొందడం జరుగుతుంది.

రసాయన శాస్త్రం

[మార్చు]

రసాయన శాస్త్రంలో ద్రావణాలు, వానిలో కరిగిన పదార్ధాల మధ్య సంబంధాన్ని వివరించడానికి కూడా అసంతృప్త, సంతృప్త, అతి సంతృప్త అనే పదాలు ఉపయోగిస్తారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తృప్తి&oldid=3878405" నుండి వెలికితీశారు